News
News
X

Brahmamudi March 16th: రాజ్ తిక్కకుదురుస్తున్న దుగ్గిరాల ఇంటి కంచు కోడలు- కావ్య దగ్గరకి వచ్చిన కనకం

కావ్య, రాజ్ కి పెళ్లి కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

కావ్య పొద్దున్నే నిద్రలేచి ఇంటి ముందు చక్కగా రంగులు వేసి ముగ్గులు వేస్తుంది. అప్పుడే ఇంద్రాదేవి వచ్చి ముగ్గులు చూసి అపర్ణ వేసిందా అంటే కాదు ఇంటి కొత్త కోడలు వేసిందని శాంత చెప్పేసరికి చాలా బాగా వేసిందని ఇంటి ముందు అందమైన ముగ్గు వేసే అమ్మాయి ఇంటిని కూడా చక్కగా తీర్చిదిద్దుతుందని అంటుంది. రాజ్ మొదట ముగ్గు చూసి నవ్వుతాడు కానీ అంతలోనే కోపం తెచ్చేసుకుంటాడు. ఈ కళావతి ముగ్గు వేసి అందరినీ ముగ్గులోకి లాగాలని చూస్తుంది. అమ్మ వచ్చి ఈ ముగ్గు చూసి ఇంప్రెస్ అవడానికి వీల్లేదు అని దాని దగ్గరకి వచ్చి చూస్తాడు. వావ్ ఈ ముగ్గు చూస్తే నేనే ఇంప్రెస్ అవుతున్నా ఇక మమ్మీ అవదా అని ముగ్గు మొత్తం కాళ్లతో చెరిపేస్తాడు. అదంతా కావ్య చూస్తుంది. పనిమనిషి శాంత వచ్చి ఇంతలోనే అంత కుళ్ళు బుద్ధి ఎవరికి పుట్టింది వాళ్ళ కాళ్ళు విరిగిపోను అని తిట్టుకుంటుంది.

ఇంటి ముందు ముగ్గు చాలా బాగుందని ధాన్యలక్ష్మి, ఇంద్రాదేవి మాట్లాడుకుంటూ ఉండగా శాంత వచ్చి ఎవరో కావాలని ముగ్గు మొత్తం చెరిపేశారని చెప్తుంది. రాజ్ అది విని నవ్వుకుంటాడు. కావ్య కావాలని వచ్చి ఎవరు చెరిపేశారు శాంత అనేసరికి ఎవరో అంటుంటే ముగ్గు చెరిపిన వాళ్ళని చెడామడా తిట్టేస్తుంది. భలే ఫన్నీ గా ఉంటుంది. ఈ అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది కదా అని ఇంద్రాదేవి కావ్యని మెచ్చుకుంటుంది. కోడలిగా ఒప్పుకోని అత్తగారి ఇంట్లో, భార్యగా ఒప్పుకోని భర్త ఇంట్లోకి వచ్చాను. ఈ పెళ్లి నాకు శిక్షా లేక పరీక్ష అని దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ బాధపడుతుంది. కళ్యాణ్ కావ్య గదిలోకి వచ్చి చాలా బాగుంది మా వదిన వచ్చిన తర్వాత ఇల్లు ఉందని అంటాడు. నానమ్మ మిమ్మల్ని పూజ గది దగ్గరకి రమ్మని పిలుస్తున్నట్టు చెప్తాడు.

Also read: భర్తకి ముద్దు పెట్టేసిన వేద- యష్ ని దూరం చేసేందుకు విన్నీ కుట్ర

ఇంద్రాదేవి: ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నీ ఇల్లు పరాయిదానిలా ఉండకూడదు. ఇవాళ పూజ చేసి భర్త చేతుల మీదుగా కొత్త కోడలు బాధ్యతలు స్వీకరించాలి కదా మర్చిపోయావా అపర్ణ

అపర్ణ: మర్చిపోలేదు కొత్త కోడలిగా బాధ్యతలు తీసుకోవాలంటే ముందు భర్త భార్యగా స్వీకరించాలి కదా. మీరు ఏది చేసినా రాజ్ కి చెప్పి చేయండి

అప్పుడే రాజ్ కిందకి వస్తాడు. ఇవాళ దైవ సాక్షిగా ఈ ఇంటి కోడలిని ఈ అమ్మాయి బాధ్యత తీసుకుంటుంది, భర్తగా నువ్వు బాధ్యతలు తీసుకోవాలని ఇంద్రాదేవి రాజ్ కి చెప్తుంది. అసలు ఈమెని భార్యగానే స్వీకరించలేదు కదా బాధ్యత ఎలా తీసుకుంటాను ఎలా ఇస్తానని అంటాడు. భార్యగా స్వీకరించలేదా అంటే తాళి కట్టలేదా తలంబ్రాలు పోసుకోలేదా అని తిడుతుంది. ఇంటి కోడలిగా బాధ్యతలు అప్పగిస్తే ఆమె మోసాన్ని కూడా అంగీకరించినట్టే అవుతుందని రాజ్ అంటాడు. దీంతో నానమ్మ వినటానికి ఒప్పుకుంటాడు.

