Janaki Kalaganaledu July 19th Update: అరటి తొక్క మీద కాలేసి జారి పడి రామాతో సరసాలు ఆడిన జానకి- మల్లిక ప్లాన్ ఫెయిల్
జానకి రామా దగ్గర కాకుండా చేయాలని మల్లిక తెగ ప్రయత్నిస్తుంది కానీ అవేవీ ఫలించవు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
జానకి రామా కాలు గోకడం మల్లిక చూస్తుంది. 'బావగారు చలి జ్వరానికి కారణం ఇదా ఇదంతా చూస్తుంటే జానకి నాకంటే ముందే పిల్లల్ని కాని ఐదు సెంట్ల స్థలాన్ని కొట్టేసెలగా ఉంది. అలా జరగకూడదు. ఆరు నూరైన కత్తి నూరైన ఆ కాలేజీ ఫోన్ సంగతేంటో తేల్చాలి. అంతకంటే ముందు వీళ్ళ సరసాలకి బ్రేక్ వెయ్యాలి' అని మల్లిక మనసులో కుళ్ళుకుంటుంది. సాయంత్రం త్వరగా వస్తాను రెడీ అవమని రామా జానకికి చెప్తాడు. మల్లెపూలు తీసుకొని వస్తారా అని జానకి కొంటెగా అడుగుతుంది. కాసేపు మీరు మా అమ్మకి ఇచ్చిన మాట పక్కన పెట్టి ఐపీఎస్ చదువు మీద శ్రద్ధ పెట్టండని రామా చెప్తాడు. కానీ జానకి మాత్రం పిల్లల్ని చదువును చూసుకుంటానని చెప్పిన రామా మాత్రం వినడు. వాళ్ళిద్దరినీ మల్లిక చూస్తూ ఏడుస్తుంది. వీళ్లిద్దరికి అడ్డుకట్ట వేయాలనుకుని అరటి తొక్కను విసిరేస్తుంది. జానకి రామాకి ఎదురు వెళ్తూ ఆ తొక్క మీద కాలు వేసి జారిపడిపోతుంది. నొప్పితో విలవిల్లాడిపోతుంటే అక్కడికి జ్ఞానంబ దంపతులు కూడా వస్తారు.
Also Read: మనసు తెలుసుకోండి సార్ అని మళ్లీ క్లారిటీ ఇచ్చిన వసు, సాక్షికి పెద్ద షాక్ ఇచ్చిన రిషి అండ్ కో!
అసలు ఎలా పడ్డావమ్మ అని జ్ఞానంబ అడుగుతుంది. అరటి తొక్క మీద కాలేసి జారి పడ్డానని చెప్పడంతో ఇంట్లో ఎవరు అరటి తొక్క వేశారని అడుగుతుంది. జానకి నడవలేక ఇబ్బంది పడుతుంటే రామా ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్తాడు. నేను అరటి తొక్క వేసింది ఎందుకు ఇక్కడ ఏం జరగుతుంది అని మల్లిక బిత్తరపోతుంది. జానకి నొప్పితో అల్లడిపోతుంటే అది చూసి రామా బాధపడతాడు. ఇక జానకిని కిందపడేసినందుకు సంకలు గుద్దుకుంటూ డాన్స్ వేస్తుంది మల్లిక. అదే ఊపుతో వేడి నీళ్ళు తీసుకుని వెళ్తుంటే అవి పొరపాటున జారి మల్లిక కాళ్ళ మీద పడిపోతాయి. దీంతో మల్లిక ఓరి అమ్మమ్మో చచ్చానురా దేవుడో అని కేకలు పెట్టేసారికి ఏమైందని గోవిందరాజులు వస్తాడు. వేడి నీళ్ళు కాళ్ళ మీద పడ్డాయని చెప్తూ తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇందాక పెద్ద కోడలు కాలు విరిగితే భూకంపం వచ్చినంత చేశారు కదా మరి చిన్న కోడలకి దెబ్బ తగిలితే పట్టించుకోరా అని ఏడుపులంకించుకుంటుంది. జానకి కాలికి దెబ్బ తగాలడానికి నువ్వే కారణం అయి ఉంటావ్ అందుకే దేవుడు నీకు ఇలా చేశాడని గోవిందరాజులు అంటాడు.
ఇక రామా జానకికి సపర్యాలు చేస్తూ ఉంటాడు. అది చూసి జానకి మురిసిపోతుంది. కాలికి వేడి నీళ్ళ కాపడం పెడతాడు. అమ్మాయికి దెబ్బ తగ్గేవరకూ జాగ్రత్తగా చూసుకో కొట్టుకు వెళ్లొద్దులే అని జ్ఞానంబ చెప్తుంది. మల్లిక అరటి తొక్క ముందు కూర్చుని దాన్ని ఎగా దిగా చూస్తూ జానకి పడిన సీన్ గుర్తుచేసుకుంటుంది. తొక్క ఆకారం అలాగే ఉంది మరి జానకి ఎలా పడిందబ్బా అని ఆలోచిస్తుంటుంది. జానకి మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ నొప్పితో అల్లాడిపోతునట్టు నటిస్తుంది. రామాని ముగ్గులోకి దించేందుకు జానకి ప్రయత్నిస్తు నవ్వుకుంటుంది. అది చూసి రామాకి అనుమానం వస్తుంది. దీంతో మళ్ళీ జానకి నొప్పి అని డ్రామా ఆడుతుంది. అది నమ్మని రామా అసలు నిజంగానే నొప్పి లేదు కదా అని అడగడంతో అవును మీ మీద ప్రేమతో మీతో ఏకాంతంగా ఉండాలని ఇలా చేస్తున్న అని చెప్తుంది. ఆ మాటకి రామా కొప్పడతాడు. అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అరవడంతో జానకి వెళ్ళి రామాని కౌగలించుకుంటుంది.