News
News
X

Gruhalakshmi November 22nd: అర్థరాత్రి ఉద్యోగం కోసం రోడ్డు మీద పడ్డ పరంధామయ్య- ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ప్రేమ్

అనసూయ చేసిన గొడవ వల్ల పరంధామయ్య తులసి ఇంట్లోనే ఉండిపోతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

పరంధామయ్య నిద్రలో కూడా జరిగింది తలుచుకుని ఉలిక్కిపడుతూ ఉంటాడు. తులసి ధైర్యం చెప్తూ ఉంటుంది కానీ ఆయన ప్రవర్తనలో మార్పు రాదు. తులసి దుప్పటి తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్ళి వచ్చేసరికి పరంధామయ్య బెడ్ మీద ఉండడు. దీంతో తులసి కంగారుగా రోడ్డు మీద పడి ఆయన కోసం వెతుకుతూ ఉంటుంది. సామ్రాట్ కి ఫోన్ చేసి విషయం చెప్పి ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు. చాలా డిప్రెషన్ లో ఉన్నారు. మన మాట వినే పరిస్థితిలో లేరు ఏమైనా చేసుకుంటారో ఏమో అని తులసి కంగారు పడుతుంది. రోడ్డు మీద వెతుకుతూ ఉండగా ఒక చోట పరంధామయ్య సెక్యూరిటీ గార్డు దగ్గర మాట్లాడుతూ ఉంటాడు.

Also Read: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వేద, మాళవిక- ముందు యష్ ఎవరిని కాపాడతాడు?

ఏదైనా సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఉంటే చూడు అని అతన్ని అడుగుతాడు. అది చూసి తులసి, సామ్రాట్ చాలా బాధపడతారు. ఇంత వయస్సులో నీకు ఉద్యోగం ఎందుకు పెద్దాయన అని ఆ సెక్యూరిటీ గార్డు అడుగుతాడు. ‘నాకు ఒక కూతురు ఉంది కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది, తనే నాకు ఆశ్రయం ఇచ్చింది, తను ఇప్పటికీ సమస్యలో ఉంది, నేను మళ్ళీ సమస్య కాకూడదు’ అని తన బాధ వెళ్లగక్కుతాడు. భార్య లేదా అని సెక్యూరిటీ అడిగితే చచ్చిపోయిందని చెప్తాడు. తులసి అదంతా విని ఆవేదనగా వెళ్ళి నన్ను కూడా చంపేస్తున్నారా అని బాధపడుతుంది. ‘ఏదో ఒక కష్టం చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నా, ఇన్నేళ్ల తర్వాత సంపాదన లేని వాడిని అనిపించుకున్నా, నలుగురు నన్ను మోసుకుపోయే వరకు నా బరువు, బాధ్యతలు నన్ను మోసుకొనివ్వు’ అని పరంధామయ్య ఎమోషనల్ గా అడుగుతాడు.

అనసూయ ఏమి జరగనట్టు ఇంట్లో పూజ చేస్తుంది. అది చూసి లాస్య బిత్తరపోతుంది. రాత్రే కదా రాక్షసిలా అరిచింది.. పొద్దున్నే ఇలా ఎలా అయ్యిందని లాస్య మనసులో అనుకుంటుంది. పూజ చేసి ఇంట్లో వాళ్ళందరికీ హారతి ఇస్తుంది. మావయ్యని ఇంటికి తీసుకురావాలని లాస్య అంటుంది. ఆయనకి ఆయనే ఇంటికి వస్తారని అనసూయ చాలా ధీమాగా చెప్తుంది. నిన్న అరిచాను కదా తెల్లారేసరికి ఆయన కోపం చల్లారిపోతుంది, ఆయనే ఇంటికి తిరిగివస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు కూతురు గుర్తుకు వచ్చింది. ఇప్పుడు కూతురు దగ్గర ఉన్నారు కదా ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది ఆయనే వచ్చేస్తారని అంటుంది.

News Reels

Also Read: మీడియా ముందు అడ్డంగా బుక్కైన రిషి, వసు- మహేంద్ర ఎంట్రీ అదుర్స్, దేవయాని ప్లాన్ తుస్స్

తులసి మాములుది కాదు పుట్టినరోజు పేరుతో మీ భార్యా భర్తల మధ్య చిచ్చుపెట్టింది. వెళ్ళి తీసుకుని రావాలి పదండి అని లాస్య చెప్తుంది. కానీ అనసూయ మాత్రం ఆయన గురించి నాకు బాగా తెలుసు వస్తారులే అంటుంది. తులసి ఒకప్పటిది కాదు మీగురించి చెడుగా చెప్పిందంటే ఆయన అసలు రారు అని ఎక్కిస్తుంది. లాస్య ఎన్ని చెప్పినా కూడా వినదు, ఆయనంతట ఆయనే తిరిగివస్తారు అనేసి వెళ్ళిపోతుంది. పరంధామయ్య డల్ గా కూర్చుని ఉంటే ఆయన మూడ్ మార్చేందుకు తులసి, సామ్రాట్, సామ్రాట్ బాబాయ్ ప్రయత్నిస్తారు. ప్రేమ్, శ్రుతి బ్యాగ్ తీసుకుని బయల్దేరతారు. ఎక్కడికి అని అనసూయ అడుగుతుంది. అప్యాయతలు దొరికే చోటకి అని ప్రేమ్ చెప్తాడు. లాస్య వచ్చి మీ అమ్మ దగ్గరకి వెళ్తున్నారని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా అని అంటుంది.

తాతయ్యని అనారాని మాటలు అన్నావ్ అవమానించావ్, ఇన్నాళ్ల కాపురం తర్వాత తాతయ్యని అన్ని మాటలు ఎలా అన్నావ్ అని ప్రేమ్, శ్రుతి అడుగుతారు. మీ మనసులో ప్రేమ బదులు విషం నింపుకున్నావ్, రేపు మాకు ఇదే జరగదని గ్యారెంటీ ఏంటి అని ప్రేమ్ అడుగుతాడు.

Published at : 22 Nov 2022 08:14 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial November 22nd Update

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

Bigg Boss 6 Telugu: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

Unstoppable 2 Episode 5 : లెజెండరీ దర్శక నిర్మాతలతో 'లెజెండ్' బాలకృష్ణ - ఈ వారం 'అన్‌స్టాపబుల్' మామూలుగా ఉండదు

Unstoppable 2 Episode 5 : లెజెండరీ దర్శక నిర్మాతలతో 'లెజెండ్' బాలకృష్ణ - ఈ వారం 'అన్‌స్టాపబుల్' మామూలుగా ఉండదు

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్