Gruhalakshmi October 1st Update: పోలీస్ స్టేషన్లో ప్రేమ్, సామ్రాట్ సాయం- తులసిని ఇరికించేందుకు లాస్య స్కెచ్
తులసికి దూరంగా ఉండమని అనసూయ సామ్రాట్ కి చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ప్రేమ్ ఆడిషన్స్ కి సెలెక్ట్ అయిన దగ్గర ఒక వ్యక్తి తనకి అడ్డు పడతాడు. నాకు టాలెంట్ ఉండబట్టే సెలెక్ట్ అయ్యాను అని ప్రేమ్ అంటే కాదు మీ అమ్మ వల్ల అని ప్రేమ్ తో గొడవకి దిగిన వ్యక్తి అంటాడు. సామ్రాట్ గారి రికమండేషన్ తో వచ్చావ్ అని అంటే ఆడిషన్స్ దాకా రికమండేషన్ అయినా సెలెక్ట్ అయ్యింది మాత్రం నా టాలెంట్ తోనే అని ప్రేమ్ అంటాడు. చూడు బుజ్జి నీ టాలెంట్ తో కాదు మీ అమ్మ టాలెంట్ తో వచ్చావ్. మీ అమ్మ సామ్రాట్ ని ముగ్గులోకి దించి తన రైట్ హ్యాండ్ గా పాతుకుపోయింది ఆ లింక్ వల్లే సామ్రాట్ నిన్ను ఇక్కడ రికమండ్ చేశాడు.. నాకు అన్నీ తెలుసు అనేసరికి ప్రేమ్ ఆవేశంగా నా ముందే మా అమ్మని కామెంట్ చేస్తావా అని తనని కొడతాడు.
అక్కడి వాళ్ళు ఎంతగా ఆపినా కూడా ప్రేమ్ వినకుండా వాడిని కొడుతూనే ఉంటాడు. వెంటనే అక్కడ ఉన్న మరో వ్యక్తి పోలీసులకి ఫోన్ చేస్తాడు. సామ్రాట్ మీటింగ్ లో ఉన్నా కూడా అనసూయ మాటలు తలుచుకుంటూ మూడీగా ఉండటంతో ఒంట్లో బాలేదా అని తులసి మెసేజ్ చేస్తుంది. అదేమీ లేదని సామ్రాట్ చెప్తాడు కానీ తులసి తనని గమనిస్తూనే ఉంటుంది. స్టేషన్లో ఎస్సై ప్రేమ్ తో రూడ్ గా మాట్లాడతాడు. సామ్రాట్ ఒక్కసారిగా మీటింగ్ లో స్టాపిడ్ అని అరుస్తాడు. మీ మనసు ఎక్కడో ఉందని తులసి మెసేజ్ చేస్తే మీరు కాన్సెంట్రేషన్ చెయ్యాల్సింది నా మీద కాదు మీటింగ్ మీద అనేసరికి తులసి చిన్నబోతుంది.
Also Read: మాధవ్ మరో దారుణం- రుక్మిణిలో మొదలైన అనుమానం, అదిత్యపై అరిచిన సత్య
ప్రేమ్ సామ్రాట్ కి ఫోన్ చేస్తాడు. ప్రేమ్ జరిగింది అంతా సామ్రాట్ కి చెప్పి నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను అటెంప్ట్ తు మర్డర్ కేసు పెడదామని అంటున్నారు అనేసరికి సామ్రాట్ షాక్ అవుతాడు. వెంటనే స్టేషన్ కి వెళతాడు. ఏమైంది సామ్రాట్ గారు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లారు అని తులసి అనుకుంటుంది. సెల్ లో ప్రేమ్ తో గొడవ పడిన వ్యక్తి మళ్ళీ తులసి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడటంతో ఎస్సై వచ్చి ఆపుతాడు. సామ్రాట్ స్టేషన్ కి వచ్చి ప్రేమ్ ని వదిలిపెట్టమని ఎస్సై కి చెప్తాడు. సామ్రాట్ గురించి ప్రేమ్ తో గొడవపడిన వాడు మళ్ళీ నోటికి పని చెప్పి వాగుతూ ఉంటే సామ్రాట్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ప్రేమ్ సామ్రాట్ గారి దత్త పుత్రుడు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రేమ్ వెళ్ళి వాడి మీదకి కలబడతాడు. ఎంతకీ ఆగకపోవడంతో సామ్రాట్ ప్రేమ్ చెంప చెల్లుమనిపిస్తాడు.
బయటకి వచ్చిన ప్రేమ్ కి సామ్రాట్ క్లాస్ పీకుతాడు. మా అమ్మ గురించి ఎవరు అన్నా నేను తట్టుకోలేను, అమ్మ మీద నిందలు పడకుండా మీరే ఏదో ఒకటి చెయ్యండి, నేను సెల్ లో ఉన్నాను అని తెలిస్తే అమ్మ బాధపడుతుంది ఈ గొడవ మన మధ్యే ఉండాలి అమ్మకి తెలియకూడదు అని ప్రేమ్ సామ్రాట్ ని అడుగుతాడు. సామ్రాట్ కార్లో వెళ్తూ తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా మనసు చంపుకుని చెయ్యాలి అని అనుకుంటుంటే తులసి ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చెయ్యడు. తులసి పదే పదే ఫోన్ చెయ్యడంతో సామ్రాట్ కావాలని తన మీద అరుస్తాడు. ఫోన్ పెట్టేసి చాలా బాధపడతాడు.
Also Read: తులసికి వెన్నుపోటు పొడిచిన అనసూయ- ప్రేమ్ కి మ్యూజిక్ ఆఫర్, లాస్యని అజమాయిషీ చేసిన తులసి