(Source: ECI/ABP News/ABP Majha)
Kannada Movies Interesting Facts: కన్నడ చిత్రసీమలో అరుదైన రికార్డులెన్నో - 500 సార్లు రీరిలీజై 100 రోజులు ఆడిన సినిమా ఇదే!
కన్నడ చిత్రసీమవైపు ఇప్పుడు దేశమంతా చూస్తోంది. అయితే శాండల్ వుడ్ గురించి ఎక్కువమందికి తెలియని టాప్-10 విషయాలేంటో చూద్దాం.
కేజీఎఫ్, విక్రాంత్ రోణ, చార్లీ 777, కంతార... ఏడాది గ్యాప్ లో వచ్చిన ఈ నాలుగు కన్నడ సినిమాలు.... దేశం మొత్తం తమ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేశాయి. అసలు ఇంతకాలం సౌత్ ఇండస్ట్రీ అంటే అందరి దృష్టీ ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాల మీదే. లాక్ డౌన్ లో మలయాళ సినిమా కంటెంట్ ను అందరూ ఆహ్వానిస్తూ వచ్చారు. కానీ కన్నడ సినిమా ఎప్పుడూ రేస్ లో కాస్త వెనుకపడ్డట్టే కనిపించేది. అయితే ఇప్పుడు శాండల్ వుడ్ వంతు వచ్చింది. మొదట్నుంచి ఈ ఇండస్ట్రీపై అంతగా ఫోకస్ లేకపోవడంతో... వీరికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అంత ఎక్కువమందికి తెలియదు. అలాంటి టాప్-10 సంగతులేంటో చూద్దాం.
1. భారతీయ సినిమాలో వచ్చిన తొలి అండర్ వాటర్ సినిమా... ఒందు ముత్తిన కథె. ఇది కన్నడ సినిమా
2. భారత చలనచిత్ర చరిత్రలో ఓ సినిమాను తొలిసారిగా 6 భాషల్లో రీమేక్ చేసిన ఘనత కన్నడ సినిమా అనురాగ అరళితు దక్కించుకుంది.
3. ఇండియన్ సినిమాలో డాక్టరేట్ పొందిన తొలి నటుడు డాక్టర్ రాజ్ కుమార్. అలాగే యూఎస్ఏ ఇచ్చే ప్రతిష్ఠాత్మక కెంటకీ కల్నల్ అవార్డు అందుకున్న ఏకైక ఇండియన్ యాక్టర్ కూడా రాజ్ కుమారే.
4. జేమ్స్ బాండ్ తరహాలో ఇండియాలో వచ్చిన తొలి మూవీ కన్నడసీమ నుంచే. దాని పేరు జెడర బలే. 1968లో వచ్చింది.
5. ఆఫ్రికాలో షూటింగ్ జరుపుకున్న తొలి సౌత్ సినిమా కూడా కన్నడదే. దానిపేరు ఆఫ్రికాదళ్లి షీలా.
6. ఓ సింగిల్ థియేటర్ లో 2 కోట్లు కలెక్ట్ చేసిన తొలి సౌత్ ఇండియన్ సినిమా... ఆప్తమిత్ర. అదే చంద్రముఖి మాతృక సినిమా. అప్పుడు టికెట్ ధర కేవలం 30 రూపాయలే. ఈ రికార్డ్ సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి రిలీజ్ దాకా... అంటే సుమారు 11 ఏళ్లు అలానే ఉంది. బాహుబలి దీన్ని బ్రేక్ చేయగలిగింది.
7. దేశవ్యాప్తంగా మంచి ప్రాచుర్యం పొందిన మాల్గుడి డేస్ అనే సీరియల్ చేసిన డైరెక్టర్ శంకర్ నాగ్.... ఓ సిరీస్ కు ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా ఘనత సాధించారు.
8. మల్టీప్లెక్స్ లో 500 రోజుల పాటు ఆడిన ఏకైక సినిమా... పునీత్ రాజ్ కుమార్ నటించిన మిలాన.
9. సౌత్ ఇండస్ట్రీలో తొలిసారి 70 కోట్లు సాధించిన సినిమా... ముంగరు మళె. 2006లో రిలీజ్ అయింది. దీని బడ్జెట్ కేవలం 70లక్షలు మాత్రమే.
10. ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్క రీ-రిలీజ్ కే హంగామా జరుగుతోంది కానీ.... కన్నడ సినిమా ఓం ఇప్పటికి 500 సార్లకుపైగా రీ-రిలీజ్ అయింది. రీ-రిలీజుల్లో కూడా 100 రోజులు ఆడిన రికార్డు ఉంది. ఈ సినిమా హీరో శివ రాజ్ కుమార్. ఈ రకంగా కన్నడ సినిమా ఇండస్ట్రీ ఖాతాలో చాలా అరుదైన రికార్డులు ఉన్నాయి.
Also Read : మళ్ళీ ట్రోల్స్ మొదలు - విష్ణు మంచుపై 'జిన్నా' విడుదలకు ముందు ఎందుకిలా?