అన్వేషించండి

Gruhalakshmi November 8th: నందు, మాధవి మాటల యుద్ధం- 'ఆర్య' స్టైల్ లో సామ్రాట్ తో మనసులు మార్చుకుందామన్న తులసి

తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో సీరియల్ కొత్త మలుపు తిరిగింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

పుట్టినరోజు వేడుకలు చేసేందుకు పరంధామయ్య ఒప్పుకోడు. ఇదే విషయం గురించి నందు, అనసూయ మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకుగా పక్కన ఉండి కూడా ఆయన్ని పుట్టినరోజు చేసుకోవడానికి ఒప్పించలేకపోతున్నా ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదని నందు అంటుంటే తులసితో చెప్పిస్తే ఒప్పుకుంటాడని లాస్య ఎంట్రీ ఇస్తుంది. ఇది వెటకారం కాదు నిజం.. ఇది విషం తాగాలని చెప్తే నవ్వుతూ తాగేస్తారు అది ఆయనకి ఆమె మీద ఉన్న అభిమానం అని అంటుంది. తులసి నా వాళ్ళని తన వైపుకి తిప్పుకునే లోపు తన బంధాలని తెంపేస్తాను అని అనసూయ అంటుంటే నేను అదే పని చేస్తానమ్మ అని మాధవి ఎంట్రీ ఇస్తుంది.

మాధవి: గుడిలో దేవతని అవమానించి మరీ తరిమేశారు మనసు ఎలా వచ్చిందమ్మా, మీరు చేసిన పని తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది

నందు: మాట అనేముందు ఏం జరిగిందో తెలుసుకుంటే మంచిది

మాధవి: వదిన చెప్పిన మాటలు మీరు నమ్మలేదు ఇక నామాటలు ఎలా వింటారు. చెప్పుడు మాటలు విని ఎలాగైనా శిక్షించాలి అనుకున్నారు

Also Read: 'నీ కోడలు మాయమ్మే' అనిచెప్పిన దేవి, రుక్మిణి చెంప పగలగొట్టిన దేవుడమ్మ- సత్యకి కొత్త కథ చెప్పిన మాధవ్

 లాస్య: తల్లితో మాట్లాడే పద్ధతి ఇది కాదు

మాధవి: నీ దగ్గర పద్ధతులు నేర్చుకోను, అలా చేస్తే తోడేలు దగ్గర ప్రవచనాలు విన్నట్టే.. ఏమ్మా నీ కొడుకు వేరే దానితో ఎఫైర్ పెట్టుకుంటే అది గొప్పగా అనిపించింది, నీ కూతురులాంటి కోడలికి ఉన్న స్నేహం మాత్రం తప్పుగా అనిపించిందా గ్రేట్.. ఒకే ఇంట్లో మనిషికి మనిషికి ఒక్కొక రూల్ ఉందా

అనసూయ: నువ్వు ఏం చేస్తున్నావో తెలుస్తుందా తులసి కోసం తల్లిని ఎదిరించి మాట్లాడతావా

మాధవి: మాట్లాడతాను.. దేవతలాంటి వదిన మీద ఉన్న ప్రేమ అది. రాత్రి పగలు అని తేడా లేకుండా ఈ తల్లికి, అన్నకి ఇరవైయారెళ్ళు ఊడిగం చేసింది. పనిమనిషిలాగా తల వంచుకుని బతికింది. మీరు వదిన మంచితనం మర్చిపోయిన నేను మర్చిపోను నేను మనిషిని రాక్షసిని కాదు, వదిన పట్ల మీ ప్రవర్తన తలుచుకుంటే సిగ్గుగా అనిపిస్తుంది

నందు: మాధవి ఆపు..

