News
News
X

ఎన్టీఆర్ కోసం రోజూ దేవుడుని ప్రార్థించాను: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్

ఎన్టీఆర్ తో నటించాలని తన డ్రీమ్ అని అది ఈ సినిమాతో నెరవేరుతుందని జాన్వీ గతంలో పలు మార్లు చెప్పింది. అయితే ఇటీవల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యల చేసింది జాన్వీ.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్టులలో ‘ఎన్టీఆర్ 30’ ఒకటి. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై ముందునుంచీ అంచనాలు ఉన్నాయి. అతి త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవలే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు జాన్వీ లుక్ ను కూడా విడుదల చేశారు. అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిపిస్తోన్న జాన్వీ లుక్ పై మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. ఎన్టీఆర్ తో నటించాలని తన డ్రీమ్ అని అది ఈ సినిమాతో నెరవేరుతుందని జాన్వీ గతంలో పలు మార్లు చెప్పింది. అయితే ఇటీవల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వీ. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలతో ‘ఎన్టీఆర్ 30’ సినిమాపై మరింత ఉత్కంఠ పెరిగింది.

ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో కలసి నటించడం తన డ్రీమ్ అని మరోమారు వెల్లడించింది జాన్వీ. ఆయనతో కలసి పనిచేయడం అదృష్టం అని పేర్కొంది. అందుకోసం ప్రతి రోజూ దేవుణ్ణి ప్రార్థించేదానినని చెప్పింది. తన కోరిక ఇప్పుడు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానం అని ఆయనతో కలసి పనిచేయడం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది. సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నానని పేర్కొంది. సెట్స్ లోకి ఎప్పుడు అడుగుపెడదామా అనే ఉత్కంఠ రోజు రోజుకూ పెరిగిపోతుందని, అందుకే రోజూ దర్శకుడు కొరటాల శివకు మెసేజ్ లు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇటీవలే తాను ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను మరోసారి చూశానని, ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన, ఎనర్జీ వేరే లెవల్ లో ఉంటాయని కితాబిచ్చింది. 

దివంగత నటి శ్రీదేవీ బోణికపూర్ ల కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. అతి కొద్ది కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ పరిశ్రమ కుటుంబంలో పుట్టినందుకు ఆనందిస్తున్నానని, తన విజయానికి కారణం తన త్లలిదండ్రులేనని పేర్కొంది జాన్వీ. అయితే తను ధరించే దుస్తులు గురించి కాకుండా నటన గురించి మాట్లాడుకోవాలని ఆశిస్తున్నానని చెప్పింది. తాను పబ్లిక్ లైఫ్ లో ఉండటం వలన ఏం చేసినా చర్చించుకుంటారని, అందుకే అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని చెప్పింది. విమర్శల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాలని చెప్పింది జాన్వీ. ఈ సినిమాతో టాలీవుడ్ జాన్వీ కు ఎలా కలసి వస్తుందో చూడాలి. ఇక ‘ఎన్టీర్ 30’ సినిమా అతి త్వరలో షూటింగ్ ను ప్రారంభించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి 2024 ఏడాది మధ్యలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!

Published at : 19 Mar 2023 07:44 PM (IST) Tags: Janhvi Kapoor Jr NTR Koratala Shiva NTR30

సంబంధిత కథనాలు

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Kangana Ranaut on Thalaivii: కంగనాకు ‘తలైవి’ రూపంలో కొత్త చిక్కులు, ఆరు కోట్లు ఇవ్వాలంటూ ఆ సంస్థ డిమాండ్?

Kangana Ranaut on Thalaivii: కంగనాకు ‘తలైవి’ రూపంలో కొత్త చిక్కులు, ఆరు కోట్లు ఇవ్వాలంటూ ఆ సంస్థ డిమాండ్?

Padipotunna Song : ప్రేమలో 'పడిపోతున్న' అబ్బాయ్ - 'గేమ్ ఆన్'లో కొత్త సాంగ్ 

Padipotunna Song : ప్రేమలో 'పడిపోతున్న' అబ్బాయ్ - 'గేమ్ ఆన్'లో కొత్త సాంగ్ 

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Chiranjeevi - Brahmanandam : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'

Chiranjeevi - Brahmanandam : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'

టాప్ స్టోరీస్

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

AP Highcourt : చట్ట ప్రకారమే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు - కర్నూలుకు తరలించాలంటే ఏం చేయాలో చెప్పిన కేంద్రం !

AP Highcourt : చట్ట ప్రకారమే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు - కర్నూలుకు తరలించాలంటే ఏం చేయాలో చెప్పిన కేంద్రం !