Guppedantha Manasu మార్చి 5 ఎపిసోడ్: రిషి బాధను దూరం చేసే పనిలో పడిన వసుధార, ఆశ్చర్యంలో గౌతమ్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.జగతి నా భార్య అని మహేంద్ర ప్రెస్ మీట్లో చెప్పడంతో వాతావరణం వేడెక్కింది. ఈ రోజు కూడా ఆ హీట్ కొనసాగింది. మార్చి 5 శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంత మనసు మార్చి5 శనివారం ఎపిసోడ్
రిషి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో గౌతమ్ కి కాల్ చేసిన వసుధార...రిషితో ఎలా ఉండాలో జాగ్రత్తలు చెబుతుంది. నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావ్, చిన్నప్పటి ఫ్రెండ్ ని అయినా నాకు తెలియని విషయాలు చెప్పావ్, నువ్వు చెప్పినట్టే వింటాను అంటాడు. ఓ కాలేజ్ స్టూడెంట్ ఇంతబాగా ఆలోచించడం గ్రేట్ అనుకుంటాడు గౌతమ్. బయట ఒంటరిగా కూర్చున్న రిషి...కాలేజీలో జరిగిన సంఘటన, ఇంట్లో తండ్రి మహేంద్ర అన్నమాటలు గుర్తుచేసుకుంటాడు. ఇంతలో అక్కడకు మహేంద్ర రావడంతో లేచి వెనక్కు తిరిగి నిల్చుంటాడు.
రిషితో మహేంద్ర
ఎక్కడో ఓ కథ చదివాను... రూపాయిని నువ్వెవరు అని అడిగారట.. ఒకరికి ఇస్తే అఫ్పు, బిచ్చగాడికి ఇస్తే ముష్టి, హారతి పళ్లెంలో పడితే దక్షిణ, తప్పు పని చేస్తే లంచం అందట. మనుషులం కూడా ఇంతే రిషి..పెదనాన్నకి తమ్ముడిని, ధరణికి మావయ్యని, నీకు తండ్రిని, జగతికి భర్తని. అదే రూపాయి అదే విలువ కానీ పిలిచే పేర్లు మారాయి. మనిషి బంధాలు కూడా ఇంతే. మనం అర్థం చేసుకునే విధానంలోనే అర్థం ఉంటుంది. అందరి ముందు నేనలా మాట్లాడటం నీకు కోపం తెప్పించేదమో, నచ్చలేదేమో కానీ... నేను మాట్లాడకపోతే ఆ రిపోర్టర్ జగతితో అన్న మాటలన్నీ నిజం అవుతాయ్..జగతిని అన్నన్ని మాటలు అంటుంటే చూస్తూ ఉండిపోవడం కరెక్ట్ కాదు. నిన్ను కుంతీ పుత్రుడు అన్నాడు... అయినా నేను సమాధానం చెప్పకపోతే ఎలా...మనిషి జీవితం ఓ ప్రయాణం అన్నారు దారిలో నది అడ్డొస్తే ప్రయాణం ఆపొద్దు, మార్చుకోవాలి, వెళ్లే పద్ధతి మార్చుకోవాలి..అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను , నువ్వు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు రిషి..జగతి విషయంలో నేను ఏ తప్పు చేయలేదు, తొందరపడలేదని నాకు తెలుసు. లవ్ యూ మై సన్ అంటాడు. ఈ మాటలన్నీ విన్నాక ఏమీ మాట్లాడకుండా రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Also Read: రావణ సంహారం జరిగిన తర్వాత కూడా సీతారాముల కష్టాలు పోలేదు, కార్తీక దీపం సీరియల్ లో మరో మలుపు
జగతి-వసుధార
మీరు తినకపోతే నేను కూడా తినను మేడం అంటుంది వసుధార. ఎందుకిలా హింసిస్తున్నావ్ నాతో నీకేంటి అంటుంది. మీరు ఖాళీ కడుపుతో పడుకుంటే నేను ఎలా కడుపునిండా తిని పడుకుంటా అంటుంది వసుధార.
జగతి: నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావ్, నేను మహేంద్ర రిషి గురించి ఆలోచిస్తున్నా వసు...వాళ్లు ఏ పరిస్థితిలో ఉన్నారో, కాల్ చేద్దామంటే మాట్లాడే స్థితిలో ఉన్నారో లేదో తెలియదు
వసుధార: జరిగిన దానిగురించి ఆలోచిస్తూ బాధపడడంలో అర్థం లేదు..రిషి సార్ కోపం, అలక కొత్త కాదు...ముందు ఓ విషయం గురించి కోపం చూపినా ఆ తర్వాత అందులో ఉన్న నిజానిజాలు ఆలోచిస్తారు.
