Samantha: అప్పట్లో మా ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగితే బాగుండేదని ఎదురు చూసా: సమంత
ఎవరైనా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయంటే భయపడతారు. కానీ దక్షిణాది అగ్ర నటి సమంత మాత్రం తన ఇంటి మీద ఐటీ రైడ్స్ జరిగితే బాగుందని ఎదురు చూసిందట.
ఎవరైనా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయంటే భయపడతారు. కానీ దక్షిణాది అగ్ర నటి సమంత మాత్రం తన ఇంటి మీద ఐటీ రైడ్స్ జరిగితే బాగుందని ఎదురు చూసిందట. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా! అవునండీ ప్రతి రోజు ఐటీ అధికారులు వస్తారేమో అని ఎదురు చూశానని చెప్పుకొచ్చింది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో కాఫీ విత్ కరణ్ షోకి సామ్ అతిధిగా పాల్గొంది. ఈ షోలో సామ్-చై విడాకుల గురించి తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలని షేర్ చేసుకుంది. సామ్ విడాకులు తీసుకున్న టైం లో రూ.250 కోట్లు భరణంగా తీసుకున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. దాని గురించి ఈ షో లో ఆమె మాట్లాడారు.
'నేను రు..250 కోట్లు భరణం తీసుకున్నానని అన్నారు. ఆ సమయంలో ప్రతి రోజు నేను ఐటీ అధికారులు ఎప్పుడెప్పుడు మా ఇంటికి వస్తారా అని ఎదురు చూశాను. నేను రూ. 250 కోట్ల భరణం తీసుకున్నానని కథలు సృష్టించారు. కానీ తర్వాత అవి నమ్మేవి కాదని అర్థం చేసుకున్నారు' అని సామ్ చెప్పుకొచ్చారు. తన గురించి చదివిన గాసిప్స్ లో ఇదే చెత్తదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరణ్ విడాకుల గురించి ప్రశ్నించినప్పుడు సామ్ కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది. 'ఒకవేళ మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచారనుకోండి... మీరు షార్ప్ ఆబ్జెక్ట్స్ (కత్తులు వంటివి) దాచేయాలి. ప్రస్తుతానికి అయితే అంతే! మా మధ్య అంత స్నేహపూర్వక సంబంధాలు లేవు. భవిష్యత్తులో, కొన్నాళ్ల తర్వాత అయితే పరిస్థితి స్నేహపూర్వకంగా ఉంటుందేమో'' అని సమంత చెప్పారు. విడాకులు తీసుకోవడం అనేది అంత ఈజీగా జరిగిందేమి కాదని అన్నారు. అంతక ముందు కంటే ఇప్పుడు ఇంక స్ట్రాంగ్ గా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.
Also Read : క్వారంటైన్ అంత సరదాగా ఏమీ ఉండదు - కరోనా తగ్గిన తర్వాత వరలక్ష్మీ ఫస్ట్ వీడియో
చై నుంచి విడిపోయిన తర్వాతే సామ్ పుష్ప సినిమాలో 'ఊ అంటావా మావ' పాట చేసింది. ఈ పాటతో బాలీవుడ్ ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. త్వరలోనే సామ్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నటు తెలుస్తోంది. కరణ్ క్యాంపు నుంచే సామ్ వెళ్లనున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. కరణ్ షోలో సామ్ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ఊ అంటావా మావ సాంగ్ కి స్టెప్పులేసింది.
View this post on Instagram