Shikhar Dhawan: బాలీవుడ్ లోకి టీమిండియా గబ్బర్ సింగ్ ఎంట్రీ, హ్యూమాతో శిఖర్ డ్యాన్స్!
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ‘డబుల్ ఎక్స్‌ఎల్’ (Double XL) సినిమాతో వెండి తెరపై సందడి చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ధావన్ ఫస్ట్ లుక్ విడుదలైంది.
వెండితెరపై ఇప్పటికే పలువురు క్రికెట్లరు సందడి చేయగా, ప్రస్తుతం మరో క్రికెటర్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, హర్బజన్ సింగ్ సినిమాల్లో నటించగా.. ఇప్పుడు శిఖర్ ధావన్ తెరపై కనిపించబోతున్నాడు. సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘డబుల్ ఎక్స్‌ఎల్’(Double XL) మూవీతో అతడు సినిమా అరంగేట్రం చేస్తున్నాడు సత్రమ్ రమణి దర్శకత్వంలో కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘డబుల్ ఎక్స్‌ఎల్’ మూవీలో ధావన్ ఫస్ట్ లుక్ రిలీజ్
తాజాగా ఈ మూవీ నుంచి ధావన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సినిమా హీరోయిన్లలో ఒకరైన హ్యూమా ఖురేషీ.. శిఖర్ ధావన్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో ఒకటి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటో కాగా, మరొకటి సెట్స్ లో ఇద్దరు కూర్చుని సరదాగా నవ్వుతున్న ఫోటో. ‘క్యాట్ ఈజ్ ఔట్ ఆఫ్ ది బ్యాగ్ ఫైనల్లీ’ క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్టును శిఖర్ ధవన్ కు ట్యాగ్ చేసింది. శిఖర్ నల్లటి సూట్, హ్యూమా ఎరుపు రంగు గౌను ధరించి డ్యాన్స్ చేస్తున్నట్లు ఈ ఫోటోలో ఉంది. ఈ పోస్టు క్రికెట్ అభిమానులతో పాటు బాలీవుడ్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
భారీగా బరువు పెరిగిన హ్యూమా, సోనాక్షి
సత్రమ్ రమణి దర్శకత్వంలో తెరకెక్కుతున్నన ‘డబుల్ ఎక్స్‌ఎల్’ (Double XL) సినిమా తుది మెరుగులు దిద్దుకుంటున్నది. అధిక బరువున్న అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శిఖర్ ధావన్ గెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలోని పాత్రల కోసం హ్యూమా, సోనాక్షి చాలా బరువు పెరిగారు. ఇందులో రాజశ్రీ త్రివేది పాత్రలో హ్యూమా, సైరా ఖన్నా పాత్రలో సోనాక్షి కనిపిస్తారు. రాజశ్రీ ఓ స్పోర్ట్స్ ప్రెజెంటర్ కావాలని భావించగా.. సైరా ఓ ఫ్యాషన్ డిజైనర్ అయ్యేందుకు కలలు కంటుంది. ఈ నేపథ్యంలో వీళ్లు బాడీ షేమింగ్ ను ఎలా ఎదుర్కొన్నారు అనేది సినిమా కథ. ‘డబుల్ ఎక్స్‌ఎల్’ సినిమా తెలుగులో అనుష్కశెట్టి నటించిన ‘సైజ్ జీరో’ సినిమాకు దగ్గరగా ఉంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. సత్రమ్ రమణి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ స్క్రిప్ట్ అందించాడు. టీ-సిరీస్, వాకావూ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Read Also: అమ్మ, అవకాయ్, అంజలీ, ‘నువ్వే నువ్వే’ ఎప్పుడూ బోర్ కొట్టవు - తరుణ్ ఎమోషనల్ స్పీచ్
మనం ఎలా ఉన్నా, విశ్వాసం మన కలను నెరవేరుస్తుంది
అటు ఈ సినిమాపై శిఖర్ ధామన్ స్పంచాడు. “అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటాను. ఈ సినిమాలో నటించాలని అవకాశం వచ్చినప్పుడు కథ విన్నాను. నాకు చాలా నచ్చింది. ఈ సినిమా సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుంది. మనం ఎలా ఉన్నా, విశ్వాసం అనేది మన కలను నెరవేరుస్తుంది” అని వెల్లడించాడు. నవంబర్ 4 న నేరుగా నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
Read Also: రూ.12 కోట్లతో మొదలై రూ. 2 వేల కోట్లకు చేరిన ’బాక్సాఫీస్ బాహుబలి’, ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి!