Kannada actor Darshan : హీరోపై చెప్పుతో దాడి - పునీత్ రాజ్‌కుమార్ బతికుంటే సపోర్ట్ చేసేవాడా?
కన్నడ హీరో దర్శన్ మీద ఆదివారం దాడి జరిగింది. పునీత్ రాజ్‌కుమార్ అభిమానిగా చెబుతున్న ఒకరు చెప్పులు విసిరారు. దీనిపై మరో హీరో సుదీప్ స్పందించారు.
కన్నడ కథానాయకుడు దర్శన్ (Darshan Thoogudeepa) మీద ఆదివారం అనూహ్యంగా దాడి జరిగింది. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'క్రాంతి'. వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నారు. దాని ప్రమోషన్స్ కోసం కర్ణాటకలోని హోస్‌పేటలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఓ సాంగ్ విడుదల చేశారు. వేదికపై హీరోయిన్ రచితా రామ్ మాట్లాడుతుండగా... ఓ చెప్పు వచ్చి పడింది. అది నేరుగా హీరో దర్శన్‌కు తగిలింది. వేదిక ముందు ఉన్న ప్రేక్షకులలో ఒకరు కావాలని హీరోకి తగిలేలా చెప్పు విసిరారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాడి ఎందుకు చేశారు?
ఇటీవల ఓ వీడియో ఇంటర్వ్యూలో అదృష్ట (లక్ష్మి) దేవిపై దర్శన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యింది. అదృష్ట దేవత ఎప్పుడూ తలుపు తట్టదని, ఆమె తలుపు తట్టినప్పుడు చెయ్యి పట్టుకుని లాగాలని, బెడ్ రూమ్‌లోకి లాగి వివస్త్ర చేయాలని, ఒకవేళ ఆమె ఒంటి మీద దుస్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతుందని దర్శన్ మాట్లాడారు. ఆయన అలా మాట్లాడటం హిందువుల మనోభావాలను కించపరచడం అని ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు. మరికొందరు మహిళలపై దాడులు చేసే వాళ్ళను ప్రేరేపించే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
No filter pic.twitter.com/tliTlJ87Or
— ಟ್ರೋಲ್ ಹೈಕ್ಳು (@TrollHaiklu) December 8, 2022
దర్శన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చెప్పు విసిరినట్టు ఆ దాడికి పాల్పడిన వ్యక్తి వెల్లడించినట్టు కన్నడ చిత్రసీమ కథనం. అతడు తనను తాను దివంగత పునీత్ రాజ్ కుమార్ అభిమానిగా పేర్కొన్నాడు. కన్నడ నాట వినిపించే మరో వెర్షన్ ఏంటంటే... దర్శన్, పునీత్ అభిమానుల మధ్య చాలా ఏళ్ళుగా వైరం ఉంది. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ వాగ్వాదాలకు దిగుతారు. సోషల్ మీడియాలో గొడవలు కూడా పడ్డారు. పునీత్ అభిమానిగా చెప్పుకునే వ్యక్తి చేసిన దాడి వల్ల గొడవ కొత్త మలుపు తీసుకుంది.
ಹೊಸಪೇಟೆಯಲ್ಲಿ ಕ್ರಾಂತಿ ಸಿನಿಮಾ ಹಾಡು ಬಿಡುಗಡೆ ವೇಳೆ ದರ್ಶನ್ ಮೇಲೆ ಚಪ್ಪಲಿ ಬಿಸಾಕಿದ ವ್ಯಕ್ತಿ..!@dasadarshan @Dbeatsmusik
— ಕನ್ನಡಿಗ ಕೃಷ್ಣ ❁ (@kannadigkrishna) December 19, 2022
#Hospete #DBoss #Boss #D #Darshan #DarshanThoogudeepaSrinivas #Kranti #KrantiMovie #KrantiMovieSong #KannadigaKrishna pic.twitter.com/DA0DrH0SGP
దాడిని ఖండించిన శివన్న
దాడి జరిగిన తర్వాత దర్శన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే, ఆ కోపాన్ని దర్శన్ చల్లార్చే ప్రయత్నం చేశారు. ''ఇది నీ తప్పు కాదు బ్రదర్. నో ప్రాబ్లమ్'' అని ఆయన చెప్పారు. అది ఊహించని ఘటనగా పేర్కొన్నారు. దాడి జరిగిన తర్వాత కూడా ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈవెంట్స్ చేశారు. అయితే, ఈ దాడిని పునీత్ అన్నయ్య, కన్నడ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు అందరూ శివన్న అని పిలుచుకునే శివ రాజ్ కుమార్ ఖండించారు.
