Bahumukham: అమెరికాలో తీసిన 100 పర్సెంట్ పక్కా తెలుగు సినిమా
Bahumukham First Look Launched: తెలుగు తెరకు మరో హీరో పరిచయం కానున్నారు. తొలి సినిమాతో దర్శక నిర్మాణ బాధ్యతలను సైతం అతను మోశారు. ఆ హీరో ఎవరు? ఆ కథ ఏమిటి? అనేది చూస్తే...
Harshiv Karthik’s Suspense Drama Thriller Bahumukham First Look Launched: ''మేడిన్ అమెరికా... అసెంబుల్డ్ ఇన్ ఇండియా... 100 పర్సెంట్ పక్కా తెలుగు సినిమా'' అంటూ 'బహుముఖం' ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జస్ట్ క్యాప్షన్ మాత్రమే కాదు... లుక్ కూడా అదిరింది. టాలీవుడ్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ డిఫరెంట్ జోనర్స్, ఫిల్మ్ మేకింగ్స్, కొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్నారు. మన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ లిస్టులో మరో టాలెంటెడ్ ఆర్టిస్ట్ & టెక్నీషియన్ రాబోతున్నాడు. అతని పేరు హర్షివ్ కార్తీక్.
హర్షివ్ కార్తీక్ హీరోగా యాక్ట్ చేయడంతో పాటు కెమెరా వెనుక పలు బాధ్యతలు భుజాన వేసుకున్న సినిమా 'బహుముఖం'. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
బహుముఖం... గుడ్, బ్యాడ్ & యాక్టర్!
యువ కథానాయకుడు హర్షివ్ కార్తీక్ (Harshiv Karthik) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బహుముఖం'. గుడ్, బ్యాడ్ & యాక్టర్.. అనేది ఉపశీర్షిక. ఇందులో హీరోగా నటించడంతో పాటు రచన, దర్శక - నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించారు హర్షివ్. గ్యారీ బీహెచ్‌తో కలిసి ఎడిటింగ్ కూడా చేశారు. ఇందులో స్వర్ణిమా సింగ్, మరియా మార్టినోవా హీరోయిన్లు.
'బహుముఖం' ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... హర్షివ్ కార్తీక్ కాంప్లెక్స్ క్యారెక్టర్ చేసినట్లు అర్థం అవుతోంది. ఫోటో ఒక్కటే. కానీ, అందులో రెండు ముఖాలు ఉన్నాయి. ఒక వైపు నుదుట విభూతి, కన్నీరు, శివుని తరహాలో నీలం రంగు... మరో వైపు చిరునవ్వు! మెడలో ముత్యాల గొలుసు, రెండు చేతులను బంధించిన సంకెళ్లు... హీరో పాత్రలో విలక్షణ స్వభావాన్ని ఈ పోస్టర్ చూపిస్తుంది. అసలు కథ ఏమిటి? అనేది తెలియాలంటే థియేటర్లలో సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాలి.
Also Read: గురూజీ ముఖంలో నవ్వులు - 'గుంటూరు కారం' విడుదలయ్యాక తొలిసారి...
Made in USA 🇺🇸
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 27, 2024
Assembled in INDIA🇮🇳
100% Pakka Telugu Cinema 😎✊@CMountainP Production No-1 Titled as #BAHUMUKHAM ~ Good, Bad & The Actor 🔥
An Intense suspense thriller by @HarShivKarthik 🎬
Coming soon to surprise you ❤️🔥
Stay Tuned 💥#SwarnimaSingh #MariaMartynova pic.twitter.com/UPTgB38nle
సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్‌గా 'బహుముఖం' తెరకెక్కుతోంది. ఈ సినిమాను అట్లాంటా, మాకాన్, కాంటన్, జార్జియా, యుఎస్ఏ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు. ల్యూక్ ఫ్లెచర్ సినిమాటోగ్రఫీ అందించగా... ఫణి కళ్యాణ్ స్వరాలు అందించారు. రామ్ మనోహర్ రెండు పాటలు రాశారు. మాధవన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన నంబి నారాయణన్ బయోపిక్ 'రాకెట్రీ'లో తెలుగు వెర్షన్ సాంగ్స్ రెండు ఆయన రాశారు. ఆ తర్వాత రామ్ మనోహర్ పాటలు రాసిన చిత్రమిది. మధ్యలో ప్రయివేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌కు సాహిత్యం అందించారు.
Also Read: నైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?
హర్షివ్ కార్తీక్ హీరోగా, స్వర్ణిమా సింగ్ & మరియా మార్టినోవా హీరోయిన్లుగా నటించిన ఈ 'బహుముఖం' చిత్రానికి కూర్పు: గ్యారీ బీహెచ్ - హర్షివ్ కార్తీక్, ఛాయాగ్రహణం: ల్యూక్ ఫ్లెచర్, మాటలు: రామస్వామి - హర్షివ్ కార్తీక్, సాహిత్యం: రామ్ మనోహర్, నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల, సంగీతం: ఫణి కళ్యాణ్, సహ నిర్మాత: అరవింద్ రెడ్డి, రచన - డిజైన్ - నిర్మాణం - దర్శకత్వం: హర్షివ్ కార్తీక్.