Gruhalakshmi May 8th: జైల్లోనే నందు- ఇంట్లో అగ్గి రాజేసిన బసవయ్య, దివ్య గురించి అపార్థం చేసుకున్న విక్రమ్
లాస్య నిజస్వరూపం బయట పడటంతో నందు తనని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నందు అరెస్ట్ విషయంలో తులసి జోక్యం చేసుకోకపోవడంపై అనసూయ నిలదీస్తుంది. భార్యాభర్తల మధ్య వేలు పెడితే చూసే నలుగురు ఏమనుకుంటారని అంటుంది. ఇప్పటి వరకు నందుకి ఏ హోదాలో అండగా నిలబడ్డావని అడుగుతుంది. ఒక ఫ్రెండ్ గా శ్రేయోభిలాషిగా ఉన్నానని చెప్తుంది. ఇప్పుడు కూడా అలాగే ఉండి వాడికి సహాయం చేయమని పరంధామయ్య బతిమలాడతాడు. స్టేషన్ కి వెళ్దామని అంటే సరేనని వెళతారు. రాజ్యలక్ష్మి లాస్య ఫోన్ కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. నందు జైల్లో ఉన్నాడని దివ్యకి చెప్పావా లేదా అని అడుగుతుంది. ఎప్పుడో చెప్పానని అంటుంది. మన ఇద్దరి డీల్ గురించి ఇంట్లో వాళ్ళు దివ్యకి చెప్పరు మన ముందు కూడా ఓపెన్ గా డిస్కస్ చేయరని చెప్తుంది. నేను వాళ్ళింట్లో సెగ పెడతాను నువ్వు నీ కొడుకుని ఆయుధంగా మార్చుకోమని ఎక్కిస్తుంది.
Also Read: భవానీని తనవైపుకి తిప్పుకుంటున్న ముకుంద- ప్రేమలోకంలో విహరిస్తున్న కృష్ణ
దివ్య చెప్పాపెట్టకుండా బయటకి చెక్కేసింది తను చేసింది తప్పని విక్రమ్ కి అనిపించేలా చేయమని తమ్ముడు బసవయ్యని పురమాయిస్తుంది. తులసి వాళ్ళు నందు దగ్గరకి వస్తారు. నీ పట్ల చాలా అన్యాయం చేశాను చేసిన పాపం ఊరికే పోదు. లాస్య మాయలో పడి అహంకారంతో నీకు అడుగడునా అడ్డు పడ్డాను. నిజానికి గృహహింస కేసు పెట్టాల్సింది నువ్వు. కానీ లాస్య పెట్టింది నాకు దేవుడు తగిన శిక్ష వేశాడు అనుభవించాల్సిందేనని బాధపడతాడు. తండ్రిని చూసి దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటుంది. లాస్య నన్ను పాతాళానికి తొక్కేసిందని ఫీల్ అవుతాడు. మేమంతా నీకు అండగా ఉంటామని దివ్య ధైర్యం చెప్పేందుకు చూస్తుంది. అసలు ఏం జరిగింది లాస్య ఆంటీ కేసు పెట్టడం ఏంటి పరిస్థితి ఇక్కడ దాకా ఎందుకు వచ్చిందని దివ్య అడుగుతుంది. కానీ తులసి ఏమి చెప్పొద్దని సైగ చేస్తుంది. నందు మౌనంగా ఉండేసరికి ప్రాబ్లం ఏంటో చెప్పమని అడుగుతుంది. ఈ విషయంలో నీకు ఏమి సంబంధం లేదని దివ్యని అంటాడు. ఎంత అడిగినా కూడా ఎవరూ జరిగింది ఏంటనేది చెప్పరు.
అత్తయ్యకి చాలా పలుకుబడి ఉందని తనని హెల్ప్ అడుగుతానని దివ్య అంటుంది. కానీ నందు, తులసి మాత్రం సహాయం తీసుకోవడానికి అంగీకరించరు. పుట్టింటి బాధలు అత్తింటికి తీసుకెళ్లకూడదని తులసి చెప్తుంది. నిన్ను చూస్తుంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు మీ నాన్న సంగతి మేము చూసుకుంటామని తులసి కూతురికి నచ్చజెపుతుంది. కానీ దివ్య మాత్రం నాన్న బయటకి వచ్చే వరకు ఇంటికి వెళ్లనని తెగేసి చెప్తుంది. రాజ్యలక్ష్మి ఇంట్లో డ్రామా స్టార్ట్ చేస్తుంది. ప్రియ దివ్యని తీసుకుని రా ఎంత సేపని అడుగుతుంది. ప్రియ ఒక్కతే రావడంతో ఏమి తెలియనట్టు దివ్య ఎక్కడని అంటుంది. ఫోన్ ఏదో వస్తే మాట్లాడి కంగారుగా వెళ్లిపోయిందని ఎక్కడికో కూడా చెప్పలేదని ప్రియ చెప్తుంది. తన మాటలు విని విక్రమ్ కూడా బయటకి వస్తాడు.
Also Read: క్రూర మృగం కంటే దారుణంగా ఉన్న శైలేంద్ర- కొడుకుని కౌగలించుకుని గుండెలు పగిలేలా ఏడ్చిన జగతి
ఎక్కడికి వెళ్ళింది ఏదైనా సమస్య అని విక్రమ్ తాతయ్య కవర్ చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ బసవయ్య మాత్రం రాజ్యలక్ష్మి చెప్పినట్టు మంట రాజేస్తాడు. బయటకి వెళ్లేటప్పుడు ఇంటి పెద్ద అక్కకి చెప్పాలి కదా. పోనీ కట్టుకున్న భర్తకి అయినా చెప్పాలి కదా ప్రసన్న కూడా అంటుంది. చిన్న పిల్ల నేర్చుకుంటుందిలే అయినా నా టెన్షన్ బయటకి వెళ్ళిందని కాదు ఏ అవసరం వచ్చిందోనని నటిస్తుంది. విక్రమ్ దివ్యకి ఫోన్ చేస్తే ఆఫ్ అని వస్తుంది. తను ఏమైందో ఎక్కడికి వెళ్లిందో ఎలా తెలుస్తుందని ప్రసన్న అంటుంది. ఇప్పుడు తన అమ్మానాన్న ఫోన్ చేసి ఒకసారి ఇవ్వమని అంటే ఏం చెప్తాం నలుగురు మన గురించి ఏమనుకుంటున్నారు. కోరి కోడల్ని చేసుకుంటే ఇదేనా బహుమతి. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని ప్రసన్న మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. వద్దు అత్తని కదా అందరికీ నా మీద అనుమానం వస్తుందని రాజ్యలక్ష్మి నటిస్తుంది. మీరేమైన దెబ్బలాడుకున్నారా అంటే అదేమీ లేదని చెప్తాడు.
మోహన్ కోసం తులసి వాళ్ళు స్టేషన్ లో ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే మోహన్ ఖాళీ చేతులతో వస్తాడు. తప్పు చేశావ్ బావ గొడవ ఇక్కడి దాకా రాకుండా ఉండాలసిందని అంటాడు. తప్పు తనవైపు లేదని నందు చెప్తాడు.