Hero Srikanth: కేసు వేయకపోవడానికి కారణం అదే, అందుకే మా పిల్లలు చాలా జాగ్రత్త ఉంటారు - రేవ్ పార్టీ రూమర్స్‌పై శ్రీకాంత్ రిప్లై
Hero Srikanth: తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించారు హీరో శ్రీకాంత్. తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్న వాళ్లని అందుకే వదిలేస్తున్నానని, జీవితాలు నాశంన చేయాలని తాను అనుకోను అని అన్నారు.
Hero Srikanth About Rumours On Him: హీరో శ్రీకాంత్.. ఎప్పుడూ ఆయన గురించే ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఆయనకు యాక్సిడెంట్ అయ్యిందని ఒక వార్త, తను విడాకులు తీసుకుని భార్యతో విడిగా ఉంటున్నాడు అంటూ మరో వార్త. ఇక ఈ మధ్య బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కూడా హీరో శ్రీకాంత్ ఉన్నాడని వార్తలు బయటికి వచ్చాయి. అయితే, ఆయన దానిపై క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు కూడా. కాగా.. అలాంటి వార్తలు రాస్తున్న వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పారు శ్రీకాంత్. అంతేకాదు ఇలాంటి విషయాల్లో తన పిల్లలు చాలా జాగ్రత్త పడుతున్నారు అంటూ చెప్పారు ఆయన.
వాళ్లకి ఇవన్నీ తెలుసు..
ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు శ్రీకాంత్. దాంట్లో ఆయన చాలా విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన కొడుకు హీరో అవుతున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు అనే విషయాలు చెప్పారు ఆయన. "మా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారు ఇలాంటి విషయాల్లో. సోషల్ మీడియాలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎందుకంటే వాళ్లకు ఇవన్నీ తెలుసు కదా? ఇవన్నీ చూస్తున్నారు కదా. మా అప్పుడు సోషల్ మీడియా లాంటివి లేవు. పక్కన వాళ్ల ఇంట్లో ఫోన్ ఉంటే శ్రీకాంత్ నీకు ఫోన్ వచ్చింది అని చెప్తే వెళ్లేవాళం మేము. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు రోషన్. నేర్చుకుంటున్నాడు అన్నీ. యంగ్ జనరేషన్ అంతా వీటిని చూసి తెలుసుకుంటారు అనుకుంటున్నాను. ఈ రేవ్ పార్టీలు, పోలీసులు, డ్రగ్స్ అవి లేకుండా జాగ్రత్త పడతారు కచ్చితంగా. మనకేంటిలే అని కొంతమంది ఉంటారు. కానీ, చాలామంది యంగ్ స్టర్స్ జాగ్రత్తగా ఉంటారు. మీడియా ప్రతీది చూపించాలి. అప్పుడే భయపడతారు వీళ్లంతా" అని చెప్పారు శ్రీకాంత్.
చాలా బాధపడ్డాం..
"చాలాసార్లు లేనిది ఉన్నట్లుగా చెప్తే బాధ కలుగుతుంది. ఒకరి క్యారెక్టర్ మీద అలా నెగటివ్ చేసినప్పుడు బాధ వేస్తుంది కదా ఎవరికైనా. ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తే ఇద్దరం నవ్వుకుంటాం. కానీ, చాలా ఫీల్ అవుతాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. మూడు ఇన్‌సిడెంట్లు నాకే జరగడం. ఏమీ అనరు లే, పట్టించుకోరేమో అనే పద్ధతిలో ఉంటున్నారు చాలామంది. రేవ్ పార్టీ ఇష్యూ అప్పుడైతే చాలా సీరియస్ అయ్యాను. పెద్ద పెద్ద లాయర్స్ ని సంప్రదించాను. కోర్టుకు వేసేయ్ అన్నారు. జడ్జిలు చెప్పారు నాకు వేయమని, మీరు లేనప్పుడు ఎందుకు కేసు వేయట్లేదు. మీదే ఫాల్ట్ అని అన్నారు. వాళ్లే తెలుసుకుంటారు లే అనే ఉద్దేశంతో వేయలేదు. ఎవరైతే వేశారో వాళ్లు సమాధానం చెప్పారు. సారీ చెప్పారు అందుకే వదిలేశాను. ఒకరిని నాశనం చేయాలని అనుకోను నేను. వాళ్ల జీవితం మొత్తం ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే కేసు వేయకుండా ఛాన్స్ ఇచ్చాను" అని క్లారిటీ ఇచ్చారు శ్రీకాంత్.
విడాకులపై..
ఈ మధ్య ఎక్కువ అవుతున్న విడాకులు కేసు గురించి మాట్లాడారు శ్రీకాంత్. అభిప్రాయ బేధాలు రావడం వల్లే విడాకులు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. పెళ్లి చేసుకునేముందు చాలా మంది ఉత్సాహంగా ఉంటారని, పెళ్లి అయ్యాక దీనికా పెళ్లి చేసుకుంది అనుకుంటారని చెప్పారు. సెలబ్రిటీలు మాత్రమే కాదని, బయట ఎన్నో జంటలు విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పారు ఆయన. ఇక అదే విధంగా.. పెళ్లికి ముందు ఒకలా ఊహించుకుంటారని, అది అవ్వకపోవడంతో విబేధాలు వస్తున్నాయన్నారు.
Also Read: ఆనంద్ నా బిగ్ బ్రదర్, సాయి రాజేష్‌తో సినిమా చేస్తా: రష్మిక మందన్న