Janaki Kalaganaledu January 11th: మల్లిక పప్పులు ఉడకలేదు- కష్టాల్లో భర్తకి తోడుగా నిలిచిన జానకి
జానకి ఐపీఎస్ పుస్తకం పట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రామా అప్పు తీర్చలేకపోవడంతో వడ్డీ వ్యాపారి భాస్కర్ ఇల్లుతో పాటు స్వీట్ షాపు కూడా స్వాధీనం చేసుకుంటాడు. ఇంటి తాళాలు అప్పగించి జ్ఞానంబ కుటుంబం మొత్తం వెళ్ళిపోతుంది. ఇంటికి దూరం అవుతుంటే అందరూ చాలా ఎమోషనల్ అయిపోతారు. సాడ్ సాంగ్ వేసి కాసేపు ప్రేక్షకులని కూడా ఎమోషనల్ అయ్యేలా చేసేస్తారు. రామా కుటుంబం కోసం ఒక చిన్న ఇంటిని చూస్తారు. పరిస్థితి ముందే తెలిసి ఇల్లు చూసి పెట్టారని మల్లిక దెప్పిపొడుస్తుంది. పని వాళ్ళకంటే దారుణంగా తయారయ్యింది బతుకు అని మాటలు అంటుంది. చుట్టు పక్కల వాళ్ళు జ్ఞానంబని చూసి గుసగుసలాడుకుంటారు. పెద్దబ్బాయి చేసిన అప్పు వల్ల భాస్కర్ ఇల్లు లాగేసుకున్నాడంట అని అనుకోవడం విని జ్ఞానంబ చాలా బాధపడుతుంది.
Also Read: సామ్రాట్ ఎప్పుడో తన భర్త అయ్యాడన్న తులసి- నందుని సత్తు రూపాయిగా కూడా పనికి రావన్న లాస్య
మేము కిచెన్ లో ఉంటాములే అని రామా, జానకి అంటారు. మరి మీరు ఎక్కడ ఉంటారు అందుకే మేము బయటకి వెళ్తాములే అని మల్లిక అంటుంది. కానీ అవసరం లేదు మిమ్మల్ని చూసుకుంటూ మేము ఇక్కడే ఉంటామని జ్ఞానంబ చెప్తుంది. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చావ్ భగవంతుడా అని జ్ఞానంబ మనసులో బాధపడుతుంది. రామా కూడా పరిస్థితి చూసి బాధపడుతుంటే జానకి ధైర్యం చెప్పేందుకు చూస్తుంది. కష్టం వేలుపట్టుకుని కొంతదూరం నడిస్తే అదే మనల్ని వదిలి వెళ్ళిపోతుంది, నాలుగు రోజులు కష్టపడితే డబ్బు మళ్ళీ వస్తుందని చక్కగా చెప్తుంది. కష్టపడి చూసిన చదివిన కొటేషన్స్ అన్ని చెప్పినా నవ్వడం లేదని జానకి తనని నవ్వించడానికి చూస్తుంది. జానకి మాటలు విని రామా పొంగిపోతాడు.
Also Read: వేద, యష్‌తో అన్యోన్య దాంపత్య వ్రతం చేయిస్తున్న రాజా- ఇద్దరు ఒక్కటి అవుతారా?
విష్ణు తన గదిలో సామాన్లు సర్దుకోవడానికి చూస్తుంటే మల్లిక చిటపటలాడుతుంది. ఇంటి నుంచి వేరుగా బయటకి వెళ్లలేకపోయామని చిందులు తొక్కుతుంది. అమ్మ మాట కోసం ఉండక తప్పదని విష్ణు అంటాడు. ఇక్కడే ఉంటే అప్పులు తీర్చాలి బయటకి వెళ్తే మనం దాచుకున్న డబ్బుతో సొంతంగా షాపు పెట్టుకోవచ్చని మల్లిక విష్ణుకి ఎక్కిస్తుంది.