జగతి: రిషి మనసు గాయపడిందన్న బాధే నాకు ఎక్కువగా ఉంది
వసుధార: రిషి సార్ మీ అబ్బాయి అని ఎప్పుడో అప్పుడు తెలియాలి కదా అది ఇప్పుడే తెలిసింది అనుకుందాం
జగతి: తెలిసిన పద్ధతి, సందర్భం కరెక్ట్ కాదు. నాలుగు గోడల మధ్య మాట్లాడాల్సిన విషయాన్ని మీడియా ముందు మాట్లాడటం బాధాకరం. నాకే ఇలా ఉండి ఉంటే రిషికి ఎలా ఉండాలి... వాళ్లు అడిగిన ప్రశ్నలు, అక్కడ చూసిన చూపులు తట్టుకోవాలంటే అంత ఈజీ కాదు...వసు ప్లీజ్ నేను తినే పరిస్థితిలో లేను నన్ను బలవంతం పెట్టకు..కాసేపు నన్ను ఒంటరిగా వదిలెయ్
మాట్లాడొచ్చా సార్ అంటూ రిషికి మెసేజ్ చేస్తుంది వసుధార. గుడ్ నైట్ అని అక్కడి నుంచి రిప్లై వస్తుంది. మాట్లాడితే మీ మనసులో బాధ తగ్గుతుంది అనుకుంటే ఏంటి సార్ మీరు అనుకుంటుంది వసుధార.
తెల్లారగానే సోఫాలో మహేంద్ర, గౌతమ్ కూర్చోవడం చూసి వచ్చి కూర్చున్న దేవయాని..రిషి ఇంకా నిద్రలేవలేదా కనిపించడం లేదు అంటుంది. ఏం మహేంద్ర రిషి గురించి పట్టించుకోవా వాడిని మొత్తానికి వదిలేశావా అంటుంది.
గౌతమ్: వాడేం చిన్నపిల్లాడు కాదుకదా
దేవయాని: ఒకరేమో అప్పుడు, ఇంకొకరేమో ఇప్పుడు అని మహేంద్రకి కౌంటర్ ఇస్తుంది
మహేంద్ర: గౌతమ్ ఫోన్ తీసుకురా అని పంపించిన మహేంద్ర...గౌతమ్ ముందు మాట్లాడటం మర్యాద కాదని మీకు తెలియదా
దేవయాని: అందరికీ తెలిసింది కదా..కొత్తగా దాచడానికి ఏముంది
మహేంద్ర: అందరికీ తెలిసింది కదా అని జగతి గురించి ఏదంటే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. ఈ మధ్య కాలంలో మీరు అనుకున్నది జరగలేదని బాధపడుతున్నారా
దేవయాని: నేను కోరుకోవడం ఏంటని రెట్టిస్తుంది
మహేంద్ర: అందరి ముందూ జగతి అవమానంతో వెళ్లిపోవాలని మీరు కోరుకుని ఉంటారు...కానీ అలా జరిగితే మహేంద్ర బతికినా చచ్చినట్టే అంటాడు. మీరు ఎంత దూరం పెట్టాలని చూస్తే నాకు అంత దగ్గరవుతుంది జగతి. ఈ సిటీకి రావొద్దనుకున్నారు వచ్చింది...కాలేజీలో చేరొద్దనుకున్నారు చేరింది...ఇంట్లోకి అడుగుపెట్టొద్దు అనుకున్నారు పెట్టింది... రిషి జగతి కొడుకు అన్న నిజం దాచాలనుకున్నారు ఇప్పుడు తెలిసింది...మీరు ఏది వద్దనుకున్నారో అవన్నీ జరుగుతున్నాయి..ఇంకా మనసులో ఏవేం జరగొద్దు అనుకున్నారో అవికూడా జరుగుతాయి... మీరు అనుకోండి..అదే జరుగుతుంది అని కూల్ గా మాట్లాడుతూ మంటపెడతాడు.
ఇంతలో గౌతమ్ ఫోన్ తీసుకురావడంతో థ్యాంక్స్ గౌతమ్ అనేసి..వదినగారూ మీక్కూడా థ్యాంక్స్ అని కౌంటర్ ఇస్తాడు. రగిలిపోయిన దేవయాని అక్కడి నుంచి లేచివెళ్లిపోతుంది.
కాలేజీలో
రిషి సార్ మనసు బాగాపోతే కాలేజీకి వస్తారు కదా ఇంకా రాలేదేంటని మెట్లపై కూర్చుని ఆలోచిస్తుంటుంది. ఇంతలో రిషి రానే వస్తాడు.
Also Read: బంధం, ప్రేమ, స్నేహం, అసూయ- గుండె బరువెక్కించిన శుక్రవారం ఎపిసోడ్
సోమవారం ఎపిసోడ్ లో
అనగనగా ఓ రాజ్యంలో ఓ రాకుమారుడు ఉండేవాడు..ఆ రాకుమారుడికే సమస్య వచ్చిందని కథ చెబుతుంటుంది. దగ్గరకు వచ్చి వసు చేతిలో పోన్ లాక్కున్న రిషి... నా బాధ నీకు కథావస్తువుగా మారిందా..నా సమస్య నాది..దాంతో నీకెలాంటి సంబంధం లేదంటాడు. అప్పుడే అక్కడకు వచ్చిన గౌతమ్ వసుధార లంచ్ చేద్దాం పద అంటాడు. నేను బాక్స్ తెచ్చుకున్నా సార్ అంటే.. అయితే ఆ బాక్స్ ఇద్దరం కలసి తిందాం అంటాడు గౌతమ్. వెంటనే స్పందించిన రిషి పద వసుధార లంచ్ చేద్దాం అంటాడు. అంతలోనే కోపం, అంతలోనే స్నేహం, అంతలోనే ప్రేమ మీరు నిజంగానే ప్రిన్స్ సార్ అనుకుంటుంది వసుధార...