Janaki Kalaganaledu November 8th: అఖిల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు- జానకిని తప్పుబట్టిన రామా
అఖిల్ మాధురి మీద ఎటాక్ చేయడం జానకి చూడటంతో కథ కీలక మలుపు తీసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి మాధురి వాళ్ళ తల్లిదండ్రులకి ధైర్యం చెప్తుంది. మీ కూతురికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను అని మాట ఇస్తుంది. జానకి ఎక్కడికి వెళ్ళిందా అని మల్లిక టెన్షన్ పడుతుంది. ఎక్కడ తన కడుపు డ్రామా బయటపడుతుంటే అని భయపడుతుంది. జ్ఞానంబ కూడా జానకి కోసం ఎదురుచూస్తూ కంగారుపడుతుంది. ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళింది అంటే గుడికి వెళ్ళి ఉంటుందని గోవిందరాజులు అంటాడు. అప్పుడే పోలీసుల కారు ఇంటి ముందు ఆగుతారు. అది చూసి మల్లిక నోరెళ్ళబెడుతుంది. నన్ను పోలీసులకి పట్టించడానికి తీసుకొచ్చేసిందని దాక్కుంటుంది.
ఇంటికి పోలీసులు రావడం చూసి అందరూ షాక్ అవుతారు. మీ ఇంట్లో ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఫైల్ అయింది అరెస్ట్ చేసి తీసుకెళ్దామని వచ్చామని ఇన్స్పెక్టర్ చెప్తాడు. అది విని జ్ఞానంబ షాక్ అవుతుంది. అంత పెద్ద నేరం మా ఇంట్లో వాళ్ళు ఎవరు చేశారని జ్ఞానంబ అడిగేసరికి అఖిల్ పేరు చెప్తాడు ఎస్సై. అఖిల్ అనే వ్యక్తి ఒక అమ్మాయి మీద మర్డర్ ఎటెంప్ట్ చేశాడని పోలీస్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అఖిల్ మీద కేసు పెట్టింది కూడా మీ ఇంట్లో మనిషే అని పోలీస్ చెప్పేసరికి అఖిల్ జానకి అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. జానకి గారు అని పోలీస్ చెప్పటప్పుడు ఇంట్లోకి జానకి వస్తుంది. రామా జానకిని విషయం ఏంటి అని అడుగుతాడు.
Also Read: నందు, మాధవి మాటల యుద్ధం- 'ఆర్య' స్టైల్ లో సామ్రాట్ తో మనసులు మార్చుకుందామన్న తులసి
జ్ఞానంబ కూడా నిలదీసే స్థాయి దాటి పోలీస్ కేసు పెట్టె దగ్గరకి వచ్చిందంటే వాడి జీవితం నాశనం అవుతుందని పోలీసులని వెళ్లిపొమ్మని చెప్తుంది. క్షమించండి అత్తయ్యగారు ఇది నింద కాదు నిజం అని జానకి అంటుంది. మాధురి అనే అమ్మాయి మీద అఖిల్ హత్యాప్రయత్నం చేశాడు అనేదానికి నేనే ప్రత్యక్ష సాక్షిని, అందుకే నేనే స్వయంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్తుంది. అఖిల్ దోషి అనే అనుమానం ఉంటే వదినగా నేనే ఎంక్వైరీ చేసే దాన్ని కానీ తను తప్పు చెయ్యడం నేనే కళ్ళారా చూశానని చెప్తుంది. ఒక్కోసారి మన కళ్ళు మనలనే మోసం చేస్తాయి ఆలోచించమని గోవిందరాజులు చెప్తాడు. ఇప్పుడిప్పుడే అఖిల్ తన కెరీర్ మీద దృష్టి పెడుతున్నాడు ఇలా జరిగితే తన కెరీర్ నాశనం అవుతుందని జెస్సి బతిమలాడుతుంది.
రామా కూడా పోలీసులని వెనక్కి వెళ్లిపొమ్మని చెప్పమని చెప్తాడు. నేను కంప్లైంట్ ఇచ్చాను అని కాదు అఖిల్ నేరం చేశాడో లేదో తననే ఆడగమని జానకి చెప్తుంది. దీంతో రామా అఖిల్ ని పిలుస్తాడు. అఖిల్ ఏం తెలియని వాడిలా వస్తాడు. హత్యాప్రయత్నం చేశావా అని రామా అడిగితే అదేమీ లేదు అంతా అబద్ధం అని అఖిల్ చెప్తాడు. అసలు ఆ మాధురి ఎవరో కూడా తనకి తెలియదని చెప్తాడు. తను ఏ తప్పు చేయలేదని ఏడుస్తున్నట్టు నాటకం ఆడతాడు. ఈ కేసులో ఇరికించి తన లైఫ్ నాశనం చేయొద్దని అడుగుతాడు.
Also Read: 'నీ కోడలు మాయమ్మే' అనిచెప్పిన దేవి, రుక్మిణి చెంప పగలగొట్టిన దేవుడమ్మ- సత్యకి కొత్త కథ చెప్పిన మాధవ్