అన్వేషించండి

Sailesh Kolanu: హిట్-2లో విశ్వక్ సేన్ లేడు, కానీ ఉంటాడు - దర్శకుడు శైలేష్ కొలను ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిన మూవీ హిట్. దీనికి సీక్వెల్ గా హిట్-2 వస్తోంది. ఇందులో హీరోగా అడవి శేషు నటిస్తున్నాడు. అయితే, విశ్వక్ ఈ సినిమాలో ఎందుకు లేడో చెప్పాడు దర్శకుడు శైలేష్.

విశ్వక్ సేన్ ను కాదని అడవి శేషును తీసుకున్న శైలేష్

మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన మూవీ ‘హిట్’. ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించాడు. ఇందులో విశ్వక్ సేన్ పోలీసులు అధికారి పాత్రలో కనిపించాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు. ‘హిట్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు శైలేష్. ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ తీయనున్నట్లు అప్పట్లోనే దర్శకుడు వెల్లడించాడు. ‘హిట్: ది ఫస్ట్ కేస్’ తర్వాత ప్రస్తుతం ‘హిట్: ది సెకెండ్ కేస్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ కు బదులుగా అడవి శేషును తీసుకున్నాడు. దర్శకుడి నిర్ణయానికి అంతా షాకయ్యారు.

హిట్-2లో విశ్వక్ సేన్ లేడు, కానీ ఉంటాడన్న దర్శకుడు

‘హిట్’ మూవీలో నటించిన విశ్వక్ సేన్ ను కాదని సీక్వెల్ లో అడవి శేషును తీసుకోవడంపై శైలేష్ స్పందించాడు. ’హిట్: ది సెకెండ్ కేస్’ ప్రకటించిన సందర్భంలో చాలా మంచి ఆశ్చర్యపోయారు. ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ నటిస్తే, సెకెండ్ పార్ట్ లో అడవి శేషును తీసుకోవడం ఏంటని చాలా మంది తిట్టుకున్నారు. అయితే, ఈ  సినిమాలో విక్రమ్ రుద్రరాజు ( హిట్ మూవీలో విశ్వక్ సేన్ క్యారెక్టర్) ఎక్కడికీ వెళ్లడు. ఈ యూనివర్స్ లోనే ఉంటాడు. మళ్లీ వస్తాడు. అందరూ పోలీస్ ఆఫీసర్ లు కలిసి ఒక పెద్ద కేస్ సాల్వ్ చేసినప్పుడు విక్రమ్ రుద్రరాజు స్టోరీ కూడా కంప్లీట్ అవుతుంది” అని చెప్పాడు.

హిట్-3 ఉంటుందని హింట్ ఇచ్చిన శైలేష్

‘హిట్: ది సెకెండ్ కేస్’ లో అడవి శేషు కృష్ణ దేవ్ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తాడని దర్శకుడు శైలేష్ తెలిపారు. అంతేకాదు, హిట్-2 తర్వాత, హిట్-3 కూడా ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అటు తాజాగా విడుదలైన ‘హిట్-2’ సినిమా టీజర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది. ముక్కలు ముక్కలుగా నరికిన యువతి డెడ్ బాడీతో భయంకరంగా ఉంది. ఈ కేసును అడవి శేషు పరిష్కరించబోతున్నాడు. ‘హిట్-2’ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకులు ముందుకు రానుంది.   

హిట్-2 నిర్మాతగా నాని

‘హిట్‘ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నాని, ఈ సినిమా బాధ్యతలు కూడా తీసుకున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ‘హిట్‘ మూవీలో విశ్వక్ సేన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. వసూళ్ల పరంగానూ ఈ సినిమా దుమ్మురేపింది. ‘హిట్-2‘లో అడవి శేషు ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sesh Adivi (@adivisesh)

 

Read Also: యాక్షన్‌తో దుమ్మురేపిన సుధీర్, ఆకట్టుకుంటున్న ‘గాలోడు’ టీజర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
Embed widget