మాధవి: ఆపను.. నీకోక మొగుడు, నీకోక పెళ్ళాం ఉన్నప్పుడే బరితెగించి ఎఫైర్ పెట్టుకున్నారు అది తప్పుగా అనిపించలేదు

లాస్య: మాధవి చాలు మీ వదిన తరపు వకాల్తా పుచ్చుకుని వచ్చి ఉంటే ఇక్కడ నుంచి వెళ్లిపో

Also Read: మాధవ్ దేవి తండ్రి కాదని తెలిసి షాకైన సత్య- ఆదిత్యతో తిరగొద్దని రుక్మిణికి చెప్పిన రామూర్తి

తులసి, సామ్రాట్ కొత్త ఇంటిని చూస్తూ ఉంటారు. తులసి మనసులు మార్చుకుందామా అని ఆర్య స్టైల్ లో డైలాగ్ వేస్తుంది. సామ్రాట్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. తులసి తన చరిత్ర మొత్తం చెప్తుంది. సామ్రాట్ ని చూపించి ఇతను నా ఫ్రెండ్ అప్పుడప్పుడు నా కోసం వస్తూ ఉంటారని చెప్తుంది. నేను కూడా సింగిల్ లేడి అనే ఇంటి ఓనర్ చెప్తుంది. ఇల్లు ఇవ్వడానికి ఎవరు ముందుకు వచ్చే వారు కాదని ఆమె తన గతం కూడా చెప్పేస్తుంది.  మీ ఇల్లుని తులసిగారు గుడిగా మార్చేస్తుందని సామ్రాట్ చెప్తాడు. ఇంటి తాళాలు ఇస్తుంది.

నందు: తులసి చేసే తప్పులు కూడా నీకు ఒప్పులే, తను నీకు దేవత మేము నీకు రాక్షసులం.. మమ్మల్ని నీ ఫ్యామిలిగా చెప్పుకుంటే సిగ్గుగా అనిపిస్తే మమ్మల్ని మర్చిపో. తులసిని, నిన్ను, ఈ ఇంటి బాధ్యతల్ని మోసింది నేనే. 26 ఏళ్లుగా మీ వదిన నీ కోసం చేసింది గుర్తుంది కానీ మీ అన్నయ్య 40 ఏళ్లు చేసింది నీకు గుర్తులేదు. గ్రేట్ మీ అన్న చేసిన త్యాగాలు మర్చిపోయి మాట్లాడుతున్నావ్ తెలుస్తుందా, ఇవన్నీ నాకు చెప్పుకోవాలని లేదు. ఇంత చేసిన కూడా నీకు మాకంటే ఆ పరాయి మనిషే ఎక్కువ అయింది. హ్యపీగా ఆ మనిషి దగ్గరకే వెళ్ళు. కానీ వెళ్ళే ముందు ఒక చిన్న పని చెయ్యి నా రుణం తీర్చి వెళ్ళు, నీకోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసా తీర్చి వెళ్ళు

మాధవి: డబ్బులు నందు అకౌంట్ కి వేస్తుంది. నీ రుణం తీర్చుకున్నా చూసుకో.. ఇంకా బ్యాలెన్స్ ఉంటే చెప్పు తీర్చేస్తా. అమ్మా.. నన్ను కనడానికి ఎంత డబ్బులు ఇవ్వాలో చెప్పు ఆ రుణం కూడా తీర్చుకుంటాను

నందు: ఇక బయల్దేరు

తులసి అద్దెకి ఇల్లు దొరికినందుకు తెగ సంతోషపడుతుంది

తరువాయి భాగంలో..

అర్థరాత్రి పరంధామయ్య కి విషెస్ చెప్దామని నందు, అనసూయ, లాస్య వెళతారు. కానీ బెడ్ మీద దిండ్లు పెట్టి దుప్పటి కప్పి పరంధామయ్య తులసి ఇంటికి వెళతాడు. అక్కడ తులసి ఆయన పుట్టినరోజు వేడుక ఘనంగా జరిపిస్తుంది. అదంతా అభి చాటుగా చూసి కోపంతో రగిలిపోతాడు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Anna Konidela Divorce : పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రోడ్డు మీద ప్రమిదలు అమ్ముతున్న క్రిష్! కొడుకుని పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చేసిన మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రోడ్డు మీద ప్రమిదలు అమ్ముతున్న క్రిష్! కొడుకుని పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చేసిన మహా!
Godavari Serial Today November 10th: 'గోదావరి' సీరియల్: సంజయ్ గతం ఇదే! సంజు కోసం మనసు మార్చుకున్న జాను!
'గోదావరి' సీరియల్: సంజయ్ గతం ఇదే! సంజు కోసం మనసు మార్చుకున్న జాను!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
YSRCP On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
KA Paul: నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Embed widget