Akhanda at Pre-Release Roar: బాలకృష్ణ వేడుకకు వస్తున్న బన్నీ... ఒకే వేదికపై అఖండ, పుష్పరాజ్
నట సింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్ లో జరగనుంది. దానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నారు.
నందమూరి, అల్లు కుటుంబాల మధ్య అనుబంధం గురించి ఇటీవల జరిగిన 'అన్ స్టాపబుల్' కర్టైన్ రైజర్ ఈవెంట్‌లో నట సింహం బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఆయన తండ్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, అల్లు రామలింగయ్య ఎంత సన్నిహితంగా ఉండేవారనేది ఆయన చెప్పుకొచ్చారు. వారి తర్వాత తరాల మధ్య కూడా ఆ సాన్నిహిత్యం కొనసాగుతోంది. అల్లు ఫ్యామిలీ భాగస్వామ్యం ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఓటీటీ వేదిక 'ఆహా' కోసం బాలకృష్ణ ఓ టాక్ షో చేస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా వేడుకకు అల్లు రామలింగయ్య మనవడు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నారు.
Its going to be a 💥 𝐌𝐀𝐒𝐒ive Explosion Event 💣
— Dwaraka Creations (@dwarakacreation) November 25, 2021
🔥 Icon Star @alluarjun a.k.a #Pushpa meets #Akhanda at Pre-Release Roar 🦁💥
📍Shilpakala Vedika | 27th Nov @ 6:30PM#AkhandaRoaringFrom2ndDec#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @IamJagguBhai @actorsrikanth pic.twitter.com/Wv39bZqCwo
బాలకృష్ణ నటించిన తాజా సినిమా 'అఖండ'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్, శిల్పకళా వేదికలో జరగనున్న ఈ వేడుకకు అల్లు అర్జున్ గెస్టుగా వస్తున్నారు.
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా ఇది. ఇంతకు ముందు బోయపాటితో అల్లు అర్జున్ 'సరైనోడు' చేసిన సంగతి తెలిసిందే. త్వరలో మరో సినిమా చేయనున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలను బోయపాటి ఓ వేదికపైకి తీసుకొస్తున్నారు.
Also Read: ఏదో ఏదో... పాటలోనూ మళ్లీ ముద్దును చూపించారు! మరి, మరో ముద్దును?
Also Read: రాజ'శేఖర్'... చేసేది చెప్పడు, చెప్పింది చేయడు! ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది... చూశారా?
Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
Also Read: రాజమౌళి మూడు గంటల సినిమా తీశారా? 'ఆర్ఆర్ఆర్' రన్ టైమ్ ఎంత?
Also Read: కొవిడ్‌లో చాలా గోతులు తవ్వుకున్నాం... మళ్లీ థియేటర్లకు రావాలి! - సుప్రియ
Also Read: ఆ హరిణి వేరు... ఈ హరిణి వేరు! హరిణి పేరుతో ముగ్గురు ఉండటంతో కన్‌ఫ్యూజన్!
Also Read: టాలీవుడ్ మీడియాకు 'జనని...' సాంగ్ చూపించిన రాజమౌళి... ఎలా ఉందంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి