James Cameron: అప్పుడు కేట్ చాలా భయపడింది - కానీ, ‘అవతార్-2’లో అలా కాదు: జేమ్స్ కామెరూన్
‘టైటానిక్’ సినిమా తర్వాత జేమ్స్ కామెరూన్, కేట్ విన్స్ లెట్ మళ్లీ జత కట్టారు. అవతార్-2లో ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. తాజాగా కేట్, కామెరూన్ ‘టైటానిక్’ నాటి విషయాలను పంచుకున్నారు.

1997లో విడుదలైన ‘టైటానిక్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి అస్కార్ అవార్డులు సైతం దాసోహం అన్నాయి. కేట్ విన్స్ లెట్, లియోనార్డో డికాప్రియో నటనకు ఆడియెన్స్ అబ్బురపడ్డారు. టైటానిక్ ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఆయన దర్శకత్వ ప్రతిభకు ప్రపంచం ఫిదా అయ్యింది. అంతటి అద్భుత డైరెక్టర్ తో కేట్ మరోసారి సినిమా చేస్తోంది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కోసం ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. ఈ నెలాఖరున ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే ‘అవతార్’ సీక్వెల్ కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తికి ఎదురుచూస్తున్నారు.
‘టైటానిక్’ సమయంలో భయపడ్డ కేట్
తాజాగా కామెరూన్, కేట్ కలిసి రేడియో టైమ్స్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ‘టైటానిక్’, ‘అవతార్-2’ సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘అవతార్-2’తో సినిమాతో పోల్చితే ‘టైటానిక్’ షూటింగ్ సమయంలో కేట్ చాలా ఒత్తిడికి గురైనట్లు కామెరూన్ చెప్పారు. ఒకానొక సమయంలో తను భయపడిందన్నారు. 22 ఏళ్ల వయసులో ఆమె ‘టైటానిక్’ సినిమాలో హీరోయిన్ గా చేయడం చాలా కష్టమని ఆయన వెల్లడించారు. అయినా, ఆమె చాలా గొప్పగా నటించిందని వెల్లడించారు. చాలా ఏళ్ల తర్వాత ‘అవతార్-2’ కోసం కామెరూన్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని కేట్ వెల్లడించారు. ‘టైటానిక్’ సినిమాతో పోల్చితే ఇప్పుడు తను చాలా కూల్ గా ఉన్నానని చెప్పారు. అప్పట్లో తను చాలా కోపంగా ఉండేవాదానినని వెల్లడించారు.
‘అవతార్-2’ కోసం చాలా కష్టపడిన కేట్
ఇక ‘అవతార్-2’ సినిమాలో కేట్ విన్స్ లెట్ , క్లిఫ్ కార్టిస్, బ్రెన్ డన్ కవెల్ సహా పలువురు టాప్ స్టార్స్ నటించారు. సముద్ర గర్భంలో పండోరా గ్రహాన్ని అద్భుతంగా చూపించబోతున్నారు కామెరూన్. ఈ సినిమాలో చాలా వరకు నీటి లోపలే షూటింగ్ జరిగింది. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కేట్ నీటి అడుగునే శ్వాస తీసుకోకుండా కొన్ని నిమిషాల పాటు ఉందట. ఈ సినిమా కోసం తను ఫ్రీ డైవ్ నేర్చుకుందట. ఈ సినిమా కోసం కేట్ చాలా కష్టపడినట్లు దర్శకుడు తాజాగా వెల్లడించారు. ఇక అవతార్-2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16న విడుదల కాబోతుంది.
మొత్తం నాలుగు భాగాలుగా ‘అవతార్’
ఇక 2009లో వచ్చిన ‘అవతార్’ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ తన ప్రతిభను మరోసారి ప్రపంచానికి చూపించారు. ఇప్పుడు రాబోతున్న అవతార్ సీక్వెల్ సైతం మొదటి పార్టును మించి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు. ఇక అవతార్ నుంచి మొత్తం నాలుగు భాగాలు ఉంటాయని దర్శకుడు వెళ్లడించారు. ఇప్పటికే రెండు కంప్లీట్ కాగా, మిగతా సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకు వస్తాయనేది త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
Read Also: నేవీ అధికారులను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయ్ - అలనాటి అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

