Janaki Kalaganaledu January 23rd: మల్లిక మాటలకు కన్నీళ్ళు పెట్టుకున్న జానకి- జ్ఞానంబ ఇంట సంక్రాంతి సంబరాలు
రామా చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం ఇబ్బందులు పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఇంటికి వచ్చిన ఆడపడుచుని వెళ్ళిపోయి నానమ్మ ఇంట్లో దర్జాగా ఉండమని సలహా ఇస్తుంది మల్లిక. ఆ మాటలన్నీ విన్న జానకి మల్లికని తిడుతుంది. నువ్వు ఎటు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నావ్, వచ్చిన వాళ్ళని కూడాపంపించాలని ఎందుకు అనుకుంటున్నావ్. తను ఉండటం వల్ల నీకొచ్చిన ఇబ్బంది ఏంటి. తను జెస్సిలాగా ఈ ఇంటి కోడలు కాదు ఈ ఇంటి ఆడపిల్ల మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అని జానకి గడ్డి పెడుతుంది. వెన్నెల ముందే జానకి పరువు తీస్తాను అని మల్లిక మనసులో అనుకుంటుంది. రామా ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నాడు అని గోవిందరాజులు అంటాడు.
రాముడిని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకుంటున్నావ్ అని జానకిని మెచ్చుకుంటుంటే మల్లిక వచ్చి పుల్లవిరుపు మాటలు మాట్లాడుతుంది. వెయ్యి రూపాయలు తీసుకోమని ఇస్తుంది. పండగ వస్తుంది కదా మనకి లేకపోయినా ఇంటికి వచ్చిన ఆడపిల్లకి పెట్టాలి కదా అని అంటుంది. ఆయన బయటకి వెళ్లారు తీసుకొస్తారని జానకి అంటుంది. ఎప్పుడు తీసుకొస్తారు ముగ్గురు అన్నలు ఉండి కూడా ఇంటికొచ్చిన ఆడపిల్లకి జాకెట్ ముక్క కూడా పెట్టలేదని అంటారు, అందుకే ఈ వెయ్యి రూపాయలు తీసుకుని తనకి ఏదైనా కొనివ్వండి అని అంటుంది. వెన్నెల మాత్రం తన అన్నయ్య ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచిస్తాడంటూ వెనకేసుకొస్తుంది.
Also Read: తులసి అవతారమెట్టిన లాస్య, వాట్ ఏ కామెడీ- జరిగింది తలుచుకుని వణికిపోతున్న దివ్య
ఎవరికో అప్పు అని 20 లక్షలు అప్పు నాటకం ఆడారు, కుటుంబం విడిపోతే కానీ అసలు నిజాలు బయటకి రావు అని మల్లిక అంటుంది. అప్పుడే రామా ఖాళీ చేతులతో ఇంటికి వస్తాడు. ఉట్టి చేతులతో వచ్చారు ఏంటి జానకి చాలా కలలు కంటుంది, ఇప్పుడైనా అర్థం అయ్యిందాఅని మల్లిక అవమానకరంగా మాట్లాడుతుంది. ఆ మాటలకి జానకి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన నోరు నిజాలే మాట్లాడుతుందని మమ్మల్ని బయటకి పంపిస్తే ఎవరికి ఏ బాధ ఉండదు కదా అని మళ్ళీ అంటుంది. మల్లిక మాటలకి జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మిమ్మల్ని మాటలు అంటే తట్టుకోలేకపోతున్నా, వెన్నెల తన మాటలు విని మీ గురించి అపార్థం చేసుకుంటే ఏంటి పరిస్థితి అని జానకి బాధపడుతుంది.
అన్నయ్య కష్టం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన దాన్ని మధ్యలో ఎవరో వచ్చి ఏదో అంటే ఎలా నమ్ముతాను వదిన అని వెన్నెల జానకితో అంటుంది. కుటుంబం కోసం ఇంత కష్టపడుతున్న మీ గురించి అలా మాట్లాడటానికి ఎలా నోరు వచ్చిందని జానకి చాలా బాధపడుతుంది. తన గురించి తెలిసిందే కదా వదిలేయమని రామా ఓదారుస్తాడు. వెన్నెలని అందరి ముందు అలా అనడం ఏమి బాగోలేదని విష్ణు అంటాడు. కానీ మల్లిక మాత్రం అలా చేస్తేనే మనం ఇంట్లో నుంచి వెళ్లిపోతామని అంటుంది. అప్పుడే జ్ఞానంబ అందరినీ పిలుస్తుంది. పండగకి జ్ఞానంబ ఇంట్లో వాళ్ళందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చి ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా సంక్రాంతి జరుపుకునే వాళ్ళం ఈ సారి కూడా ఇలాగే జరుపుకుందాం అని మల్లిక, జెస్సికి బట్టలు ఇస్తుంది.
Also Read: విన్నీ గోల, యష్ చిరాకు- చిత్ర, వసంత్ పెళ్లి అవుతుందా?
మల్లిక ఇచ్చిన డబ్బులు జ్ఞానంబ తనకి తిరిగి ఇస్తుంది. ప్రతి పండగకి బావగారు తీసుకొస్తారు ఈసారి మీరు తీసుకొచ్చారఉ ఏంటి అని అడుగుతుంది. వెన్నెలకి బట్టలు ఇవ్వబోతుంటే అన్నయ్య వదినకి ఇవ్వమని అంటుంది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావ్ కదా నీ చేతులతో నువ్వే ఇవ్వు అని జ్ఞానంబ అంటుంది. కానీ వెన్నెల మాత్రం తనని ఇవ్వమంటుంది. జ్ఞానంబ మాత్రం వాళ్ళకి బట్టలు ఇవ్వకుండానే మాట దాటేసి వెళ్ళిపోతుంది. దీంతో వెన్నెలనే బట్టలు ఇస్తుంది. తల్లి అన్న మాటలకి రామా కూడా బాధపడతాడు. జానకి తనకి ధైర్యం చెప్తుంది.