News
News
X

Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా

సోహైల్... రెండేళ్ళ క్రితం 'బిగ్ బాస్'లోకి వెళ్ళి వచ్చారు. ఇనయా... ఆ షో నుంచి లేటెస్టుగా వచ్చారు. బిగ్ బాస్ ఇంటిలోనే సోహైల్ అంటే తనకు క్రష్ అని చెప్పారు. ఇప్పుడు ఏకంగా అతనికి ప్రపోజ్ చేశారు. 

FOLLOW US: 
Share:

Bigg Boss Inaya Proposes Sohel : ఇనయా రెహమాన్... 'బిగ్ బాస్'తో బుల్లితెర వీక్షకుల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న భామ. ఆమెకు సోషల్ మీడియాలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. ఆమె మీద తనకు క్రష్ ఉందని పోస్టులు చేస్తున్న జనాలు ఉన్నారు. మరి, ఆమెకు ఎవరు అంటే క్రష్? సోహైల్. ఈ మాట 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు చెప్పారు. 

ఇప్పుడు 'బిగ్ బాస్' ఇంటి నుంచి ఇనయా (Bigg Boss Inaya Sultana) బయటకు వచ్చారు. అంతే కాదు... సోహైల్ (Syed Sohel Ryan) ను కలిశారు. ఆమె మనసులో ప్రేమను బయట పెట్టారు. 

'మీ కోసం ఒక సర్ ప్రైజ్ ఉంది' అని ఇనయా రెహమాన్ చెప్పగా... సోహైల్ షాక్ అయ్యారు. 'నువ్వు రాగానే నేను షాక్ అయిపోయా. ఇంటి ఇలా వచ్చింది' అని అనేశారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ''నేను బయటకు వచ్చాక (బిగ్ బాస్ ఇంటి నుంచి) ఏం చేయలేదు. మీతోనే మాట్లాడాలని ఇలా వచ్చాను'' అని ఇనయా అనడంతో సోహైల్ థాంక్స్ చెప్పారు. 

''ఒకటి చెప్పదలచుకున్నాను... మీరు ఏం అనుకున్నా పర్వాలేదు. నా మనసులో ఉన్నది నేను చెబుతా'' అని రోజ్ ఫ్లవర్ బొకే తీసుకుని సోహైల్ ముందు మోకాళ్ళ మీద కూర్చుని మరీ ఇనయా ప్రపోజ్ చేశారు. ''ప్రేమ ఉన్నంత వరకూ కాదు... నా ప్రాణం ఉన్నంత వరకూ ప్రేమిస్తా'' అనేసరికి సోహైల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తర్వాత రోజ్ ఫ్లవర్ బొకే నుంచి ఒక్క గులాబీ తీసి అతనికి ఇచ్చారు. ''నీ కోసం రెడీ అయ్యాను. మీకు ప్రపోజ్ చేయాలని ఇలా వచ్చా. నాకు సోహైల్ అంటే పిచ్చి'' ఇనయా రెహమాన్ చెప్పుకొచ్చారు. అదీ సంగతి! 

Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?

ఇనయా ప్రేమకు సోహైల్ ఓకే చెప్పాడా? లేదా? అనేది త్వరలో తెలుస్తుంది. 'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన తర్వాత సోహైల్ సినిమాలతో బిజీగా అయ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'లక్కీ లక్ష్మణ్' (Lucky Lakshman Movie) డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో మోక్ష హీరోయిన్. ఎ.ఆర్. అభి దర్శకత్వం వహించారు. దత్తాత్రేయ మీడియా పతాకంపై హరిత గోగినేని' నిర్మించారు. 

తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట. ఆల్రెడీ విడుదల అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్ యువతను అట్ట్రాక్ చేసింది. ''ఆస్తుల్ని  అమ్ముకున్నోడు అయినా పైకి వస్తాడు ఏమో గానీ... అమ్మాయిలను నమ్ముకున్నోడు మాత్రం పైకి రాలేదురా'' అని హీరో సోహైల్ టీజర్ లో చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read : ఎన్టీఆర్ మనిషిగా ముద్రపడిన చలపతి రావు రియల్ లైఫ్ తెలుసా?

సోహెల్, మోక్ష జంటగా నటించిన 'లక్కీ లక్ష్మణ్' సినిమాలో దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, రచ్చ రవి , 'జబర్దస్త్' కార్తిక్, జబర్దస్త్ గీతూ రాయల్, 'కామెడీ స్టార్స్' ఫేమ్ యాదమ్మ రాజు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి నృత్యాలు : విశాల్, కూర్పు : ప్రవీణ్ పూడి,  ఎగ్జిక్యూటివ్ నిర్మాత : విజయానంద్ కీత,  ఛాయాగ్రహణం : ఐ. ఆండ్రూ, పాటలు : భాస్కరభట్ల రవికుమార్, సంగీతం : అనూప్ రూబెన్స్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం : ఏఆర్ అభి.

Published at : 27 Dec 2022 08:41 AM (IST) Tags: Bigg Boss Telugu Syed Sohel Bigg Boss Inaya Sultana Inaya Sohel Love

సంబంధిత కథనాలు

బుల్లితెరపై ఇక ‘ఆనందం’ హీరో ఆకాశ్ సందడి - సీరియల్స్‌లోకి ఎంట్రీ?

బుల్లితెరపై ఇక ‘ఆనందం’ హీరో ఆకాశ్ సందడి - సీరియల్స్‌లోకి ఎంట్రీ?

Pathaan Film: ‘పఠాన్’ చూసేందుకు బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన ఫ్యామిలీ, షారుఖ్ పై అభిమానం అలాంటిది మరి!

Pathaan Film: ‘పఠాన్’ చూసేందుకు బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన ఫ్యామిలీ, షారుఖ్ పై అభిమానం అలాంటిది మరి!

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

టాప్ స్టోరీస్

YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !

YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం  !

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!

TSPSC Group 4: 'గ్రూప్‌-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!