Hidimba Movie Trailer: సరికొత్త జోనర్‌తో ‘హిడింబ’ - సాలిడ్ అప్డేట్ వచ్చేసింది
అశ్విన్ హీరోగా, అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హిడింబ’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు.

‘రాజు గారి గది’ సిరీస్ తో తెలుగులో అద్భుత గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అశ్విన్. ప్రముఖ యాంకర్, ఫిల్మ్ మేకర్ ఓంకార్ గా తమ్మడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సరికొత్త జానర్లలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కొంత కాలంగా ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కావడం లేదు. అయినా, జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు అశ్విన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో ‘హిడింబ’ అనే అవుట్ అంట్ అవుట్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమాతో అశ్విన్ ఖాతాలో సాలిడ్ హిట్ పడటం ఖాయం అంటున్నారు సినీ జనాలు.
త్వరలో ‘హిడింబ’ ట్రైలర్ విడుదల
తాజాగా ఈ సినిమా నిర్మాతలు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఇప్పటికే ‘హిడింబ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా, త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ట్రైలర్ ఉండబోతోందని ప్రకటించారు. “ఇంతకు ముందెన్నడూ చెప్పని కథను అందిస్తున్నాం. భారతీయ సినిమా చరిత్రలోనే ఇంకా అన్వేషించని జోనర్ లో ఈ సినిమా రాబోతోంది. మీ అందరినీ ఆశ్చర్యపరిచేలా త్వరలో ట్రైలర్ విడుదల కాబోతోంది” అని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
View this post on Instagram
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీవిఘ్నేష్ సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించాడు. అనిల్ సుంకర, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సమర్పిస్తున్న ఈ సినిమాలో అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత హీరోయిన్‌గా నటించింది. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నారు. రాజశేఖర్ సినిమాటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
‘రాజు గారి గది‘ సిరీస్ లో అశ్విన్ బాబు హీరోగా నటించారు. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి భాగం 2015లో విడుదల అయ్యింది. ఈ హార్రర్ కామెడీ చిత్రంలో అశ్విన్ బాబు సరసన ధన్య బాలకృష్ణ నటించారు. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘రాజు గారి గది 2‘ అక్టోబర్ 2017లో విడుదల కాగా, మూడవ సీక్వెల్ ‘రాజు గారి గది 3‘ 2019లో విడుదలైంది.
Read Also: విక్రమ్ తో సినిమా చేయాలనుకున్నా, స్పందించకపోవడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నా- అనురాగ్ కశ్యప్
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















