అన్వేషించండి

Janaki Kalaganaledu March 17th: రామకి నిజం చెప్పిన జానకి- కోడలి క్షమాపణలు అంగీకరించని జ్ఞానంబ

జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

జానకి ఇంట్లో జరిగే వ్రతానికి వెళ్ళకుండా మనోహర్ చేస్తాడు. పెద్ద కోడలు లేదని వ్రతానికి వచ్చిన అమ్మలక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడి జ్ఞానంబని అవమానిస్తారు. జానకమ్మ ఒక్కరోజు వ్రతానికి రాకపోతే అన్ని నిందలు వేయాలా అని మలయాళం అంటాడు. ఇప్పుడు ఏం మాట్లాడిన ప్రయోజనం ఉండదు కట్టుకున్న వాడే మౌనంగా ఉన్నాడని గోవిందరాజులు బాధపడతాడు. జరిగిందేదో జరిగిందని సైలెంట్ గా ఉండకు రాగానే గట్టిగా నిలదీయ్యి అని జ్ఞానంబకి ఎక్కిస్తారు. అప్పుడే జానకి ఇంట్లోకి వస్తుంది. తనని చూసి ఆడవాళ్ళు వచ్చిందండి అవమానిస్తారు. అమ్మవారి అనుగ్రహం  నా మీద లేదు అందుకే రావడానికి ఆలస్యం అయ్యింది ఒక్క ఐదు నిమిషాల సమయం ఇస్తే స్నానం చేసి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటానని ముత్తైదువులను బతిమలాడుతుంది. కానీ వాళ్ళు ఇలాంటి కోడలు ఎవరికి ఉండకూడదని మాటలనేసి వెళ్లిపోతారు.

జ్ఞానంబ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మల్లిక అదంతా చూసి తెగ సంబరపడిపోతుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానంబ జానకి వైపు కోపంగా చూస్తుంది. జానకి పిలిచినా వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఎవరు తనతో మాట్లాడటం లేదని జానకి బాధపడుతుంటే రామ అమ్మ బాధగా ఉందని చెప్తాడు. జ్ఞానంబ గదిలో ఉంటే జానకి వెళ్ళి తన కాళ్ళ మీద పడుతుంటే పక్కకి వెళ్ళిపోతుంది. జానకి చేతులు జోడిస్తుంది.

Also Read: విక్రమ్ ని చూసి ఇంప్రెస్ అయిపోయిన దివ్య- గుడిలో రాజ్యలక్ష్మి పరువు తీసిన తులసి

‘నాకు మాట ఇచ్చి వ్రతానికి రాకపోవడం మొదటి తప్పు, హామీ ఇచ్చిన రామని మోసం చేయడం రెండో తప్పు, వస్తున్నా దారిలో ఉన్నా అని రామతో అబద్ధం చెప్పించడం మూడో తప్పు, నిన్ను వెనకేసుకొచ్చిన మీ మావయ్యని మోసం చేయడం నాలుగో తప్పు. నువ్వు చేసిన తప్పుకి కారణాలు ఉండవచ్చు కానీ నా బాధకి కారణం ఉంది. నీ లక్ష్యాన్ని కాదనడం లేదు. పాతికేళ్ళ నీ కలని నెరవేర్చుకోవడం కోసం నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకు. సౌభాగ్య వ్రతం చేసుకోమని చెప్పాను కానీ నువ్వు వినలేదు. తమ్ముళ్ళు పక్కన భార్యలతో కూర్చుని ఎంత బాధపడ్డాడో, నీకోసం అబద్ధాలు చెప్పి తల్లి కళ్ళలోకి కూడా చూడలేకపోయాడు. రామ కల్మషం లేని మనిషి తొందరగా ఎవరినైనా నమ్మేస్తాడు. వాడు తన బాధని తనలోనే దాచుకుంటాడు. ఎవరికి చెప్పడు ఒంటరిగా భరిస్తాడు. ఒక తల్లిగా చెప్తున్నా భర్తని బాధపెట్టకు వాడిని గుండెల్లో పెట్టుకుని చూసుకో. నీ కారణంగా వాడి కళ్ళలో బాధ, కన్నీళ్ళు కనిపించకూడదు’ అని జ్ఞానంబ చెప్తుంది.

Also Read: అపర్ణ కాళ్ళ మీద పడిన కనకం- హోరాహోరీగా పోట్లాడుకున్న రాజ్, కావ్య

జానకి వ్రతానికి రాలేకపోయినందుకు మల్లిక తెగ సంబరపడుతుంది. విష్ణు తన సంతోషాన్ని చెడగొట్టేలా మాటలతో గాలి తీసేస్తాడు. రామ పూజలో పంతులు ఇచ్చిన అక్షింతలు పట్టుకుని బాధపడుతూ ఉంటాడు. జానకి కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి భర్త భుజం మీద వాలి జ్ఞానంబ అన్న మాటలు తలుచుకుని బాధపడుతుంది. ఇంత చేసినా మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు అందుకే ఈ కన్నీళ్ళు అని జానకి అంటుంది. భార్యని ఓదారుస్తాడు. మీరు ఇప్పుడు గుండెల మీద కాదు కాళ్ళ మీద అని అంటాడు. పంతులు గారు పూజ చేసినప్పుడు దీవించమని అక్షింతలు ఇచ్చారు అవి వేయడానికని చెప్తాడు. వ్రతానికి పర్మిషన్ అడిగితే ఎస్సై పర్మిషన్ ఇవ్వలేదని అతను పైకి కనిపించేంత మంచివాడు కాదని జానకి చెప్తుంది. మీరు ఆయనతో గొడవపడటం, ఎమ్మెల్యే మెచ్చుకోవడం మనసులో పెట్టుకుని పీడిస్తున్నాడని అంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mysterious Tree in Manyam Forest | ప్రాణాలు తీస్తున్న వింత వృక్షం..ఆ పల్లెలో అసలు ఏం జరుగుతోంది? | ABP DesamKL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP DesamSanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025 PBKS VS GT Result Update : పంజాబ్ స్టన్నింగ్ విక్టరీ.. అన్నిరంగాల్లో సత్తా చాటిన కింగ్స్.. సుదర్శన్, బట్లర్ పోరాటం వృథా
పంజాబ్ స్టన్నింగ్ విక్టరీ.. అన్నిరంగాల్లో సత్తా చాటిన కింగ్స్.. సుదర్శన్, బట్లర్ పోరాటం వృథా
AP DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Kalki Koechlin: నిర్మాతను ఫోర్క్‌తో పొడిచేద్దాం అనుకున్న హీరోయిన్... ఎందుకో తెలుసా?
నిర్మాతను ఫోర్క్‌తో పొడిచేద్దాం అనుకున్న హీరోయిన్... ఎందుకో తెలుసా?
Robinhood First Review: 'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
Embed widget