News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Rajasekhar: నేను బతుకుతానా? లేదా? నా జీవితం అయిపోయిందని అనిపించింది! - రాజశేఖర్ ఎమోషనల్ బ‌ర్త్‌డే స్పీచ్‌

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ మరోసారి ఎమోషనల్ అయ్యారు. బతుకుతానా? లేదా? అని అనుకున్నట్టు చెప్పారు. జీవితం అయిపోయిందని అనుకున్నానని అన్నారు.

FOLLOW US: 
Share:

యాంగ్రీ స్టార్ రాజశేఖర్, ఆయన భార్య జీవిత, పిల్లలు శివాని - శివాత్మిక కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ మినహా మిగతా వాళ్ళు త్వరగా కోలుకున్నారు. ఆయనకు మాత్రం సీరియస్ అయ్యింది. ఐసీయూలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ టీవీ కార్యక్రమంలో కరోనా కాలంలో తాను చచ్చిపోతానని అనుకున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ రోజు (శుక్రవారం, ఫిబ్రవరి 4న) పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకల్లో మరోసారి ఎమోషనల్ అయ్యారు.

"కొవిడ్ టైమ్‌లో బతుకుతానా? లేదా? అనిపించింది. నా జీవితం అయిపోయిందని అనుకున్నా. సినిమాలు చేస్తానా? లేదా? అనుకున్నాను. ఎందుకంటే... ఆస్పత్రిలో లేవలేక, నడవలేక దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. అయితే... ఇవాళ నేను మీ ముందు ఇలా నిలబడ్డానంటే కారణం మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమే. మీ అందరికీ ధన్యవాదాలు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత 'శేఖర్' సినిమా చేశా. పది సినిమాలకు పడిన కష్టం ఈ ఒక్క సినిమాకు పడ్డాం. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి సినిమా చేశారు. 'శేఖర్' బాగా రావడానికి కారణం జీవిత. తను వెనుకుండి మమ్మల్ని ముందుకు నడిపించింది" అని రాజశేఖర్ చెప్పారు.

రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా 'శేఖర్' సినిమాలో 'కిన్నెర...' పాటను శుక్రవారం విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతంలో అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించారు. రాజశేఖర్, 'జార్జ్ రెడ్డి' ఫేమ్ ముస్కాన్ మీద ఈ పాటను చిత్రీకరించారు.

దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "గత ఏడాది 'శేఖర్' సినిమా చేద్దామని అనుకున్నప్పుడు రాజశేఖర్ గారికి కరోనా వచ్చింది. అప్పుడు పుట్టినరోజు కూడా జరుపుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ పుట్టినరోజుకు 'కిన్నెర...' పాటతో మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా పూర్తి చేయడానికి సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. అలాగే, రాజశేఖర్ గారు ఆరోగ్యంగా ఉండాలని స్నేహితులు, బంధువులు, అభిమానులు పూజలు చేశారని విన్నా. వారికీ థాంక్స్. ఆల్రెడీ విడుదల చేసిన 'లవ్ గంటే'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'కిన్నెర...'కూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యింది. రెండు రోజుల్లో ఫస్ట్ కాపీ వస్తుంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం" అని చెప్పారు. 'కిన్నెర...' హార్ట్ టచింగ్ సాంగ్ అని అనూప్ రూబెన్స్ చెప్పారు.

రాజశేఖర్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన కుమార్తె శివాని, నటులు సమీర్, భరణి శంకర్, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు. జీవితా రాజ‌శేఖ‌ర్ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్-ప్లే సమకూర్చిన 'శేఖర్' సినిమాను వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు.

Published at : 04 Feb 2022 07:36 PM (IST) Tags: Jeevitha Rajasekhar Anup Rubens Rajasekhar Sekhar Movie Shivani Rajashekar Kinneara Song in Sekhar Movie

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున

Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్

టాప్ స్టోరీస్

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
×