Also Read: పట్టాలెక్కిన దివ్య, విక్రమ్ లవ్- భార్యాభర్తలుగా ఒకే గదిలోకి నందు, తులసి

పండ్లు, పూలు, చీర ఇచ్చి భార్యగా బాధ్యత తీసుకోమని చెప్తుంది. ఇంట్లో ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళ బాధ్యత కూడా నాదే ఇప్పుడు పని వాళ్ళ సంఖ్యలో ఒకటి పెరిగింది అనుకుని బాధ్యత తీసుకుంటానని ఇస్తుంటే కావ్య తీసుకొనని చెప్తుంది. భర్త ఇస్తుంటే భార్య కాదనకూడదని ధాన్యలక్ష్మి చెప్తుంది. ఇదే మాట ఆయన్ని చెప్పమను తీసుకుంటానని కావ్య మొండిపట్టు పడుతుంది. చచ్చినా చెప్పనని అంటాడు. ఈ ఇంటి పనిమనిషిగా తీసుకొను భార్యగా అయితే తీసుకుంటాను ఇలా కించపరిస్తే తీసుకొను నాకు స్వయం ఉపాధి ఉంది కళని నమ్ముకుని బతుకుతానని చెప్తుంది. పెద్దవాళ్ళు మీరు చెప్పినా వినకుండా ఇలా చేసిందని అపర్ణ అంటుంది. క్షమించండి నేను పొగరుగా చెప్పలేదు కించపరిచాడని అలా అన్నానని చెప్తుంది. భార్యగా మనస్పూర్తిగా తీసుకుంటానని అంటుంది చచ్చినా తీసుకొనని చెప్పి ప్లేట్ కింద పడేస్తుంటే కావ్య పట్టుకుంటుంది. కనకం కూతురి దగ్గరకి వెళ్తానని అంటుంది. భర్త కృష్ణమూర్తి వద్దని చెప్తాడు కానీ కనకం మాత్రం వెళ్ళి తీరతానని చెప్తుంది.

Published at : 16 Mar 2023 09:53 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial March 16th Episode

సంబంధిత కథనాలు

Allu Arjun Net Worth: అల్లు అర్జున్ మొదటి జీతం రూ.3500 మాత్రమే - ఇప్పుడు ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

Allu Arjun Net Worth: అల్లు అర్జున్ మొదటి జీతం రూ.3500 మాత్రమే - ఇప్పుడు ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

Janaki Kalaganaledu March 29th: తండ్రిని నోటికొచ్చినట్టు తిట్టిన అఖిల్- సర్దుకుపొమ్మని చెప్పిన జ్ఞానంబ

Janaki Kalaganaledu March 29th: తండ్రిని నోటికొచ్చినట్టు తిట్టిన అఖిల్- సర్దుకుపొమ్మని చెప్పిన జ్ఞానంబ

Keerthy Suresh: నాలుగు పళ్లతో నవ్వమన్నాడు - కీర్తి సురేష్‌కు షాకిచ్చిన ‘దసరా’ దర్శకుడు

Keerthy Suresh: నాలుగు పళ్లతో నవ్వమన్నాడు - కీర్తి సురేష్‌కు షాకిచ్చిన ‘దసరా’ దర్శకుడు

Gruhalakshmi March 29th: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రియ- లాస్య ట్రాప్ లో పడిపోయిన దివ్య

Gruhalakshmi March 29th: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రియ- లాస్య ట్రాప్ లో పడిపోయిన దివ్య

Guppedanta Manasu March 29th: కొత్త గేమ్ స్టార్ట్ చేసిన రిషిధార, క్షమించమని జగతిని అడిగిన ఈగో మాస్టర్!

Guppedanta Manasu March 29th:  కొత్త గేమ్ స్టార్ట్ చేసిన రిషిధార, క్షమించమని జగతిని అడిగిన ఈగో మాస్టర్!

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్