Nani: ‘లవ్ స్టోరీ’ థియేటర్లో విడుదలపై నాని స్పందన.. ఓటీటీలో ‘శ్యామ్ సింగరాయ్’?
‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్‌పై స్పందించిన నాని.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు.
‘లవ్ స్టోరీ’ విడుదల తేదీ సమయంలోనే ‘టక్ జగదీష్’ను ఓటీటీలో విడుదల చేయడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా థియేటర్ యాజమానులు నానిపై తీవ్రమైన విమర్శలు చేశారు. నాని నిజ జీవితంలో హీరో కాదని, పిరికివాడంటూ చేసిన వ్యాఖ్యలు నానిని బాధించాయి. ఈ నేపథ్యంలో ‘టక్ జగదీష్’ నిర్మాతలు ఎట్టి పరిస్థితిలో సినిమాను వినాయక చవితి రోజునే ఓటీటీలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ‘లవ్ స్టోరీ’ విడుదల తేదీని మార్చుకోక తప్పలేదు. ఎట్టకేలకు ‘లవ్ స్టోరీ’ శుక్రవారం (సెప్టెంబర్ 24) విడుదలైంది. ఈ సందర్భంగా నాని ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
‘‘సినిమా సక్సెస్ అయినందుకు ‘లవ్ స్టోరీ’ టీమ్, సాయి పల్లవి, నాగ చైతన్యకు అభినందనలు. థియేటర్లో సినిమా అంటే నాకు కూడా చాలా ఇష్టం’’ అని ట్వీట్ చేశాడు. దీనిపై నాని ఫాలోవర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అలాంటప్పుడు మీ సినిమాలన్నీ ఓటీటీలో ఎందుకు విడుదల చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తర్వాతి చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ కూడా ఓటీటీలో విడుదల చేస్తున్నారటగా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Wishing team #LoveStory a huge success. With this team @chay_akkineni @Sai_Pallavi92 #ShekharKammula I already know I will love it 🤗
— Nani (@NameisNani) September 24, 2021
Theatres it is 🤍
‘శ్యామ్ సింగరాయ్’పై కన్నేసిన నెట్‌ఫ్లిక్స్: నాని నటించిన సినిమాలు ఇప్పట్లో థియేటర్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నాని నటించిన ‘వి’, ‘టక్ జగదీష్’లు ఇప్పటికే అమేజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యాయి. విడుదలకు సిద్ధమవుతున్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం కూడా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ‘నెట్‌ఫ్లిక్స్’ ఓటీటీ సంస్థ చిత్ర నిర్మాతలను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ముందుగా థియేటర్లలోనే విడుదల చేస్తామని, ఆ తర్వాతే ఓటీటీకి ఇస్తామని గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెటిఫిక్స్ రైట్స్ కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ ఈ చిత్రంలో కథానాయికలు. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీ ‘శ్యామ్ సింగరాయ్’ తెరకెక్కుతోంది.
Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్
Also Read: ప్రభుత్వం ఆధీనంలో సినిమా టికెట్లు.. లాభం ఎవరికీ? ఇక బెనిఫిట్ షోలు ఉండవా?