అన్వేషించండి

Ram Charan: మీకు విమానాలు ఉన్నా.. ఎందుకు ఈ పని? కపిల్ శర్మ ప్రశ్నకు రామ్ చరణ్ దిమ్మతిరిగే పంచ్!

‘‘RRR అంటే రూపాయ్.. రూపాయ్.. రూపాయ్.. అనేగా అర్థం. అందుకేనా ఆ టైటిల్ పెట్టారు?’’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను రోస్ట్ చేసిన కపిల్ శర్మ.

పిల్ శర్మ.. హిందీ తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ పేరు పరిచయమే. SET Indiaలో ప్రసారమయమ్యే ‘The Kapil Sharma Show’లో పాల్గోవడాన్ని బాలీవుడ్ సెలబ్రిటీలు గొప్పగా భావిస్తారు. ఆ షోలు కపిల్ తమని రోస్ట్ చేస్తాడని తెలిసినా సరే.. సెలబ్రిటీలు తమ సినిమాల ప్రమోషన్స్ కోసం వెళ్తుంటారు. అత్యంత ప్రజాధారణ కలిగిన ఈ షోలో ఇప్పుడు RRR టీమ్ కూడా పాల్గొంది. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ షో జనవరి 1, 2 తేదీల్లో ప్రసారం కానుంది. 

ఇటీవలే ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, అలియా భట్‌లు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సెట్‌లో సందడి చేశారు. కండల వీరుడితో ‘నాటు నాటు నాటు’ అంటూ నాటు స్టెప్పులు వేయించారు. ఇప్పుడు ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సెట్’ టీవీ గురువారం ఈ షో ప్రోమో రిలీజ్ చేసింది. రామ్, ఎన్టీఆర్, రాజమౌళి ఎంట్రీతోనే కపిల్ శర్మ పంచుల వర్షం కురిపించాడు. గ్రూప్ ఫొటో తీసుకుంటున్న కెమేరా మ్యాన్‌‌తో.. ‘‘ఈ ఫొటో నా ఇన్‌స్టా్గ్రామ్‌లో పెట్టి.. నాకు వాళ్లు గొప్ప ఫ్యాన్ అని రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రకటించారని పోస్ట్ చేయ్’’ అని అన్నాడు. 

‘‘ఎన్టీఆర్ గారు మీరు ఎయిర్ పోర్ట్‌కు వెళ్తే.. మీరు ఎన్టీఆర్ అని చెబితే పనైపోతుందా? లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చూపించాలా?’’ అని కపిల్ అడిగాడు. ఆ తర్వాత రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయనకు విమానాల సంస్థ ఉంది. హోటళ్లు, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంత డబ్బు ఉన్నా మీరు ఎందుకు తెగ పనిచేసేస్తున్నారు. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చుగా’’ అని అన్నాడు. ఇందుకు రామ్ చరణ్ చాలా తెలివైన సమాధానం చెప్పాడు. ‘‘నేను కేవలం విమాన సంస్థకు యజమానిగా మిగిలిపోతే.. నేను ఈ షోలోకి రాలేను కదా’’ అని పంచ్ వేశాడు. 

రాజమౌళిని ప్రశ్నిస్తూ... ‘‘ఆర్ఆర్ఆర్‌కు మరో టైటిల్ ఎందుకు పెట్టలేదు? రూపియా.. రూపియా.. రూపియా.. రావాలంటూ RRR అని పెట్టారా?’’ అని అడిగాడు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. టైటిల్ కోసం చాలా ఆలోచించారని అన్నాడు. కపిల్ స్పందిస్తూ.. ‘‘మీరు టైటిల్ గురించి ప్రత్యేకంగా ఆలోచించక్కర్లేదు. ‘ఇదే నా తర్వాతి సినిమా’ అని చెబితే చాలు.. అదే టైటిల్’’ అని అన్నాడు. 

ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్‌పై వచ్చిన మీమ్స్ చూపిస్తూ.. ఇద్దరిని కపిల్ కాసేపు నవ్వించాడు. రణవీర్ సింగ్, రామ్ చరణ్.. ఓ స్పోర్ట్స్ కారు మీద కూర్చున్న ఫొటోను చూపిస్తూ.. ఎంత ఖరీదైన కారైనా సరే.. ఫొటో కోసం దాని బొన్నెట్ పైనే కూర్చోవాలంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌ను కపిల్ చదివి వినిపించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి.. RRR సెట్‌లో ఐడీ కార్డులను ధరించిన ఫొటో చూపిస్తూ.. ‘‘మీరు సెట్‌లో ఐడీ కార్డు ఎందుకు వేసుకున్నారు. మీ పేరు మీద మరెవ్వరైనా మీల్స్ తినేస్తున్నారా?’’ అనే కామెంట్‌ను చదివాడు. ‘‘మీల్స్ అయితే పర్వాలేదు.. మీ పేరుతో మరెవ్వరో హీరోయిన్‌తో రొమాన్స్ చేయడం లేదు కదా’’ అనే కామెంట్‌ను కపిల్ చదవగానే.. అంతా పగలబడి నవ్వారు. ఈ ప్రోమో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు. 

Also Read: ప్రేమలో కళ్లు మూసుకుపోయాయ్... కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ లాస్య
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
Also Read: నాలుగు గోడల మధ్య జరిగేది... నచ్చేలా చూపించారు... 2021లో బోల్డ్ అటెంప్ట్స్!
Also Read: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
Also Read: ప్రేమ‌క‌థ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వ‌చ్చింది? రాజ‌మౌళి వైఫ్ చేసిందేమిటి?
Also Read: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh Vs Prakash Raj: దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
Maa Inti Bangaram: వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
Gautam Ghattamaneni: ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget