Brahmamudi March 17th: అపర్ణ కాళ్ళ మీద పడిన కనకం- హోరాహోరీగా పోట్లాడుకున్న రాజ్, కావ్య
కావ్య, రాజ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కనకం కావ్య దగ్గరకి వెళ్ళి తీరతానని వాళ్ళు తిట్టినా భరిస్తానని చెప్తుంది. రాజ్ చేతిలో ప్లేట్ వదిలేయడంతో కావ్య దాన్ని పట్టుకుంటుంది. ఇటువంటివి కింద పడకూడదని కావ్య దాన్ని తీసుకుని దేవుడి ముందు పెడుతుంది. ఇంత పొగరు మీ అమ్మ దగ్గరకే వచ్చిందా అని రాజ్ అంటాడు. ఇంత అహంకారం ఎవరి దగ్గర నుంచి వచ్చిందని రాజ్ ని అంటుంది. అప్పుడే కనకం ఇంటికి వస్తుంది. కావ్య పరిగెత్తుకుంటూ తల్లిని కౌగలించుకోవడానికి వెళ్తుంటే రాజ్ ఆపుతాడు.
రాజ్: ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు
కనకం: నా కూతురిని చూడటానికి వచ్చాను
రాజ్: నిన్నటితోనే ఆ బంధం తెగిపోయింది
అపర్ణ: అసలు ఈ ఇంట్లోకి రావాలని ఎలా అనిపించింది. ఇప్పటికే ముసుగువేసుకున్న ఒక అబద్ధాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం చాలు దయచేసి వెళ్లిపో
కనకం: కట్టుబట్టలతో పంపించాను దానికి బట్టలు ఇద్దామని వచ్చాను
రాజ్: మా ఇంట్లో ప్రతి పండగకి అన్నదానం, వస్త్రదానం చేస్తాం మా ఇంట్లో మీ అమ్మాయికి ఆ లోటు రాదు, తనకి కూడా దానం చేస్తాం
Also read: ఇది కదా ఎన్నెన్నో జన్మల బంధం అంటే.. ప్రేమ ఊహల్లో తెలిపోతున్న యష్, వేద
కనకం: మీ కోపం, ఆవేశంలో అర్థం ఉంది. మీ స్థానంలో ఎవరు ఉన్నా ఇలాగే మాట్లాడతారు. మా స్వప్న చేసిన ద్రోహానికి కడుపులో పేగు కదులుతుంది. గుర్తు చేసుకున్న ప్రతిసారి గుండె రంపపు కోతకి గురవుతుంది. కానీ జరిగిన దాంట్లో నా కూతురి తప్పు లేదు
అపర్ణ: పేదరికం విషయంలో మాకు ఎటువంటి పట్టింపులు లేవు కానీ అబద్ధం చెప్పారు అది నీచం, దరిద్రం ఇన్ని నికృష్టమైన పనులు చేసి తలవంచుకుని నిలబడితే ఈ కుటుంబం ఎలా క్షమిస్తాం
ఇంద్రాదేవి: ఆడపిల్ల తల్లిని అలా అనకూడదు. అమ్మాయి పెళ్లి చేయడం కోసం అలా చేశావు కానీ నువ్వు నిజాయితీగా పరిస్థితి చెప్పి మీ అమ్మాయిని పెళ్లి చేస్తానని చెప్తే సంతోషంగా పెళ్లికి ఒప్పుకునే వాళ్ళు. ఎందుకు అలా చేయలేదు. స్వప్న గురించి వదిలేయ్ ఈ అమ్మాయి ఎంత లక్షణంగా ఉంది, ఈ అమ్మాయిని చూపించి ఉంటే ఖచ్చితంగా చేసుకునే వాళ్ళం కదా
రుద్రాణి: ఇక్కడ నీ కూతురు శిక్ష అనుభవించక తప్పదు. నీ కూతుర్ని కోడలిగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు
కనకం: ఇందులో నా కూతురి తప్పు లేదు కావాలంటే మీ అందరి చెప్పు తీసుకుని కొట్టండి
రాజ్: ఒక కూతురు పెళ్లి పీటల ముందు నుంచి వెళ్ళిపోయింది ఇక ఈమెని ముసుగువేసుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు
కనకం: ముసుగువేసుకుని కూర్చునేందుకు కావ్య అసలు ఒప్పుకోలేదు. మీకు విషయం చెప్తామని అన్నది మేమే స్వప్న వచ్చేదాకా ఉండమని చెప్పాం
రుద్రాణి: అటు తిరిగి ఇటు తిరిగి నన్ను ఇరికించేలా ఉందని అనుకుని కనకాన్ని వెళ్లిపొమ్మని చెప్తుంది
కనకం: అది మీ ఇంటికి పేరు తీసుకొస్తుంది దయచేసి దాన్ని మీ ఇంటి కోడలిగా ఒప్పుకోండి అని అపర్ణ కాళ్ళ మీద పడుతుంది
Also read: రాజ్ తిక్కకుదురుస్తున్న దుగ్గిరాల ఇంటి కంచు కోడలు- కావ్య దగ్గరకి వచ్చిన కనకం
కావ్య: ఎందుకు ఇక్కడికి వచ్చావ్, ఇక్కడ ఏం మాట్లాడతారో తెలియదా
రాజ్: ఎందుకు వచ్చారు మీ అమ్మని బాగా వెనకేసుకొస్తున్నావ్
కావ్య: తాళి కట్టే సమయానికి కట్టకుండా ఆపాను అదా నేను చేసిన తప్పు నేనేమీ మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అనలేదు కదా మీరు తాళి కట్టకపోతే చచ్చిపోతాను అని బ్లాక్ మెయిల్ చేయలేదు కదా
రాజ్: నీ తరపు వాళ్ళని మా మీదకి ఉసిగొల్పావ్ మీడియా వాళ్ళని నా మీదకి రెచ్చగొట్టావ్
కావ్య: అయినా తప్పు అంతా మాదే అంటున్నారు మాదే కాదు మీ తప్పు కూడా ఉంది. మా అక్క అందం చూసి ఇష్టపడ్డారా, అందమైన మనసు చూసి నిర్ణయం తీసుకున్నారా? పెళ్లి చూపులు చూసి నాలుగురోజుల్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. అంటే మీకు కావలసింది అందం మాత్రమే. నేను ఒప్పుకుంటాను మా వల్ల కుటుంబానికి చాలా సమస్యలు వచ్చాయ్.
రాజ్: మీ స్వప్న మనసు చూసి పెళ్లికి ఒప్పుకున్నా అందం, డబ్బు చూసి కాదు. మీ కన్నీళ్ళు కథలు చూసి మా మనసులు కరగవు.. మీ అమ్మ చేసింది తప్పు కాదు నేరం. ఇలాగే వదిలేస్తే మళ్ళీ మళ్ళీ ఇంటికి మీదకి వచ్చి గొడవ చేస్తారు. ఇప్పుడే మీ అమ్మని పోలీసులకు పట్టించి అరెస్ట్ చేయిస్తాను
కావ్య: చేయండి అసలు నేరస్థులు ఎవరో తెలుస్తుంది