Janaki Kalaganaledu November 22nd: జానకిపై రామాకి మొదలైన అనుమానం- కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ తో నిజం బట్టబయలు
జానకి కుటుంబం కోసం తన ఐపీఎస్ చదువుని వదిలేసుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రామా జానకి కాలేజీకి వెళ్ళకుండా అబద్ధం చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే జానకి పాలు తీసుకొచ్చి రామాకి ఇస్తుంది. చదువుకోకుండా ఇంట్లో వంటల గురించి మాట్లాడుతూ ఉంటుంది. కాలేజీకి ఆలస్యంగా వెళ్తాను అని చెప్పి ఎందుకు వెళ్లలేదని రామా జానకిని అడుగుతాడు. అంత ఇంపార్టెంట్ క్లాసులు లేవని వెళ్లలేదని జానకి చెప్తుంది. మరి అమ్మకి కాలేజీ లేదని అబద్ధం ఎందుకు చెప్పారని అంటాడు. అంతా చెప్పడం ఎందుకని అలా చెప్పానని సర్ది చెప్తుంది. ముఖ్యమైన క్లాసులు లేకపోవడం ఏంటి అని రామా చదువు గురించి మాట్లాడుతుంటే జానకి మాత్రం ఇడ్లీ, టిఫిన్, పాలు, పెరుగు అని తప్పించుకుని వెళ్ళిపోతుంది.
చదువు విషయంలో జానకి నిర్లక్ష్యంగా ఉందని రామా అనుమానంగా ఉంటాడు. జానకి చదువుకోకుండా పడుకుని నిద్రపోతుంది. ఆలస్యం అయినా కూడా చదువుకున్న తర్వాతే నిద్రపోయే జానకి చదువుకోకుండా పడుకుంటుంది ఏంటి అని రామా ఆలోచనలో పడతాడు. చికితా పొద్దున్నే కాఫీ తీసుకొచ్చి మల్లికని నిద్రలేపుతుంది. అది చూసి మల్లిక చికితని తెగపొగిడేస్తుంది. ఆ కాఫీ తాగి ఛీ అని ఊసేస్తుంది. ఇది కలబంద కాఫీ ఉదయాన్నే ఇది తాగితే ఆరోగ్యానికి మంచిదని పెద్దమ్మగారు ఇవ్వమని చెప్పారని చికిత చెప్తుంది. పొద్దున్నే మళ్ళీ రామా జానకి కోసం వెతుకుతూ ఉంటాడు. జానకి మాత్రం బట్టలు ఉతుక్కుంటూ ఉంటుంది. కాలేజీకి వెళ్ళడానికి టైమ్ అవుతుంటే బట్టలు ఆరేసుకుంటున్నారు ఏంటి అంటాడు.
Also Read: అర్థరాత్రి ఉద్యోగం కోసం రోడ్డు మీద పడ్డ పరంధామయ్య- ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ప్రేమ్
చికితని పిలిచి పని మనిషిని పెట్టాను కదా మరి జానకి బట్టలు ఆరేస్తుంది ఏంటని అడుగుతాడు. మీకు సంబంధించిన పనులన్నీ అమ్మగారె చేస్తాను అని చెప్పారు, ఎందుకో రెండు రోజుల నుంచి అమ్మగారిలో చాలా మార్పు వచ్చిందని చికిత రామాతో చెప్తుంది. రామా జానకిని పిలిచి కాలేజీ గురించి మాట్లాడుతుంటే తను మాత్రం మళ్ళీ అదేమీ పట్టించుకోకుండా టిఫిన్ తినడానికి రమ్మని చెప్తుంది.
గోవిందరాజులు డల్ గా వచ్చి కూర్చుంటాడు. తన ఆరోగ్యం గురించి బాధపడుతూ ఉంటాడు. భర్తగా, తండ్రిగా బాధ్యతలు సరిగా నిర్వర్తించలేకపోయాను అని ఇంటి భారాన్ని మీరే మోస్తున్నారని గోవిందరాజులు అంటాడు. ఇద్దరూ కలిసి రామా గురించి మాట్లాడుకుని మెచ్చుకుంటారు.
రామాకి జానకి కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి తను కాలేజీకి రావడం లేదు ఏంటి అని అడుగుతుంది. ఇవి చాలా ముఖ్యమైన క్లాసులు వినకపోతే ఐపీఎస్ అవ్వడం కష్టం అని ఆమె చెప్తుంది. ఇంట్లో చిన్న సమస్య వచ్చింది ఇక నుంచి జానకిని క్రమం తప్పకుండా క్లాస్ కి తీసుకొస్తాను అని చెప్తాడు. రామా ఇంటికి వచ్చి జానకిని పిలుస్తాడు. జానకి కనిపించదు, గదిలో ఆమె చదువుకునే పుస్తకాలు కూడా కనిపించవు. అవి మూట కట్టి కబోర్డ్ లో ఉండటం రామా కంట పడుతుంది. చదువు కోసం కొన్న పుస్తకాలు కట్టకట్టి ఇక్కడ పెట్టారు ఏంటి అని ఆలోచిస్తాడు. చికిత చెప్పినట్టు జానకిలో చాలా మార్పు వచ్చిందని, చదువు గురించి అడుగుతుంటే మాట దాటేస్తున్నారని అనుకుంటాడు.
Also Read: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వేద, మాళవిక- ముందు యష్ ఎవరిని కాపాడతాడు?
జానకి గుడిలో దేవుడి ముందు దణ్ణం పెట్టుకుంటూ బాధపడుతుంది. నాన్నగారి ఆశ, తన ఆశయాన్ని వదిలేసినందుకు బాధగా ఉందని చెప్పుకుంటుంది. వెనక్కి తిరిగేసరికి జానకి వాళ్ళ వదిన, మేనల్లుడు ఉంటారు. తనని చూసి చాలా సంతోషిస్తుంది. తండ్రి కల గుర్తు చేసుకుని దాన్ని నిర్వర్తించలేకపోతున్నందుకు ఫీల్ అవుతుంది. తను బాధపడటం చూసి జానకి వదిన ఏం జరిగిందని అడుగుతుంది. ఐపీఎస్ ట్రైనింగ్ ఎంతవరకు వచ్చిందని జనికిని అడుగుతుంది. ఆ మాటకి జానకి మౌనంగా బాధపడుతుంది.