Vennela Kishore as Rithwik Sodhi: నైటీ వేసిన నాటీ ఫెలో, 'హ్యాపీ బర్త్ డే'లో వెన్నెల కిశోర్ అలా!
'హ్యాపీ బర్త్ డే' సినిమాలో వెన్నెల కిషోర్ రోల్ ను పరిచయం చేస్తూ.. చిన్న వీడియోను వదిలారు.
నటి లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'హ్యాపీ బర్త్ డే'. 'మత్తు వదలరా'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రాణా రూపొందిస్తోన్న రెండో సినిమా ఇది. నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను వదిలారు. ఇందులో వెన్నెల కిషోర్ పాత్ర హైలైట్ గా నిలిచింది. సినిమాలో ఆయన మంత్రిగా కనిపించనున్నారు.
చట్టసభలో గన్ బిల్ పాస్ చేయాలని రచ్చ చేసే మంత్రి రిత్విక్ సోది పాత్రలో ఆయన కనిపించనున్నారు. తాజాగా మరోసారి వెన్నెల కిషోర్ రోల్ కి సంబంధించి చిన్న వీడియోను వదిలారు. ఇందులో వెన్నెల కిషోర్ నైటీ వేసుకొని కనిపించారు. 'నైటీ వేసిన ఈ నాటీ ఫెలో ఎవరు సుయోధనా..? పేరు రిత్విక్ సోది.. ఓ వర్గానికి విరోధి' అంటూ ఈ వీడియోలో డైలాగ్ వినిపించింది.
రెండు మెషీన్ గన్స్ పట్టుకొని నైటీ వేసుకొని చాలా తన సీరియస్ ఫన్నీ ఎక్స్ ప్రెషన్ తో కనిపించారు వెన్నెల కిషోర్. జూలై 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు సైలెంట్ గా ఈ సినిమాను మొదలుపెట్టినా.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం అసలు తగ్గడం లేదు. మెల్లమెల్లగా జనాల్లోకి ఈ సినిమాను తీసుకెళ్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Also Read: పవన్ అంటే నాకు చాలా ఇష్టం - సాయిపల్లవి మాటలు విన్నారా?
Also Read: లేడీ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ - హీరోయిన్ ఎవరంటే?
View this post on Instagram