Chandini Chowdary: హీరోయిన్ చాందిని చౌదరికి వేధింపులు?
టాలీవుడ్ లో చాందిని చౌదరి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ‘కలర్ ఫోటో’ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం చాందిని గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ లో చాందిని చౌదరి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిల్మ్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది చాందిని చౌదరి. తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి విలక్షణమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన ‘కలర్ ఫోటో’ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ బ్యూటీ. నటనపరంగానూ మంచి ప్రశంసలు అందుకుంది. అయితే చాందినీ చౌదరిపై సైబర్ నేరగాళ్ల కళ్లు పడ్డాయి. ఆన్‌లైన్ వేదికగా ఆమెను ముప్పు తిప్పలు పెడుతున్నారట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది.
మా పేర్లు వాడుకొని స్కామ్ చేస్తున్నారు: చాందిని
గత కొన్ని నెలల నుంచి అంతర్జాతీయ నెంబర్లు ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పింది చాందిని. పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుకోవడానికి తమ పేర్లు వాడుకుంటూ వాట్సాప్ లలో మేసేజ్ లు పంపుతున్నారని తెలిపింది. ఇవి అంతటితో ఆగిపోవడం లేదని, వేధింపులకు కూడా గురి చేస్తున్నారని చెప్పింది. ఈ విధంగా తనను మాత్రమే కాదని, తన కో స్టార్స్ ల పేర్లు, ఫోటోలను కూడా సైబర్ వేధింపులకు దిగుతున్నారని పేర్కొంది. ఎవరికైనా ఇలాంటి మెసేజ్ లు వస్తే నమ్మొద్దని, వ్యక్తిగత వివరాలు షేర్ చేసుకోవద్దని చెప్పుకొచ్చింది చాందిని. దానితో పాటు తన ఇంస్టాగ్రామ్ లో అందుకు సంబంధించిన స్క్రీన్ షార్ట్ లను కూడా షేర్ చేసింది.
సెలబ్రెటీలే టార్గెట్ గా సైబర్ వేధింపులు
ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించి ఎంతో మంది సెలబ్రెటీలు సైబర్ వేధింపులకు గురవుతున్నారు. సైబర్ నేరగాళ్లు సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వేధింపులకు పాల్పడుతున్నారు. నటీనటుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం, తప్పుడు సమాచారాన్ని పంపించడం, వారి వ్యక్తిగత వివరాలతో డిజిటల్ మోసాలకు పాల్పడటం వంటివి నిత్యం చూస్తూనే ఉన్నాం. అందుకే ఇలాంటి విషయాల పట్ల సెలబ్రెటీలు కూడా అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు సైబర్ నిపుణులు.
View this post on Instagram
అందం అభినయంతో పాటు మంచి నటనతో అందరి దృష్టినీ ఆకట్టుకుంది చాందిని చౌదరి. అయితే కెరీర్ పరంగా మంచి అవకాశాలే వస్తున్నా ‘కలర్ ఫోటో’ తర్వాత సరైన హిట్ రాలేదు. ఇటీవలె కిరణ్ అబ్బవరం హీరోగా ‘సమ్మతమే’ సినిమాలో నటించింది చాందిని. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ తర్వాత పలు పాపులర్ వెబ్ సిరీస్ లలో నటిస్తుంది ఈ బ్యూటీ. వీటితో పాటు త్వరలో నటుడు నవదీప్ తన మిత్రుడితో పాటు కలసి నిర్మిస్తోన్న సినిమాలో నటించనుంది. మరి ఈ సినిమాతో అయినా అమ్మడుకి సరైన హిట్ అందుతుందో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది చాందిని.
Read Also: ‘భవదీయుడు’ కాదు, ‘ఉస్తాద్’ - పవన్, హరీష్‌ల మూవీ టైటిల్ మార్పు, కొత్త పోస్టర్‌తో అదిరేటి అప్డేట్!