మానవత్వం ఎవరూ మరువకూడదు - శివన్న
దర్శన్ మీద హోస్‌పేటలో జరిగిన దాడి తనను బాధించిందని శివ రాజ్ కుమార్ ట్వీట్ చేశారు. ఓ వీడియో విడుదల చేసిన ఆయన ''మన కుటుంబంలో వ్యక్తికి ఈ విధంగా జరగడం బాధాకరం. అటువంటి చర్చలు మానవీయం కాదు. ప్రతి ఒక్కరూ మానవత్వం మరువకూడదు. ద్వేషాన్ని కాదు, ప్రేమను పంచండి'' అని కోరారు.
ನೆನ್ನೆ ಹೊಸಪೇಟೆಯಲ್ಲಿ ದರ್ಶನ್ ಅವರ ಮೇಲೆ ನಡೆದ ಕೃತ್ಯ ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ನೋವುಂಟು ಮಾಡಿದೆ. ಈ ರೀತಿಯ ಅಮಾನವೀಯ ಘಟನೆ ಒಂದೇ ಮನೆಯವರಂತಿರುವ ಎಲ್ಲರಿಗೂ ನೋವುಂಟು ಮಾಡುತ್ತದೆ.
— DrShivaRajkumar (@NimmaShivanna) December 19, 2022
ಮನುಷ್ಯತ್ವ ಮರೆತು ಯಾರೂ ಈ ರೀತಿಯ ಕೃತ್ಯಗಳನ್ನು ನಡೆಸಬಾರದು ಎಂದು ವಿನಂತಿಸುತ್ತೇನೆ
ಅಭಿಮಾನದಿಂದ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿ; ದ್ವೇಷ ಅಗೌರವವನ್ನಲ್ಲ
ನಿಮ್ಮ
ಶಿವಣ್ಣ pic.twitter.com/34eJfpdmKk
పునీత్ బతికుంటే సపోర్ట్ చేసేవాడా? - సుదీప్
ఇతరులను ప్రేమించడం, గౌరవించడం మన సంస్కృతి అని చెప్పిన హీరో కిచ్చా సుదీప్... సోషల్ మీడియాలో మూడు పేజీల లేఖ విడుదల చేశారు. దర్శన్ మీద చెప్పుతో జరిగిన దాడి వీడియో గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ... అది తనను చాలా డిస్టర్బ్ చేసిందన్నారు. పునీత్ అభిమానులకు, దర్శన్‌కు మధ్య పరిస్థితులు అంత బాలేదన్న సంగతి తనకు తెలుసునని సుదీప్ చెప్పారు. ఇటువంటి ఘటనలను పునీత్ అభినందించేవాడా? సపోర్ట్ చేసేవాడా? అని ఆయన క్వశ్చన్ చేశారు. అతడిపై ఆ విధంగా చేయడం తగదన్నారు. ఇప్పుడు దర్శన్ మీద జరిగిన దాడి, ఆ తర్వాత హీరోల ఖండన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
Rebellion isn't always an Answer.
— Kichcha Sudeepa (@KicchaSudeep) December 20, 2022
❤️🙏🏼 pic.twitter.com/fbwANDdgP0