Gruhalakshmi February 25th: దివ్యని చూసి ప్రేమలో పడిపోయిన విక్రమ్- పెళ్లి సంబంధం ఖాయం చేసిన లాస్య
దివ్య ఎంట్రీ ఇవ్వడంతో గృహలక్ష్మి సీరియల్ కొత్త మలుపు తీసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రోడ్డు మీద ఒక అమ్మాయి తన ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని అంటుంది. తల్లి ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అమ్మనే అవమానిస్తుంది. అక్కడే ఉన్న మన హీరో ఎంట్రీ ఇచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. ఆ అబ్బాయి మెడ మీద కత్తి పెట్టి నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా ఇప్పుడు చెప్పు అనేసరికి అతను పారిపోతాడు. దీంతో ఆ అమ్మాయి తల్లికి సారి చెప్తుంది. దివ్య తులసికి ఫోన్ చేసి జాబ్ వచ్చిందని సంతోషంగా చెప్తుంది. దివ్య రోడ్డు మీద వెళ్తు ఉంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక కారు స్పీడ్ గా వస్తుంది. పిల్లల పక్కన నీటి గుంత ఉండేసరికి ఆ మురికినీరు పిల్లల మీద పడకుండా అడ్డం నిలబడుతుంది. ఆ కారు ఎవరిదో కాదు మన హీరో గారిది. కారు డ్రైవర్ తో పోట్లాటకు దిగుతుంది. హీరో తనని చూడగానే ప్రేమలో పడిపోతాడు.
Also Read: 'బ్రహ్మ' ఆట మొదలైంది- స్వప్న పెళ్లి కాంట్రాక్ట్ కావ్యకి, మరో అమ్మాయితో రాహుల్
అందమైన పిల్ల మెరుపుతీగలా కనిపించి మాయమైపోయిందని కాసేపు దివ్య అందాన్ని పొగుడుతూ ఉంటాడు. తులసి నందు కేఫ్ దగ్గరకి వస్తుంది. నందు తన బెస్ట్ ఫ్రెండ్ శరత్ ని తులసి వాళ్ళకి పరిచయం చేస్తాడు. దివ్య మ్యారేజ్ సెటిల్ అయ్యిందని లాస్య చెప్పేసరికి తులసి షాక్ అవుతుంది. దివ్యకి చెప్పకుండా పెళ్లి చూపులు జరగకుండా తనతో డిస్కస్ చేయకుండా అలా ఎలా డిసైడ్ చేస్తారని తులసి కోపంగా అంటుంది. మీ అమ్మాయిని మా అబ్బాయి ఢిల్లీలో చూశాడు తను మా ఇంటి కోడలు అయితే బాగుంటుందని శరత్ అంటాడు. కానీ తులసి మాత్రం అడ్డు చెప్తుంది. సరాదాగా మా అబ్బాయిని మీ ఇంటికి తీసుకోస్తాం పెళ్లి చూపులు కాదు గెట్ టు గెడర్ లాగా మా వాడు మీ అమ్మాయికి నచ్చితే ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దామని శరత్ అనేసరికి తులసి సరే అన్ని తల ఊపుతుంది.
రాజ్యలక్ష్మి తమ్ముడు బసవయ్య, అతని భార్య ప్రసూనంబ కాసేపు నవ్వు రాని కామెడీ చేసి చంపేస్తారు. అక్కడ పని చేసే అప్పిగాడు జ్వరంగా ఉందని అనేసరికి ఒక పెద్ద ఇంజెక్షన్ తీసుకొచ్చి వేసేందుకు అతని వెంట పడతాడు. రాజ్యలక్ష్మి చిన్న కొడుకే ఈ హీరో విక్రమ్. తల్లి చేసే పనులు నచ్చక తనతో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. దివ్య తనకి జాబ్ వచ్చిందని ఇంట్లో సంతోషంగా చెప్తుంటే లాస్య స్వీట్స్ తీసుకొచ్చి పెడుతుంది. కానీ ఇది జాబ్ వచ్చినందుకు కాదు నీకు పెళ్లి ఖాయం చేశామని అనేసరికి దివ్య షాక్ అవుతుంది. పెళ్లి కాదు కదా పెళ్లి చూపులకి కూడా ఒప్పుకోనని తెగేసి చెప్తుంది. ఇక దివ్య కోసం మరొక హీరో రాబోతున్నాడన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు సీరియల్ పరమ చెత్తగా ఉంది. ఎందుకు చూశాం రా బాబు అని తల పట్టేసుకుంటారు.
Also Read: కథలోకి కొత్త హీరో ఎంట్రీ, దివ్యకి జోడీ రెడీ- రాజ్యలక్ష్మికి శత్రువుగా మారిన తులసి