అన్వేషించండి
Advertisement
Samantha's Yashoda cast: సమంత 'యశోద'లో వీళ్లూ నటిస్తున్నారు... భారీ తారాగణమే!
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'యశోద'లో భారీ తారాగణమే ఉంది. శ్రీదేవి మూవీస్ సంస్థ పేరున్న, ప్రతిభావంతులైన నటీనటులను తీసుకుంది.
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'యశోద'. ఇందులో మధుబాల పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నట్టు పది రోజుల క్రితం ప్రకటించారు. ఆ తర్వాత మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడించారు. తాజాగా ఆ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్న నటీనటుల వివరాలు వెల్లడించారు.
శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా 'యశోద' చిత్రాన్ని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో ఆయనే విడుదల చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక జరిగినట్టు అర్థం అవుతోంది.
'ఫ్యామిలీ మాన్ 2'తో సమంతకు జాతీయ స్థాయిలో గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ వెబ్ సిరీస్ క్రియేటర్లు రాజ్ అండ్ డీకే ఆమెతో మరో వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. అది పక్కన పెడితే... 'యశోద'లో నటిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ దక్షిణాది ప్రేక్షకులకు తెలుసు. హిందీలోనూ సినిమాలు చేసిన తెలుగు నటుడు మురళీ శర్మతో మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ రావు రమేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో చేస్తున్నట్టు నిర్మాత వెల్లడించారు.
హైదరాబాద్‌లో ఈ నెల 6న 'యశోద' ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. 24తో ముగిసింది. అందులో సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. షెడ్యూల్ ముగిసిన సందర్భంగా వాళ్లందరూ నటిస్తున్నట్టు వెల్లడించారు. జనవరి 3న నుంచి 12 వరకూ రెండో షెడ్యూల్... ఆ తర్వాత జనవరి 20 నుంచి మార్చి 31 వరకూ షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారు. దర్శకులు ఇద్దరూ కొత్తవాళ్లు అయినప్పటికీ చాలా ఎక్స్ట్రార్డి నరీగా, కాన్ఫిడెంట్‌గా తెరకెక్కిస్తున్నారని... ఖర్చు విషయంలో రాజీ పడకుండా, భారీ బడ్జెట్‌తో సినిమా చేస్తున్నామని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు.
హరి - హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి పాటలు... పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాటలు రాస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, కెమెరా: ఎం. సుకుమార్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.
Also Read: అవమానకర రీతిలో డాన్స్.. సన్నీలియోన్ ను ఇండియా నుంచి తరిమేయమంటూ ఫైర్..
Also Read: అవికా గోర్ బాయ్‌ఫ్రెండ్ పెద్ద కారే కొన్నాడు!
Also Read: ఏపీలో టికెట్ రేట్స్ ఎఫెక్ట్... ఇండియాలో భారీ స్క్రీన్ మూసివేత
Also Read: పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?
Also Read: బిగ్ బాస్-ఓటీటీ 49 రోజులే.. టాప్-5 కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్! ప్రైజ్ మనీ.. ఫుల్ డిటైల్స్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: అవికా గోర్ బాయ్‌ఫ్రెండ్ పెద్ద కారే కొన్నాడు!
Also Read: ఏపీలో టికెట్ రేట్స్ ఎఫెక్ట్... ఇండియాలో భారీ స్క్రీన్ మూసివేత
Also Read: పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?
Also Read: బిగ్ బాస్-ఓటీటీ 49 రోజులే.. టాప్-5 కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్! ప్రైజ్ మనీ.. ఫుల్ డిటైల్స్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion