Image Credit:Prabhas/Instagram
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాను రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించారు. చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారత్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తోన్న సినిమా ‘ఆదిపురుష్’. మూవీ టీమ్ కూడా ఈ సినిమా పై అదే కాన్ఫిడెన్స్ తో ఉంది. అందుకే సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గడం లేదు. అందులో భాగంగానే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 2 కోట్లు ఖర్చు చేసి తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అయితే, అకస్మాత్తుగా మొదలైన వర్షం నిర్వహాకులను కలవరపెడుతోంది. అయితే, అభిమానులు మాత్రం వర్షాన్ని లెక్క చేయకుండా ఈవెంట్‌కు తరలిరావడం గమనార్హం. ప్రభాస్ ఫ్యాన్స్‌తో మొత్తం ఆ మైదానం కిక్కిరిసిపోయింది.
తిరుపతిలో ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు జరుగుతాయని ముందే అనౌన్స్ చేశారు. కొన్ని రోజుల ముందునుంచే అక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కూడా గత రెండు రోజుల క్రితం వర్షాలు కురిశాయి. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏమైనా ఆటంకం కలుగుతుందా అని సందేహం వ్యక్తం చేశారు అభిమానులు. నిన్నటి వరకూ బాగానే ఉన్న వాతావరణం ఈరోజు సాయంత్రం ఉన్నట్టుంది చల్లగా మారిపోయింది. ఇప్పటికే అక్కడ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఉన్నట్టుండి సభా ప్రాంగణం ప్రాంతంలో వర్షం కురవడం మొదలైంది. మధ్యలో కాస్త తగ్గుముఖం పట్టడంతో కార్యక్రమాన్ని అనుకున్న సమయానికే మొదలుపెట్టారు.
‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ ను చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈవెంట్ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందే అక్కడ చిన్ని చిరు జల్లలు కురవడం ప్రారంభించాయి. అయితే వాన తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో ఏర్పాట్లలో బిజీ అయిపోయారు నిర్వాహకులు. కానీ ఒక్కసారిగా వాన పెరిగిపోయింది. గత కొద్ది సేపటినుంచి కూడా అక్కడ వాన విపరీతంగా పడుతోంది. దీంతో ఎక్కడ పనులు అక్కడే వదిలేసి అన్నిటిని తడవకుండా కప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భారీ అంచనాలతో వేలాదిగా ప్రభాస్ అభిమానులు సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇప్పుడు వారంతా అదే వర్షంలో అక్కడే ఎదురుచూస్తున్నారు. కాసేపట్లో వర్షం తగ్గిపోతుంది ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది, తమ అభిమాన హీరోను చూడొచ్చు అని వర్షంలో తడుస్తూ ఉండిపోయారు. కానీ అక్కడ వర్షం మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మరి వర్షం తగ్గిన తర్వాత కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.
Silk Smitha: సిల్క్ స్మిత కొరికిన యాపిల్ - వేలంపాటలో ఎంత ధర పలికిందో తెలుసా?
Bigg Boss Season 7 Day 18 Updates: ఒక్కటైన ప్రియాంక, శోభ - ప్రిన్స్‌కు మళ్లీ షాక్, లోన్ తీసుకొని వచ్చానంటూ కన్నీళ్లు
Gandharvudu Jr: జూనియర్ ‘గంధర్వుడు’గా వస్తోన్న జనతా గ్యారేజ్ నటుడు!
Anil Kapoor: ఏఐ టెక్నాలజీపై కోర్టుకెక్కిన అనిల్ కపూర్ - పర్సనాలిటీ రైట్స్ కోసం పోరాటం, అసలు వాటి అర్థమేంటి?
Bigg Boss Season 7 Telugu: శోభాశెట్టితో సందీప్ కుమ్మక్కు? గౌతమ్‌కు అన్యాయం - ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది!
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!
Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
/body>