News
News
X

Happy Birthday Puri Jagannadh: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ బర్త్ డే సెలబ్రేషన్స్, పూరీకి తన స్టైల్లో విషెష్ చెప్పిన 'లైగర్' విజయ్

దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా అతికొద్ది మంది మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. మరోవైపు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు హీరో విజయ్ దేవరకొండ.

FOLLOW US: 

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల్లో ఒకరైన పూరీ.. కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన దారిలో వెళ్తున్నాడు. కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పూరీ... కథ ఏదైనా పాత్ర ఎలాంటిదైనా ప్రేక్షకుడికి నచ్చేలా తెరకెక్కించడంలో పూరీ స్టైలే వేరు. హీరోయిజాన్ని చూపించడంలో తనకు సాటెవ్వరు అన్నట్టే ఉంటాయ్ పూరీ సినిమాలు. అందుకే హిట్టు-ఫ్లాపులతో సంబంధం లేకుండా సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ పూరీతో కలసి పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తారు.

పూరీ జగన్నాథ్ బర్త్ డే సెలబ్రేషన్స్

News Reels

ఈ డాషింగ్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది

నటుడిగా అతి పెద్ద ప్లాట్ ఫాం ఇచ్చిన దర్శకుడు.. సంతోషం-బాధ ఏదైనా  పంచుకునే స్నేహితుడు...ఇంటికి దూరంగా ఉంటూ అల్లరి చేసటప్పుడు నా గార్డియన్ అంటూ విజయ్ పూరీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం  విజ‌య్ దేవ‌ర‌కొండ‌ పూరీ దర్శకత్వంలో  'లైగ‌ర్' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ సూపర్బ్ అనిపించింది.  ఈ సినిమాకు పూరీతో పాటూ  ఛార్మి,  బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. 

ఈ రోజు పూరీ బర్త్ డే  సందర్భంగా  ఎంతోమంది సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్‌తో ముంచెత్తుతున్నారు. ఓఅభిమాని క్యూబిక్‌ స్క్వేర్స్‌తో పూరీ బొమ్మ వచ్చేలా చేశాడు. అద్భుతంగా ఉన్న ఆ వీడియోని ఛార్మీ కౌర్‌  ట్విట్టర్లో షేర్‌ చేసింది. ‘ ఇది మైండ్ బ్లోయింగ్. చాలా కష్టమైన దీన్ని ఎలా చేశావో చెప్పు’ అంటూ క్యాప్షన్‌  జోడించింది.  అయితే అంతకుముందు పూరితో కలిసి ఉన్న ఫోటోని పోస్ట్‌ చేసిన ఈ బ్యూటీ ‘నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు నాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ, మిమ్మల్ని గర్వపడేలా చేస్తున్నాననే అనుకుంటున్నా’ అని రాసుకొచ్చింది. 

Also Read: బన్నీ- లెక్కల మాస్టారు తగ్గేదే లే అన్నారు...ఇప్పుడు తగ్గక తప్పడం లేదా...మరోవైపు 80 మిలియన్ వ్యూస్ కి చేరిన 'పుష్ప' సింగిల్ సాంగ్

Also Read: తండ్రికి వెనకడుగు వేయక తప్పని పరిస్థితి కల్పించిన విజయ్.. సంతోషంలో అభిమానులు

Also Read: దర్శకుడు పూరీ జగన్నాథ్ కి మైండ్ బ్లోయింగ్ విషెష్ చెప్పిన అభిమాని

Also Read: హ్యాపీ బర్త్ డే ఇస్మార్ట్ పూరీ , మందు గ్లాసుతో దర్శకుడికి బర్త్ డే విషెష్ చెప్పిన బ్యూటీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Sep 2021 03:58 PM (IST) Tags: Vijay Devarakonda Puri Jagannadh Happy Birthday "Liger" Birthday Wishes To Director

సంబంధిత కథనాలు

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు: అడివి శేష్

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు:  అడివి శేష్

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో  - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్