Honey Rose: కొత్త సినిమాలో హనీరోజ్ హాట్ లుక్, బ్యాన్ చేయాలంటూ నెటిజన్ల లొల్లి!
హనీ రోజు నటిస్తున్న తాజా చిత్రం ‘రాహేలు'. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఇందులో అందాల తార అవతారం చూసి నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అందాల తార హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అంద చందాలతో సినీ అభిమానులను ఓ రేంజిలో అలరిస్తోంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె ‘రాహేలు’ అనే పాన్ ఇండియన్ మూవీలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని హనీ రోజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె బోల్డ్ లుక్ చూసి నెటిజన్ల మతి పోతోంది. ఈ సినిమా బీఫ్ రాజకీయాల చుట్టూ తిరగడం, ఇందులో ఆమె బీఫ్ అమ్మే మహిళగా కనిపించడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
షాకింగ్ లుక్ లో హనీ రోజ్
నందమూరి బాలయ్య సినిమా 'వీరసింహారెడ్డి'లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయంతో టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన గ్లామర్‌తో కుర్రకారును అమితంగా ఆకట్టుకుంది. ఈ మలయాళ బ్యూటీ ప్రస్తుతం ‘రాహేలు’ అనే పాన్ ఇండియన్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని మేకర్స్ తాజాగా విడుదల చేసింది. హనీ రోజు హాట్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కత్తి పట్టుకుని బీఫ్ కొడుతూ షాకింగ్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఈ ఫస్ట్ లుక్ వీడియోలో ఆమె బీఫ్ వేలాడదీసి ఉంది. మొద్దు మీద దున్నపోతు తలకాయ కనిపించింది. సీరియస్ లుక్‌లో కత్తిపట్టుకొని హనీరోజ్ బీఫ్ అమ్మే మహిళగా కనిపించింది.
View this post on Instagram
‘రాహేలు’ బ్యాన్ చేయాలంటూ నెటిజన్ల డిమాండ్
ఇక ఆమె ఫస్ట్ లుక్ చూస్తే విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె లుక్, ఉన్న వాతావరణం భయంకరంగా కనిపిస్తోంది. అయితే, ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, హనీ రోజ్ అందం కంటే, బీఫ్ అమ్మడం మీద ఫుల్ గా ఫోకస్ పెట్టారు నెటిజన్లు. అసలే బీఫ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఫస్ట్ లుక్ వివాదాస్పదం అవుతోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
బ్యాన్ డిమాండ్ పై స్పందించని చిత్రబృందం
సోషల్ మీడియా వేదికగా ‘రాహేలు’ సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ‘బ్యాన్ రాహేలు’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ బ్యాన్ డిమాండ్ పై చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, త్వరలోనే ఈ వివాదం గురించి ఏదో ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు సినీ జనాలు.
Read Also: ‘దృశ్యం’ కాంబో దూకుడు- ఒక మూవీ షూట్ లో ఉండగానే మరో సినిమా అనౌన్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial