By: ABP Desam | Updated at : 29 Nov 2022 09:02 AM (IST)
'హైపర్' ఆది, శ్రీముఖి (Image courtesy - @MallemalaTV /YouTube)
'హైపర్' ఆది (Hyper Aadi) కి గుండు కొట్టారు. అదీ అందరూ చూస్తుండగా... స్టేజి మీద కూర్చోబెట్టి మరీ గుండు కొట్టారు. ఒకవైపు సీనియర్ హీరోయిన్, నటి ఇంద్రజ వద్దని చెబుతున్నా... ఆది తోటి కమెడియన్లు అసలు వినలేదు. ఆదికి గుండు కొట్టి తీరాల్సిందేనని పట్టు బట్టారు. తాము అనుకున్న పని చేశారు. అసలు, ఆదికి ఎందుకు గుండు కొట్టారు? అనే వివరాల్లోకి వెళితే...
మూతి ముద్దు పోయి గుండు వచ్చే!
'హైపర్' ఆది అంటే బుల్లితెర వీక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'జబర్దస్త్'. ఆ ప్రోగ్రామ్ తర్వాత 'ఢీ' గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆ రెండు షోలతో పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' (Sridevi Drama Company) షో కూడా చేస్తున్నారు. 'సుడిగాలి' సుధీర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ షోలకు ఆది మెయిన్ అట్రాక్షన్ అవుతున్నారు. ప్రతి వారం షో ఇంట్రెస్టింగ్‌గా మార్చడం కోసం కొత్తగా స్కిట్స్ చేస్తున్నారు. టీఆర్పీ కోసం కొన్ని జిమ్మిక్కులు కూడా చేస్తున్నారు. వాటిలో భాగమా? లేదంటే నిజంగానా? అనేది ఇప్పుడే చెప్పలేం కానీ... ఆదికి అయితే గుండు కొట్టినట్టు ప్రోమో విడుదల చేశారు.
'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ప్రోమో చూస్తే... అందులో ఆదికి ఓ టాస్క్ ఇచ్చారు. స్క్రీన్ మీద కొన్ని నంబర్స్ ఉన్నాయి. అందులో ఓ నంబర్ సెలెక్ట్ చేసుకుంటే... దాని వెనుక ఓ పని చేయాలని ఉంటుంది. ముందు ఆది సెలెక్ట్ చేసుకున్న నంబర్ చూస్తే... 30 సెకన్ల పాటు ఎవరిని అయినా లిప్ కిస్ చేసుకోవచ్చని ఉంది. దానిని క్యాన్సిల్ చేసి, తర్వాత మరో నంబర్ సెలెక్ట్ చేసుకున్నారు. అది ఓపెన్ చేస్తే... గుండు కొట్టించుకోవాలని ఉంది. దాంతో అందరూ కలిసి ఆదికి గుండు కొట్టించినట్టు చూపించారు.
ఇంద్రజ ఆగమని చెప్పినా వినలేదు!
ఆదికి గుండు కొట్టి తీరాల్సిందేనని మిగతా కమెడియన్లు పట్టుబడితే... ''ఆగండి!ఆయనకు ఎన్ని కమిట్‌మెంట్లు ఉంటాయి!'' అని ఇంద్రజ వద్దని చెప్పే ప్రయత్నం చేశారు. ''టాస్క్ అంటే టాస్క్'' అంటూ 'బుల్లెట్' భాస్కర్ సహా ఇతరులు ఆమె మాట వినలేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీఆర్పీ కోసమా? నిజమా?
ఆదికి గుండు కొట్టడం టీఆర్పీ కోసమా? లేదంటే నిజంగా గుండు కొట్టారా? అనే అనుమానం కొందరిలో ఉంది. ఎందుకంటే... గతంలో ఈ విధంగా ప్రోమోలు కట్ చేసి... చివరకు అదంతా అబద్ధం అన్నట్టు చూపించిన స్కిట్లు కూడా ఉన్నాయి. అందుకని, కొంత మంది 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమోలను పట్టించుకోవడం మానేశారు.
ఈటీవీలో ప్రతి బుధవారం టెలికాస్ట్ అయ్యే డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ 14 : డాన్సింగ్ ఐకాన్'లో ఆ మధ్య శ్రద్ధా దాస్ (Shraddha Das)తో తనకు, ఆదికి ఎంగేజ్‌మెంట్ అయ్యిందని చెప్పించారు. అఫ్‌కోర్స్ అదీ సరదాగానే అనుకోండి! అయినా నిజం అన్నట్టు బిల్డప్ ఇచ్చారు.
Also Read : 'అల్లరి' నరేష్, వరుణ్ ధావన్ కంటే 'సుడిగాలి' సుధీర్ క్రేజ్ ఎక్కువా?
ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం కోసం పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్‌లు చేసుకోవడం పక్కన పెడితే... నిజంగా ఆది పెళ్లి ఎప్పుడు జరుగుతుందో? ఆయన పెళ్లి కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు.
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా
Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!
Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి
Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!