Kanchana 3 Actress Death: గోవాలో ‘కాంచన 3’ నటి అనుమానస్పద మృతి.. కారణం ఇదేనా?
‘కాంచన 3’ సినిమాలో నటించిన అలెగ్జాండ్రా జావు గోవాలో అనుమానస్పద స్థితిలో మరణించింది. పోలీసులు ఆమె మాజీ ప్రియుడిని అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

కొరియోగ్రాఫర్, నటుడు స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంచన 3’ సినిమాలో నటించిన విదేశీ యువతి అలెగ్జాండ్రా జావు అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. రష్యాకు చెందిన అలెగ్జాండ్రా సినిమా అవకాశాల కోసం ఇండియాలోనే ఉంటోంది. ఇటీవల గోవాలోని ఓ హోటల్‌లో రూమ్ తీసుకుని ఉంటుంది. శుక్రవారం (ఆగస్టు 20) తేదీన అలెగ్జాండ్రా గదిలో శవమై కనిపించింది. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు. అయితే, పోస్ట్‌మార్టం రిపోర్టులు ఇంకా రావల్సి ఉంది.
ప్రేమే కారణమా?: అలెగ్జాండ్రా ప్రియుడు ఇటీవలే ఆమెకు బ్రేకప్ చెప్పాడు. అప్పటి నుంచి ఆమె డిప్రషన్‌లో ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో గోవా పోలీసులు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. అయితే, 2019లో ఆమె ఓ చెన్నై ఫొటోగ్రాఫర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు తనని లైంగికంగా వేదిస్తున్నాడని తెలిపింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆమె మరణంలో అతడి హస్తం ఉందనే అనుమానాలతో పోలీసులు ఆ ఫొటోగ్రాఫర్‌ను కూడా అదుపులోకి తీసుకోనున్నారని తెలిసింది. అలెగ్జాండ్ర మరణ వార్త తెలియగానే రష్యా రాయబార కార్యాలయం ప్రతినిధులు గోవాకు చేరుకున్నారు. ఆమె భౌతిక కాయాన్ని రష్యాలోని తల్లిదండ్రుల ఇంటికి తరలించనున్నారు.
Also Reda: ‘మా’ భవనానికి స్థలం చూశా.. నాగబాబు సవాల్‌కు విష్ణు జవాబ్ ఇదేనా? కన్నెందుకు కొట్టావంటూ ట్రోల్స్
రాఘవ లారెన్స్ హీరోగా.. ఆయన దర్శకత్వంలోనే రూపొందిన చిత్రం ‘కాంచన 3’. ఈ హర్రర్ చిత్రం గత సీరిస్‌ల తరహాలో ఆశించిన విజయం సాధించలేదు. ఈ చిత్రంలో అలెగ్జాండ్రా లారెన్స్ ఫ్లాష్‌బ్యాక్ సీన్లో కనిపిస్తుంది. చనిపోయిన తర్వాత పగ తీర్చుకొనే దెయ్యం పాత్రలో ఆమె నటించింది. ఈ చిత్రంలో ఒవియా, వేదిక, నిక్కి తంబోలీలు లారెన్స్ సరసన హీరోయిన్లుగా నటించారు. అలెగ్జాండ్రాకు కేవలం 24 ఏళ్లు మాత్రమే. రంగుల ప్రపంచంలో అవకాశాలు కోసం వచ్చిన ఆమె చిన్న వయస్సులోనే ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరం. ఆమె మరణవార్త విని తమిళ చిత్ర సీమ విషాదంలో మునిగింది.
Also Reda: కేజీఎఫ్ ఛాప్టర్ - 2 రిలీజ్ డేట్ వచ్చేసింది... కానీ, ట్విస్టు ఏంటంటే...
Also Read: బ్రేక్‌టైమ్‌లో గన్ ఎక్కుపెట్టిన పవర్ స్టార్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు
Also Read: ఓటీటీలో బాబాయ్ అబ్బాయ్ వెంకీ - రానా సందడి... ఈసారి పూర్తి స్థాయిలో ప్లాన్!
Also Read:ఇప్పటి వరకు బన్నీతో గొడవ పడ్డ ఆ నటుడు ఇకపై చెర్రీతో ఫైట్‌కు రెడీ అవుతాడట!
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















