News
News
X

Guppedantha Manasu February 4th Update: ఆఖరి శ్వాసవరకూ రిషి సార్ ప్రేమకోసమే తపిస్తానన్న వసు, దేవయాని స్కెచ్ పసిగట్టేసిన జగతి-మహేంద్ర

Guppedantha Manasu February 4th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు ఫిబ్రవరి 4 ఎపిసోడ్ (Guppedanta Manasu February 4th Update)

వసుధార మెడలో తాళి రాజీవ్ కట్టలేదని తెలియడంతో జగతి, మహేంద్ర, రిషి షాక్ అవుతారు. మరోవైపు కాలేజీలో స్టాఫ్ రిషి-వసుని అనకూడని మాటలన్నీ అంటారు. అవన్నీ విని జగతి ఫీలవుతుంది
జగతి:  ఏంటి మహేంద్ర ఇది. ఓ టాపిక్ తో మళ్ళీ రిషిని చిత్రవధ పెట్టేలా ఉన్నారు. అసలు వసుకి బుద్ధి లేదు. రిషి ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటే వసు ఇలా చేస్తోంది 
మహేంద్ర: ఏదో ఒకటి కాదు వసుధార దగ్గరికి వెళ్లి నిజం చెప్పమని నిలదీద్దాం
జగతి:  వసుధార నిజం చెబుతుందని అనుకుంటున్నావా మహేంద్ర 
మహేంద్ర: ఆ రోజు చక్రపాణి గారు ఈ విషయం చెప్పడానికి ఇంటికి వచ్చారేమో 
అవును మహేంద్ర ఆయనను కలిస్తే మనకు కచ్చితంగా నిజం తెలుస్తుంది వెళ్దాం పద అని అక్కడి నుంచి చక్రపాణిని కలుస్తారు
రాజీవ్...కాలేజీకి వచ్చి నానా రచ్చ చేశాడని అసలు విషయం చెప్పి..వసుధార మెడలో రాజీవ్ తాళికట్ట   వచ్చి నానా రచ్చ చేశాడు పోలీసులు పట్టుకెళ్లారు అనడంతో చక్రపాణి షాక్ అవుతాడు. వసుధార మెడలో రాజీవ్ తాళి కట్టకపోతే మరి ఎవరు కట్టారని అడుగుతుంది జగతి... చక్రపాణి సందేహిస్తుండగా..ఇంతలో వసుధార వచ్చి నేను చెబుతానంటూ...మొత్తం చెబుతుంది వసుధార...
మొత్తం  విని జగతి- మహేంద్ర షాక్ అవుతారు. ఆరోజు మిమ్మల్ని వాడు చంపేస్తానని బ్లాక్మెయిల్ చేస్తేనే నేను ఇలా చేశాను అనడంతో ఆశ్చర్యపోతారు. తన మెడలో ఉన్న తాళిని బయటకు తీసి ఇది ఏంటి మేడం ఇది ఎవరిచ్చారు అనడంతో జగతి ఆలోచనలో పడుతుంది. నేను ఇచ్చాను వసుధార అంటూనే...నీ మెడలో తాళిబొట్టు ఎవరు కట్టారు అనడంతో ఇంకెవరు కడతారు అని మేడం రిషి సారే అనడంతో మహేంద్ర,జగతి ఇద్దరు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార అనడంతో 
వసుధార: అవును మేడం ఇది రిషి సార్ కట్టాడు అని అనగా జగతి వాళ్ళు షాక్ లో ఉంటారు. నా చేతులతో నేనే ఈ తాళిబొట్టుని నా మెడలో వేసుకున్నాను కానీ మానసికంగా రిషి సార్ నా మెడలో వేసినట్టు భావించాను. అప్పుడు నేనున్న పరిస్థితులలో రాజీవ్ బావ నుంచి తప్పించుకోవడానికి నాకు అదే కరెక్ట్ అని అనిపించింది అందుకే ఇలా చేశాను మేడమ్ 
జగతి: కన్నీళ్లు పెట్టుకుంటుంది. జరిగింది మొత్తం రిషికి చెప్పెయ్
వసుధార: రిషి సార్ అంతట రిషి సార్ తెలుసుకోవాలి 
చక్రపాణి: నువ్వు చెప్పు లేకపోతే మేము చెబుతాం 
వసుధార: వద్దు నాన్న నన్ను క్షమించు నాన్న నీ మీద నాకు గౌరవం ఉంది కానీ నాకు మధ్య ఎవరు సంప్రదింపులు జరపకూడదని అనుకున్నాను . రిషి సార్ నన్ను అపార్థం చేసుకున్నాడు. అపార్థంని రిషి సార్ తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రేమ మాకు పరీక్ష పెడుతుంది ఆ పరీక్షలో రిషి సార్ నన్ను గెలిపిస్తాడని నమ్మకం నాకు ఉంది 
అప్పుడు వసుధారని జగతి హగ్ చేసుకుని సోరీ చెబుతుంది
వసుధార: నేను రిషి సార్ లేకపోతే ఉండలేను అని అనుకున్నాను అలాగే నేను కూడా లేకపోతే రిషి సార్ ఉండలేడు అన్న నిజాన్ని తెలుసుకోవాలి. మీరు కూడా ఈ నిజాన్ని రిషి సార్ కి చెప్పొద్దు చెప్పాలంటే మా ప్రేమ మీద ఒట్టే అని వసుధార జగతితో ఒట్టు వేయించుకుంటుంది.

