Actor Priyanth Arrest: ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం ఆరోపణలు, నటుడు ప్రియాంత్ అరెస్ట్!
తెలుగు సినీ పరిశ్రమలో సంచలన ఘటన జరిగింది. ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం చేసిన కేసులో వర్ధమాన సినీ నటుడు ప్రియాంత్ అరెస్టయ్యాడు.
టాలీవుడ్ వర్ధమాన హీరో ప్రియాంత్ అరెస్ట్ అయ్యాడు. అత్యాచారం కేసులో అతడిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో తనపై అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై ఓ జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. అత్యాచారం చేయడంతో పాటు కులం పేరుతో దూషించాడని కంప్లైంట్ లో రాసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రియాంత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
షూటింగ్ సమయంలో పరిచయం.. ఆ తర్వాత ప్రేమ!
రమణ మొగిలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొత్తగా మా ప్రయాణం’ సినిమా షూటింగ్ సమయంలో హీరో ప్రియాంత్ కు ఓ జూనియర్ ఆర్టిస్టుతో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకొనేవారని, అప్పుడప్పుడూ బయట కలిసేవారని తెలిసింది. రెండు నెలల పరిచయం తర్వాత జూనియర్ ఆర్టిస్టుకు ప్రియాంత్ లవ్ ప్రపోజ్ చేశాడని, అతడి ప్రోజల్ కు ఆమెకు ఒకే చెప్పిందని సమాచారం. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగినట్లు తెలిసింది.
Also Read: బాలీవుడ్ లోకి టీమిండియా గబ్బర్ సింగ్ ఎంట్రీ, హ్యూమాతో శిఖర్ డ్యాన్స్!
బాధితురాలు ఫిర్యాదులో ఏం రాసిందంటే!
ఒక రోజు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియాంత్ తనను హైదరాబాద్ శివారులోని ప్రగతి రిసార్ట్ కు తీసుకెళ్లినట్లు ఆమె ఫిర్యాదులో చెప్పింది. అక్కడే తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని వెల్లడించింది. అక్కడ ఒక్కచోటే కాదు.. శ్రీనగర్ కాలనీలో ఉన్న తన ఆఫీస్ కు తీసుకెళ్లి పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెల్లడించింది. చివరకు తాను ప్రెగ్నెంట్ కావడంతో ప్రియాంత్ ముఖం చాటేశాడని చెప్పింది. అబార్షన్ కోసం మందులు ఇవ్వడంతో అనారోగ్యం పాలైనట్లు వివరించింది. ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో రాసింది.
ప్రియాంత్ ఏం చెప్తాడో?
ఈ కేసుకు సంబంధించి ప్రియాంత్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. తన కుటుంబ సభ్యులు కూడా ఈ అంశంపై స్పందించలేదు. ప్రియాంత్ రిమాండ్ నుంచి బయటకు వచ్చి నోరు విప్పితే తప్ప అసలు విషయాలు బయటకు రావు. ‘కొత్తగా మా ప్రయాణం’ సినిమాతో ప్రియాంత్ వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు.
Also Read: vie: సినీ లవర్స్‌కు కార్తి దీపావళి కానుక, ‘సర్దార్‘ రిలీజ్ డేట్ ఫిక్స్!
Also Read: ప్రతిష్టాత్మక మార్వెల్ మూవీస్ విడుదల ఆలస్యం, కారణాలు ఏంటో తెలుసా?