Gruhalakshmi June 23rd: లాస్య దుమ్ముదులిపేసిన రాములమ్మ- తల్లిని మళ్ళీ పెళ్లి చేసుకోమని తండ్రికి చెప్పిన దివ్య
గృహలక్ష్మి సీరియల్ జూన్ 23: నందు, లాస్యకి విడాకులు కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కోర్టులో గెలిపించినందుకు నందు తులసిని మెచ్చుకుంటాడు. రాములమ్మ వస్తుంటే లాస్య కోపంగా తన జుట్టు పట్టుకుంటుంది. తులసమ్మ దగ్గర నేను సంస్కారం నేర్చుకున్నా లేదంటే నా మీద చెయ్యి లేపినందుకు చెయ్యి విరిచి పడేస్తాను. సీతమ్మ లాంటి తులసమ్మని మాయమాటలు చెప్పి నమ్మించి నందుని ఎత్తుకుపోయావు. మా పెద్దమ్మని అమాయకురాలిని చేసి ఇంటిని నీ పేరు మీద రాయించుకున్నావ్. డబ్బుకి కక్కుర్తి పడి దివ్య పెళ్లి కుదిర్చావు అది నమ్మక ద్రోహం కాదా అని రాములమ్మ లాస్యని నిలదీస్తుంది. ఆ ఇంటి వాళ్ళు దేవుళ్ళు పనిమనిషిని కూడా ఇంటి సభ్యురాలిగా చూస్తారని అంటుంది. తులసమ్మకి వ్యతిరేకంగా మారతానని ఎలా అనుకున్నావ్. మీకు దగ్గరుండి పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టింది. నందుని ఇంట్లో నుంచి తరిమేస్తుంటే అడ్డుపడి ఆపింది. ఇంత సాయం చేస్తే కృతజ్ఞత లేకపోగా విశ్వాసం చూపించకుండా ఉన్నావని రాములమ్మ రెచ్చిపోయి మాట్లాడుతుంది.
నువ్వు కుదురుగా ఉండి ఉంటే తులసమ్మ నీ కాపురాన్ని నిలబెట్టేది. కానీ నువ్వే నీ కాపురాన్ని కూల్చుకున్నావని తిడుతుంది. పనిమనిషిని నా మీదకి ఎగదోసి తమాషా చూస్తున్నావా అని లాస్య అరుస్తుంది. గెలిచావని సంబరపడుతున్నారు ఏమో దాన్ని లాక్కుని పాతి పెట్టేస్తానని వార్నింగ్ ఇస్తుంది. కాసేపు నందు, లాస్య పోట్లాడుకుంటారు.
Also Read: ఆట మొదలుపెట్టిన ముకుంద- కృష్ణ, మురారీ జీవితం చిక్కుల్లో పడబోతుందా?
లాస్య: నేను బాగుపడకపోయినా పర్వాలేదు మిమ్మల్ని మాత్రం బాగుపడనివ్వను. నా పెదాల మీద నవ్వు లేకపోయినా కానీ నిన్ను మాత్రం నవ్వనివ్వను
నందు: నీ ఇష్టం వచ్చింది చేసుకో అనేసి కారు కీస్ లాక్కుని లాస్య బ్యాగ్ విసిరి కొట్టేస్తాడు. మొగుడ్ని చంకనేసుకుని వేరు కాపురం పెట్టాలని అనుకున్నావ్ కదా ఇప్పుడు ఈ బ్యాగ్ పట్టుకుని తిరుగు
తులసి వాళ్ళందరూ రాములమ్మకి థాంక్స్ చెప్తారు. నందు వాళ్ళు కారులో బయల్దేరతారు. దివ్యని దారిలో డ్రాప్ చేసి వెళ్దామని తులసి అంటే వెళ్లనని చెప్తుంది. మా అమ్మ తలుచుకుంటే ఏమైన చేయగలదని మెచ్చుకుంటుంది. కోర్టుకి వెళ్తుంటే మనసు చంపుకుని బయల్దేరాను. ఈరోజుతో నా జీవితం అయిపోయిందని అనుకున్నా. అమ్మానాన్న, నువ్వు ప్రశాంతంగా ఉండాలని ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్తాడు. దివ్యని వాళ్ళ ఇంటికి దగ్గర దింపేసి వెళ్ళిరమ్మని చెప్తుంది. అదేంటి లోపలికి కూడా రావా అంటే వద్దామనే అనుకున్నా కానీ మీ అత్త అనే మాటలు పడలేనని అంటుంది.
తులసి: పుట్టింట్లో సమస్యల గురించి ఆలోచిస్తూ అత్తింట్లో సమస్య తెచ్చుకుంటున్నావ్. విక్రమ్ ని బాధపెడుతున్నావ్
దివ్య: విక్రమ్ నా భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎందుకు బాధపెడతాను
Also Read: రాజ్ దొంగపని చూసేసిన కావ్య- కళ్యాణ్ ని కూలోడిని చేసిన అప్పు
తులసి: పెళ్ళికి ముందు ప్రేమ వేరు, పెళ్లి తర్వాత వేరు. అత్తారింట్లో నువ్వు ఇమిడిపోవాలి. నువ్వు వాళ్ళకి అణుగుణంగా మారి నడుచుకోవాలి. అనుభవం మీద చెప్తున్నా జీవితం ఒక యుద్దం. మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్య చాలా తెగించాలి, భరించాలని చెప్తుంది.
నందు: దానికి వయసుకి మించిన మాటలు చెప్తున్నావ్
తులసి: వయసుకి మించిన భారం తలకెత్తుకుందని జాగ్రత్తలు చెప్తుంది. అది పూర్తయిన తర్వాత దివ్య నందుకి క్లాస్ పీకుతుంది. జరిగిన తప్పు దిద్దుకోమని సలహా ఇస్తుంది. ఈ మాట అమ్మ ముందు చెప్తే మొదటికే మోసం వస్తే నీతో మాట్లాడదని భయపడుతున్నా. నీ మనసులో ఏముందో తెలియదు కానీ చెప్తున్నానని ఇన్ డైరెక్ట్ గా తల్లిని పెళ్లి చేసుకోమనీ చెప్తుంది.