NTR: 'మావయ్య.. మీరు త్వరగా కోలుకోవాలి.. మళ్లీ రావాలి'.. యంగ్ టైగర్ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి.. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ట్వీట్ వేయగా.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన మావయ్య త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కోవిడ్ బారిన పడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న కరోనా బారిన పడ్డారు. కోవిడ్ లక్షణాలు లేనప్పటికీ.. ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లో ఉంటున్నానని చెప్పారు. ఈ మధ్యకాలంలో తనను కలిసినవారిని టెస్ట్ లు చేయించుకోమని సూచించారు.
ఇక ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు చంద్రబాబు. కరోనా పాజిటివ్ అని రిజల్ట్ రాగానే ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నానని.. అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రీసెంట్ గా తనను కలిసినవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు చంద్రబాబు. వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే క్వారంటైన్‌లోకి వెళ్లాలని చెప్పారు. అందరూ సేఫ్‌గా, జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు కోరారు.
చంద్రబాబుకి కరోనా సోకిందని తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా రికవర్ అవ్వాలని పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. చంద్రబాబు,లోకేష్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ వేయగా.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన మావయ్య త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అలానే లోకేష్ కూడా కోవిడ్ నుంచి బయటపడాలని కోరుకున్నారు. ఇదివరకు ఎన్టీఆర్ కి కరోనా వచ్చినప్పుడు చంద్రబాబు కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ పెట్టారు.
Wishing you Mavayya @ncbn garu and @naralokesh a speedy recovery. Get well soon! https://t.co/cygw7hmARc
— Jr NTR (@tarak9999) January 18, 2022
Wishing @ncbn garu and @naralokesh speedy recovery! Please take care and get well soon!
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2022
Also Read: ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. 60 ఏళ్ల వృద్ధుడిగా బాలయ్య..





