Also Read: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!

రిషి రూమ్ లో కూర్చుని జరిగిన విషయాలు తలుచుకుని అసలు వసుధార మెడలో రాజీవ్ తాళి కట్టలేదు అన్నప్పుడు ఇంకెవరు కట్టారు నాకు తెలియకుండా వసుధార జీవితంలో ఇంకా ఎవరు ఉన్నారు అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే జగతి,మహేంద్ర అక్కడికి వస్తారు. 
రిషి: మేడం వసుధార నిజంగా మీకేం చెప్పలేదా అని ఆతృతగా అడిగుతాడు
జగతి: ఇలా నిజం దాచిపెట్టి నటించడం నావల్ల కావడం లేదు
మహేంద్ర: కొంప ముంచకు జగతి..వసుధార ఒట్టేయించుకుంది కదా
జగతి: నాకు వసుమాట కన్నా రిషి ముఖ్యం
మహేంద్ర: వద్దు జగతి..
రిషి: వసుధార చెప్పలేదే అనుకోండి మీరైనా తనని అడగొచ్చు కదా..
జగతి: తను ఎవర్ని పెళ్లిచేసుకుంటే నాకేంటి..నానెందుకు అడుగుతాను... వసుధార జస్ట్ ప్రాజెక్ట్ హెడ్.. కాలేజీ విషయాలు వేరు పర్సనల్ విషయాలు వేరు వాటిని కలపద్దు అని నువ్వే అన్నావు కదా 
ఇంతలోనే దేవయాని అక్కడికి వస్తుంది. అప్పుడు దేవయాని దొంగ ప్రేమలు కురిపిస్తూ ఉండగా మహేంద్ర సెటైర్లు వేస్తుంటే జగతి నవ్వుకుంటూ ఉంటుంది.  ఆ వసుధారను తలుచుకుంటేనే కడుపు మండిపోతుంది అనడంతో నువ్వే నా జగతి ఇలా మాట్లాడుతోందని  దేవయాని అంటే అవును అక్కయ్య అంటుంది జగతి

Also Read: ఈ రాశివారు తెలియని వ్యక్తులతో అతి చనువు ప్రదర్శించకండి, ఫిబ్రవరి 4 రాశిఫలాలు

ఆ తర్వాత జగతి,మహేంద్ర రూమ్ లోకి వెళ్లి జరిగిన విషయాలు తలుచుకుని రిషి బాధని తలుచుకుని బాధపడుతూ ఉంటారు. అప్పుడు జగతి ఈ విషయంలో దేవయాని అక్కయ్య హస్తం కూడా ఉంటుంది అనడంతో నిజమా జగతి అంటాడు మహేంద్ర. తన పెత్తనం కోసం ఎంతకైనా దిగజారుతుంది ఎంతకైనా తెగిస్తుంది అంటుంది జగతి. అప్పుడు వాళ్ళిద్దరూ రిషి ని తలుచుకుని  బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు.

Published at : 04 Feb 2023 09:18 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial February 4th Episode

సంబంధిత కథనాలు

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం