News
News
X

Women Oriented Films Telugu: స్త్రీ శక్తిని చాటే అద్భుత సినిమాలు - ‘ఉమెన్స్ డే’ రోజు తప్పక చూడండి!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగులో మంచి హిట్ అందుకున్న కొన్ని ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల లిస్ట్ ఇక్కడ ఉంచాము. ఓ లుక్ వేసేయండి.

FOLLOW US: 
Share:

భారతదేశం పురుషాధిక్యం దేశంగా ఉండేది. ఏ రంగంలోనైనా మహిళలను చిన్న చూపు చూసేవారు. అయితే దేశం అభివృద్ది చెందుతున్న కొద్దీ పరిస్థితులు మారుతూ వచ్చాయి. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. సినిమా రంగంలో కూడా మార్పులు వచ్చాయి. మహిళలే ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ కొన్ని ఉమెన్ ఓరియెంటడ్ సినిమాలను సూచిస్తున్నాం. ఇవి తప్పకుండా మీ గుండెను తాకుతాయి. 

1. ‘అంతులేని కథ’

‘అంతులేని కథ’ 1976 లో కె. బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జయప్రద, రజినీ కాంత్, కమల్ హాసన్, సరిత, నారాయణ రావు ముఖ్యపాత్రలు పోషించారు. మధ్య తరగతి ఇంటిలో తండ్రిలేని కుటుంబాన్ని పనికిమాలిన వారికోసం, చాదస్తాలతో డబ్బు తగలేసే వారికోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మాయి అనుభవించే యాతనలపై సాగిన చిత్రం. ఈ సినిమా అప్పట్లో విశేషంగా ప్రజాదరణ పొందింది. 

2. ‘మయూరి’

ఇది ఒక క్లాసికల్ డ్యాన్సర్ (సుధా చంద్రన్) రియల్ స్టోరీ, ఆమె ఒక ప్రమాదంలో తన కాలును పోగొట్టుకుంటుంది. అయితే డాన్స్ ను మాత్రం విడిచిపెట్టదు. తర్వాత ఆమె తిరిగి డాన్సర్‌ గా పోరాడుతుంది. ఈ చిత్రంలో స్వయంగా నటించిన సుధా చంద్రన్ తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

3. ‘కర్తవ్యం’

డేరింగ్ డాషింగ్ లేడీ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ జీవితం ఈ చిత్రానికి స్ఫూర్తి. అప్పట్లో పోలీస్ సినిమాలకు కొత్త నిర్వచనం చెప్పిన విజయశాంతి సినిమాతో పాపులర్ అయింది. ఈ సినిమా తర్వాత విజయ్ శాంతి మరిన్ని ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. 

4. ‘ఒసేయ్ రాములమ్మ’

ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా ఈ ‘ఒసేయ్ రాములమ్మ’. ఓ గిరిజన యువతి భూస్వామ్యులతో ఎలా పోరాడిందన్నదే ఈ చిత్రం. దాసరి నారాయణరావు అద్భుతమైన దర్శకత్వంతో పాటు విజయశాంతి మెస్మరైజింగ్ నటన సినిమా విజయానికి కీలకం. ఈ చిత్రం ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటి నుంచి విజయశాంతి ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచింది. 

5. ‘అమ్మ రాజీనామా’ 

‘అమ్మ రాజీనామా’ 1991లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన ఓ కుటుంబ కథా చిత్రం. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి తన విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. మహిళల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దాసరి చేసిన సినిమాలలో ఇది తొలివరుసలో ఉంటుంది. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలలో ఇది కూడా చెప్పుకోదగ్గది. 

6. ‘శివరంజని’

స‌హ‌జ న‌టి జ‌య‌సుధ‌ న‌టించింది. సినీ న‌టి ఎదుగుదల, పతనానికి సంబంధించిన విషాద చిత్రమిది. వివిధ రకాల పరిస్థితుల మధ్య ఒక సినీ నటి జీవితం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో జయసుధ తన నటనతో అందర్నీ భావోద్వేగానికి గురి చేశారు. 

7. ‘అమ్మోరు’

ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో మరొక చెప్పుకోదగ్గ చిత్రం ‘అమ్మోరు’. కొత్తగా పెళ్లయిన అమ్మాయి ఒక దుష్ట మాంత్రికుడు నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించుకోవడమే ఈ చిత్ర కథ. సౌందర్య ఈ సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది, ఆమె పాత్రను వ్రాసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమ్మోరు పాత్ర లో రమ్యకృష్ణ నటనకూ మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదు. కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

8. ‘అరుంధతి’

ఒక ధైర్యవంతురాలైన రాణి, ఆమె మనవరాలు వారి రాజవంశంలోని వ్యక్తులను బాధించే మాంత్రికుడి ఎదురించి కుటుంబాన్ని కాపాడుకోడమే ఈ సినిమా కథ. అనుష్క శెట్టి లైఫ్ టైమ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ సినిమాలో. కోడి రామ కృష్ణ సినిమాను తీసిన విధానం పై ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు, ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

9. ‘అనసూయ’

నటి భూమిక నటించిన ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది. ఒక సినిమా సైకోటిక్ లవ్ ఫెయిల్యూర్ ఆధారంగా రూపొందించబడినప్పటికీ, భూమిక చావ్లా అద్భుతమైన నటనతో సినిమా ఇంకా ఉత్కంఠగా సాగుతుంది. సైకో థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సైకో ను భూమిక థైర్యంగా ఎదుర్కొనే సన్నివేశాలు ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. 

10. ‘అనుకోకుండా ఒక రోజు’ 

దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో చార్మీ కౌర్ సహస్ర అనే అమ్మాయి పాత్రలో బ్రిలియంట్ గా నటించింది. ఒక రోజు సహస్ర దారి తప్పుతుంది. అక్కడ నుంచి అనుకోకుండా కొన్ని క్రైమ్స్ లలో ఇరుక్కుంటుంది. వాటి నుంచి ఆ అమ్మాయి తెలివిగా ఎలా తప్పించుకుంది అనేదే కథ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

11. ‘మహానటి’

అలనాటి నటి శావిత్ర జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాలో శావిత్రి పాత్రలో నటి కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమాలో శావిత్రి జీవితంలో జరిగిన అనేక విషయాలను తెరపై చూపించిన విధానం అద్బుతంగా ఉంటుంది. కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తో కీర్తి సురేష్ కు నటి గా మంచి గుర్తింపు వచ్చింది.  

12. ‘యశోద’

రీసెంట్ టైమ్ లో వచ్చిన ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో చెప్పుకోదగ్గది ఈ సినిమా. నటి సమంత గతంలోనూ ‘ఓ బేబి’ వంటి ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది. తర్వాత మళ్లీ ‘యశోద’ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో సమంత నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. 

Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?

Published at : 07 Mar 2023 04:55 PM (IST) Tags: telugu movies women Oriented Movies International Women's Day women oriented movies Telugu

సంబంధిత కథనాలు

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?

Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?

Shah Rukh Khan Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Shah Rukh Khan  Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

టాప్ స్టోరీస్

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?