News
News
X

Hyper Aadi Engagement : హీరోయిన్‌తో 'హైపర్' ఆది ఎంగేజ్‌మెంట్‌!

గ్లామరస్ హీరోయిన్‌తో 'హైపర్' ఆది ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ తన నోటితో చెప్పారు.

FOLLOW US: 
 
తెలుగు టీవీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టు తీస్తే... అందులో 'హైపర్' ఆది (Hyper Aadi) పేరు కూడా ఉంటుంది. రైటర్‌గా, ఆర్టిస్టుగా, డ్యాన్స్ షోలో టీమ్ లీడర్‌గా అతని కెరీర్ స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఏడు అడుగులు ఎప్పుడు వేయాలి? అనేది ఆయన ఇష్టం. అయితే... ఆయనకు పెళ్లి వయసు వచ్చేసిందనేది నిజం!
 
రష్మీ గౌతమ్‌తో 'సుడిగాలి' సుధీర్ ప్రేమలో ఉన్నారని టీవీ షోలు చూసే ప్రజలు, టీవీ ఇండస్ట్రీలో జనాలు నమ్ముతారు. 'హైపర్' ఆది విషయంలో అటువంటి వార్తలు ఎక్కడా వినిపించలేదు. కానీ, ఆయనకు పెళ్లి అయిపోయినట్లు రెండు మూడు సార్లు యూట్యూబ్‌లో వీడియోలు హల్ చల్ చేశాయి. ఇప్పుడు ఆయన ఎంగేజ్‌మెంట్‌ అయిందనీ, అదీ గ్లామరస్ హీరోయిన్‌తో ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందనీ మరోసారి హల్ చల్ చేస్తాయేమో!? ఎందుకో తెలియాలంటే... అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. 

ఆదితో నా ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది! - శ్రద్దా దాస్
ఈటీవీలో ప్రతి బుధవారం టెలికాస్ట్ అయ్యే డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ 14 : డాన్సింగ్ ఐకాన్'లో 'హైపర్' ఆది ఓ టీమ్ లీడర్. అదే షోలో శ్రద్ధా దాస్ (Shraddha Das) జడ్జ్. వీక్షకులను ఆకట్టుకోవడం కోసం టీమ్ లీడర్లు జ‌డ్జ్‌ల‌కు లైన్ వేస్తున్నట్లు... టీమ్ లీడర్ల మధ్య ప్రేమ చిగురిస్తున్నట్లు స్కిట్స్ రూపొందిస్తుంటారు. అందులో భాగంగా పాటల్లో కూడా వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తారు. వచ్చే వారం (అక్టోబర్ 19, బుధవారం) టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్‌లో 'హైపర్' ఆది, శ్రద్ధా దాస్ మధ్య ప్రేమ ఉన్నట్లు ఒక సాంగ్ చేశారు. అది పూర్తయిన తర్వాత 'ఆదితో పాటు నా ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది!' అని శ్రద్ధా దాస్ అనడం విశేషం. అఫ్‌కోర్స్‌ అదీ సరదాగానే అనుకోండి!

సాంగ్ కంప్లీట్ అయ్యాక... డ్యాన్సర్లు అందరూ కలిసి 'హైపర్' ఆదిని శ్రద్దా దాస్ దగ్గరకు తీసుకు వెళ్లారు. వెలికి ఉంగరం తొడిగినట్లు ఆమె ఏదో చేశారు. వాళ్ళిద్దరిపై పువ్వులను అక్షింతలుగా వేసి మిగతా వాళ్ళు ఆశీర్వదించారు. 

News Reels

ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్‌ చేయడం కోసం పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్‌లు చేసుకోవడం పక్కన పెడితే... నిజంగా ఆది పెళ్లి ఎప్పుడు జరుగుతుందో? ఆయన పెళ్లి కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు.

టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా సక్సెస్ కావాలని 'హైపర్' ఆది ట్రై చేస్తున్నారు. ఆ మధ్య 'భీమ్లా నాయక్'లోని ఒక పాటలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపించారు. అంతకు ముందు వరుణ్ తేజ్ 'తొలిప్రేమ', 'అల్లరి' నరేష్ 'మేడ మీద  అబ్బాయి' తదితర సినిమాల్లో నటించారు. ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఆ మధ్య కొన్ని రోజులు 'జబర్దస్త్'కు గ్యాప్ ఇచ్చినప్పటికీ... ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు ఆయనతో పాటు చేసిన టీమ్ మెంబర్లతో పాటు కొత్తగా నరేష్ కూడా జాయిన్ అయ్యాడు. రీ ఎంట్రీలో తనకు నరేష్ బాగా హెల్ప్ అవుతున్నదని 'హైపర్' ఆది చెప్పారు. 

Also Read : కొరటాల శివపై ఒత్తిడి పెంచిన 'గాడ్ ఫాదర్'?

Published at : 13 Oct 2022 09:59 AM (IST) Tags: Shraddha Das Hyper Aadi Hyper Aadi Engagement Dhee 14 Dancing Icon Latest Promo

సంబంధిత కథనాలు

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

NBK108 Launch : పూజతో మొదలైన బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా - గిప్పడి సంది లెక్కలు టక్కర్

NBK108 Launch : పూజతో మొదలైన బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా -  గిప్పడి సంది లెక్కలు టక్కర్

Telugu Movies 2022: గూగూల్‌ సెర్చ్‌లోనూ దక్షిణాది సినిమాల హవా, టాప్-10లో ఏయే సినిమాలు ఏయే స్థానాలంటే..

Telugu Movies 2022: గూగూల్‌ సెర్చ్‌లోనూ దక్షిణాది సినిమాల హవా, టాప్-10లో ఏయే సినిమాలు ఏయే స్థానాలంటే..

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

టాప్ స్టోరీస్

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

AP BJP Reaction On Sajjla : మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

AP BJP Reaction On Sajjla :  మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్ చూశారా!

హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్ చూశారా!