అన్వేషించండి

Jr NTR Pranathi : ఇట్స్ ఫ్యామిలీ టైమ్ - న్యూయార్క్ వీధుల్లో భార్యతో ఎన్టీఆర్

న్యూయార్క్ వీధుల్లో అర్ధాంగి లక్ష్మీ ప్రణతితో కలిసి ఎన్టీఆర్ సరదాగా షికార్లు చేస్తున్నారు. ఫ్యామిలీ టైమ్ అంటే ఏంటనేది చూపిస్తున్నారు.

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) అమెరికాలో ఉన్నారు. ఇది మనకు తెలిసిన సంగతి. ఈ నెల రెండవ శుక్రవారంలో భార్య లక్ష్మీ ప్రణతీ (Lakshmi Pranathi), పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి ఫారిన్ ట్రిప్ వేశారు. అక్కడ పూర్తిగా ఫ్యామిలీకి టైమ్ కేటాయించారు. 

న్యూయార్క్ వీధుల్లో...
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇప్పుడు ఎన్టీఆర్ షికారు చేస్తున్నారు. అదీ ఓ సాధారణ పౌరుడిగా! సాధారణంగా హీరోలు ఎక్కడికి వెళ్ళినా అభిమానులు వాళ్ళను చుట్టుముడతారు. ఇండియాలో తిరగడం కష్టం. బహుశా... అందుకేనేమో ఎన్టీఆర్ అమెరికా వెళ్ళారు. న్యూయార్క్ రోడ్స్ మీద భార్యతో దిగిన ఫోటోను లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

న్యూయార్క్ వీధుల్లో ఫోటో షేర్ చేయడానికి ముందు రోజు, అమెరికన్ రెస్టారెంట్‌లో షెఫ్‌లతో దిగిన ఫోటో షేర్ చేశారు. మంచి స్పైసీ ఫుడ్ తిన్నారని పేర్కొన్నారు. దాని కంటే ముందు భార్యను హగ్ చేసుకున్న ఫోటో ఒకటి షేర్ చేశారు. పూర్తిగా తన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయించారు ఎన్టీఆర్. అమెరికాలో అందరికీ, ముఖ్యంగా సోషల్ మీడియాకి దూరంగా తిరుగుతున్నారు 

Also Read : బాలకృష్ణ - పవన్ కళ్యాణ్ - 'అన్‌స్టాపబుల్‌ 2' షూటింగ్ షురూ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

నెల రోజులు అమెరికాలో!
NTR New Year Celebrations :  ఎన్టీఆర్ ఫ్యామిలీ అమెరికా ట్రిప్ నెల రోజులు ఉంటుందని సన్నిహిత వర్గాలు తెలిపారు. కొత్త ఏడాదికి అక్కడే ఆయన వెల్కమ్ చెప్పనున్నారు. అలాగే, అమెరికాలో క్రిస్మస్ వేడుకలను వీక్షించనున్నారు. మధ్యలో కొంత మంది బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అభిమానులను ఎన్టీఆర్ కలిసి అవకాశం ఉందట. ఇటీవల రాజమౌళి అమెరికా వెళ్ళారు. చికాగోలో 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ నామినేషన్స్ కోసం ప్రచారం చేశారు. మరి, ఎన్టీఆర్ టూర్ ప్లానింగులో అటువంటిది ఉందో? లేదో? తెలియాలి.

సంక్రాంతికి ముందు ఇండియాకు!      
సంక్రాంతికి ముందు ఎన్టీఆర్ ఇండియా రానున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి తర్వాత, జనవరి సెకండాఫ్‌లో సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులను మెప్పించేలా కొరటాల శివ చాలా పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రుడు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రమిది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయి. దీనికి 'దేవర' టైటిల్ ఖరారు చేసినట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని ఎన్టీఆర్ 30 యూనిట్ వర్గాలు అప్పుడు కన్ఫర్మ్ చేశాయి.

'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత పాన్ ఇండియా మాత్రమే కాదు... జపాన్, వెస్ట్రన్ కంట్రీస్‌లో కూడా ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు. ఆయన్ను అభిమానించే ప్రేక్షకులు పెరిగారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. అన్ని భాషలకు పరిచయమైన నటీనటులు ఎక్కువ మంది సినిమాలో ఉండనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Embed widget