అన్వేషించండి
Advertisement
Kajal Aggarwal: 'హే నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నీకు తెలుసా?' నవదీప్ కి కాజల్ క్వశ్చన్
తన పుట్టినరోజు నాడు 'లవ్ మౌళి' అనే సినిమాలో నటించబోతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు కనిపించని డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు నవదీప్.
'జై' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్.. తన కెరీర్ లో విభిన్నమైన పాత్రల్లో నటించిన ప్రేక్షకులను అలరించారు. హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశారు. ఈ మధ్యాకాలంలో నవదీప్ ప్రధాన పాత్రల్లో సినిమా రాలేదు. చాలా కాలం తరువాత హీరోగా ఓ సినిమా చేస్తున్నారు నవదీప్.
తన పుట్టినరోజు నాడు 'లవ్ మౌళి' అనే సినిమాలో నటించబోతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు కనిపించని డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు నవదీప్. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సపోర్ట్ గా నిలిచింది కాజల్. ఈరోజు ఉదయమే కాజల్ ని థాంక్స్ చెబుతూ ఓ లెటర్ ను షేర్ చేశారు నవదీప్.
ఇప్పుడేమో కాజల్ 'లవ్ మౌళి' సినిమా నుంచి చిన్న వీడియోను షేర్ చేసింది. దీనికి 'హే మౌళి నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నీకు తెలుసా..?' అంటూ క్యాప్షన్ షేర్ చేసింది. 'చూడు చెప్తా' అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు నవదీప్. ఇక కాజల్ రివీల్ చేసిన వీడియోలో నవదీప్ తనకు ఎలాంటి అమ్మాయి కావాలో కవిత రూపంలో చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా అవనీంద్ర చూసుకుంటున్నారు. నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తోన్న ఈ సినిమాకి గోవింద్ వసంత మ్యూజిక్ అందిస్తున్నారు.
Hey Mouli, Neeku yelanti Ammai kavalo Neeku thelusa?
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 12, 2022
Goodluck to the entire team, can’t wait to watch the film ❤️https://t.co/quwPQzDhpe#AnanthaSriram #lovemouli #navdeep2.0 #govindvasanthamusical@PankhuriGidwan1@pnavdeep26
Dear @MsKajalAggarwal pic.twitter.com/niqI7tstIQ
— Navdeep (@pnavdeep26) February 11, 2022
Revealing a glimpse of mouli's love :) @MsKajalAggarwal thanks again :) pic.twitter.com/BRm0dpO7BY
— Navdeep (@pnavdeep26) February 12, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement