అన్వేషించండి

Hyderabad: లవ్ బర్డ్స్ లావణ్య, వరుణ్ తేజ్‌ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా? తప్పకుండా షాకవుతారు

టాలీవుడ్ స్టార్స్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. తాజాగా నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో వీరి సంపాదన, ఆస్తుల విలువెంతో ఇప్పుడు తెలుసుకుందాం..

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ తెలుగు సినిమా పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చక్కటి సినిమాలతో సినీ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. కొద్ది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కొణిదెల, అల్లు కుటుంబాలు హాజరయ్యాయి. ఇద్దరు బంధువులు, మిత్రుల ఆశీర్వాదాల నడుమ ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలోనే వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి ఆస్తులు, సంపాదన గురించి కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం..  

లావణ్య ఆస్తుల విలువ ఎంతంటే?

లావణ్య త్రిపాఠి, సౌత్ లో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి ‘అందాల రాక్షసి’ చిత్రంతో అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించింది. లావణ్య రొమాంటిక్, కామెడీ, థ్రిల్లర్‌ సహా అనేక రకాల పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు, పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. సినిమాలతో పాటు ఎండార్స్ మెంట్స్ ద్వారా బాగానే డబ్బు సంపాదిస్తోంది.  2023 నాటికి ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

వరుణ్ తేజ్ సంపాదన తక్కువేం కాదు!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి కొణిదెల కుటుంబం నుంచి వచ్చిన వరుణ్ తేజ్ చక్కటి టాలెంట్ తో దూసుకుపోతున్నాడు. మంచినటనతో సెలెక్టివ్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు పొందాడు. ‘ముకుంద’ సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన వరుణ్,  ఆ తర్వాత ’కంచె’, ‘ఫిదా’, ‘గద్దలకొండ గణేష్’ లాంటి చిత్రాల్లో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వరుణ్ తేజ్ నికర ఆస్తుల విలువ అతడి సినిమాలతో పాటు బ్రాండ్స్, ఎండార్స్‌ మెంట్స్ ద్వారా పెరిగింది. వరుణ్ తేజ్ నికర ఆస్తుల విలువ 2023 నాటికి దాదాపు రూ. 47 కోట్లు ఉన్నట్లు అంచనా.  

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి ‘మిస్టర్’ అనే సినిమా 2017లో విడదల అయ్యింది. 2016లో ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచే లవ్ లో పడ్డారు. ఈ సినిమా తర్వాత ‘అంతరిక్షం’ అనే సినిమాలో కూడా లావణ్య వరుణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగుతుంది. వీరి డేటింగ్ వ్యవహారంపై వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత నాగబాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. వరుణ్ కు ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ ఏడాదిలోనే వరుణ్, లావణ్యల పెళ్లి జరుగుతుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయనప్పటికీ, ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని, అది కూడా అతి త్వరలో ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలకు వస్తే... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున' సెట్స్ మీద ఉంది.   ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా ఒకటి చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి రెండు, మూడు సినిమాలు చేస్తున్నారు.  

Read Also: విజయ వర్మతో తమన్నా డేటింగ్ - అసలు విషయం చెప్పేసిన మిల్కీ బ్యూటీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget