అన్వేషించండి

Maharagni Teaser: మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కాజోల్, ప్రభుదేవా - ‘మహారాగ్ని‘ టీజర్ చూస్తే మతిపోవాలంతే!

సుమారు 27 ఏళ్ల తర్వాత కాజోల్- ప్రభుదేవా నటిస్తున్న సినిమా ‘మహారాగ్ని‘. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రభుదేవాకు మించిన యాక్షన్ సన్నివేశాలతో కాజోల్ ఆకట్టుకుంది.

Maharagni Teaser Out: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా నటించిన ‘మెరుపు కలలు‘ సినిమా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 1997లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలోని ‘వెన్నెలవే వెన్నెలవే’ అనే పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ అందించిన మ్యూజిక్ మరో లెవల్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలై 27 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో కాజల్, ప్రభుదేవా జోగీ మరోసారి జతకట్టబోతున్నారు.

‘మహారాగ్ని‘ని తెరకెక్కిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్

టాలీవుడ్ డైరెక్టర్ చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకుడిగా కాజల్, ప్రభుదేవా జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్నది. ఈ సినిమాకు ‘మహారాగ్ని‘ అనే పేరు పెట్టారు. ఈ మూవీతోనే చరణ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా కాలం తర్వాత కాజోల్, ప్రభుదేవా సినిమా చేయడం పట్ల ప్రేక్షకులలో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ బ్యూటీ సంయుక్త మీనన్‌ బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి కాగా,తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.    

ఆకట్టుకుంటున్న ‘మహారాగ్ని’ టీజర్

ప్రభుదేవా బ్యాట్‌ తో ఓ వ్యక్తిని వెంటాడుతున్న సీన్ తో ‘మహారాగ్ని’ టీజర్ ప్రారంభం అవుతుంది. ఈ వీడియోలో నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్‌ ను కూడా పరిచయం చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కాజోల్ జాతరలోకి కారులో ఎంట్రీ ఇస్తుంది. రెడ్ సూట్ లో స్టైలిష్ గా కారులో నుంచి దిగి అమ్మవారికి నమస్కారం చేసి గూండాలను చితకబాదుతుంది. ‘అడిగి శక్తిని పొందడం కాదు, పోరాడి పొందాలి” అంటూ కాజోల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. భావోద్వేగాలు, మనసును కదిలించే యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే అవకాశం ఉంది. ఈ టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kajol Devgan (@kajol)

‘మహారాగ్ని’ దేశ వ్యాప్తంగా పలు భాషల్లో  

‘మహారాగ్ని’ సినిమా దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ లాంటి స్టార్ యాక్టర్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అటు ప్రస్తుతం కాజోల్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. చివరగా ఆమె ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ లో కనిపించింది. ప్రస్తుతం ‘దో పట్టి’,'సర్జమీన్' సినిమాల్లో నటిస్తోంది. హారర్ చిత్రం 'మా' లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. అటు ప్రభుదేవా దళపతి విజయ్ ప్రధాన పాత్రలో 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

Read Also: మాసిన గడ్డం, నోట్లో సిగరెట్ - అల్లరి నరేష్ ‘బ‌చ్చల మ‌ల్లి’ ఫస్ట్ లుక్ అదుర్స్ అంతే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget