Sehari Movie Trailer: సుబ్బలక్ష్మితో పెళ్లి... ఆమె అక్కతో ప్రేమ... వరుణ్ లైఫ్‌లో లొల్లి... ఫన్నీ ఫన్నీ!
'సెహరి'... ఫిబ్రవరి 11న విడుదల కానున్న సినిమా. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన సినిమా 'సెహరి'. జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా నేడు (బుధవారం) ట్రైలర్ విడుదల చేశారు.
'సెహరి' ట్రైలర్ చూస్తే... ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. హీరో, అతని ఫ్రెండ్స్ మధ్య సీన్స్ బావున్నాయి. హీరో లైఫ్‌లో కాంఫ్లిక్ట్ కూడా బావుంది. సుబ్బలక్ష్మి అనే అమ్మాయితో హీరో పెళ్లికి రెడీ అవుతాడు. పెళ్లికి కొన్ని గంటల ముందు ఆమె అక్కతో ప్రేమలో ఉన్న సంగతి బయట పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది క్వశ్చన్ మార్క్ కింద వదిలేసినా... ట్రైలర్ అంతా ఆసక్తికరంగా సాగింది. హీరో తండ్రి పాత్రలో సీనియర్ సంగీత దర్శకులు కోటి నటించారు. ఆమె క్యారెక్టర్‌ను కూడా మంచి ఫన్నీగా చూపించారు. ట్రైలర్ మొత్తంలో అభినవ్ గోమఠం హైలైట్ అయ్యారు.
సకుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్ళి హాయిగా నవ్వుకుని ఆనందించదగ్గ సినిమా ఇదని నిర్మాత ఆద్వయ జిష్ణు రెడ్డి తెలిపారు. చిత్రకథ, పాత్రలు అన్నీ యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దామని దర్శకుడు జ్ఞానసాగర్ చెప్పారు.
RachaLeppudam 🤙See you on FEB 11th !!🤝🏻❤️
— Harsh Kanumilli (@HarshKanumilli) February 2, 2022
Coming with a Perfect entertainer one can witness for a Valentine's Day! 😍
Here's #SehariTrailer🎺
▶️ https://t.co/fpHEshRN0s#SEHARI @SimranCOfficial @gnanasagardwara @prashanthvihari #AdvayaJishnuReddy #SehariOnFeb11 pic.twitter.com/0bthfpPguf
View this post on Instagram