Gruhalakshmi December 23rd: నందు గౌరవాన్ని కాపాడిన మాజీ భార్య- తులసి, సామ్రాట్ రూ.10 ఛాలెంజ్!
లాస్య నిజస్వరూపం బయట పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నందు హోటల్ లో ఫుడ్ తిన్నాక బిల్ కట్టడానికి డబ్బులు తీసుకుందామని చూసేసరికి పర్స్ ఇంట్లో పెట్టి వచ్చినట్టు గుర్తు చేసుకుంటాడు. మేనేజర్ ని ఎలాగోకలా మేనేజ్ చేసి పరువు పోకుండా చూసుకోవాలని నందు వెళ్ళి మాట్లాడతాడు. కానీ ఆ మేనేజర్ నందుని తెగ తిడతాడు. ఫ్రీగా భోజనం పెట్టడానికి ఇది మీ అత్తారిల్లు అనుకున్నవా అని మేనేజర్ గట్టిగా అరుస్తాడు. ఆ మాటలు తులసి, సామ్రాట్ విని షాక్ అవుతారు. ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తానని నందు అనేసరికి అప్పటి వరకి మొబైల్ ఇక్కడ పెట్టేసి వెళ్ళమని అంటాడు. తులసి వాళ్ళు నందు దగ్గరకి వస్తాడు. నందు మొహం చూపించలేక సిగ్గుతో తలదించుకుంటాడు.
నందు బిల్లు తను కడతానని తులసి అడుగుతుంది. కానీ మేనేజర్ మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన నిజం చెప్పినా మీరు నమ్మడం లేదు అని తులసి అంటుంది. సామ్రాట్ కార్డ్ తీసి బిల్ కట్టేస్తాడు. తులసికి థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళగానే డబ్బులు పంపిస్తాను అని చెప్పి నందు బాధగా వెళ్ళిపోతాడు. శ్రుతి, అంకిత లాస్య దగ్గరకి వచ్చి దివ్య ఫ్రెండ్స్ వస్తున్నారని ఎటువంటి గొడవ చేయొద్దని చెప్తారు. తనకి కావలసింది తన మాట విని గుర్తింపు ఇవ్వడం అని లాస్య చెప్పేసి వెళ్ళిపోతుంది. దివ్య తన ఫ్రెండ్స్ ని తీసుకుని సంతోషంగా ఇంటికి వస్తుంది. అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా లాస్య ఎంట్రీ ఇస్తుంది.
Also Read: ముచ్చటగా మురిపిస్తున్న వేద, యష్ జంట- ఫుల్ ఖుషిలో సులోచన, మాలిని
తనని పరిచయం చేయవా అని లాస్య అడుగుతుంది. దివ్య తను లాస్య ఆంటీ మా డాడ్ కి సెకండ్ వైఫ్ అని అంటుంది. పెద్ద వాళ్ళు అంటే కాస్త అయినా గౌరవం ఉండాలి లాస్య కోపంగా అంటుంది. దివ్యకి అర్థం అయ్యేలా చెప్పమని లాస్య అంకిత వాళ్ళకి చెప్తుంది. తులసి, సామ్రాట్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తు మళ్ళీ ఇంకొక పందెం కట్టుకుంటారు. తులసి రూ.10 చేతిలో పెట్టి పది నిమిషాల్లో ఎవరు ఎక్కువ వస్తువులు కొనుక్కోస్తారో చూద్దాం అని వెళ్ళిపోతుంది. ఆ డబ్బుతో ఏం రావని సామ్రాట్ బిక్క మొహం వేస్తాడు. తులసి కూరగాయల షాప్ దగ్గరకి వెళ్ళి అన్ని కూరగాయలు ఒక్కొక్కటి కలిపి రూ.10 ఇవ్వమని అంటుంది. అటు సామ్రాట్ వెళ్ళి పది రూపాయాలకి బియ్యం తీసుకుంటాడు.
తులసి పది రూపాయాలకి కొన్నవి అన్ని సామ్రాట్ చేతిలో పెడుతుంది. సామ్రాట్ తను కొన్న బియ్యం తీసి లెక్కపెట్టుకోమని ఇస్తాడు. మీ లెక్క దాటి పోయాను అని చెప్తుంది. ఇది అతి తెలివి అని తులసి తుస్స్ మని గాలి తీసేస్తుంది. ఓపీసుకున్నా మీరే పోటీలో గెలిచారు. మిడిల్ క్లాస్ మహారాణులు అని చేతులెత్తి దణ్ణం పెట్టి ఒడిపోయాను అని ఒప్పేసుకుంటాడు. తులసి సామ్రాట్ ని ఒక అంతా ఆశ్రమానికి తీసుకుని వస్తుంది. పార్టీ ఇస్తానని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అడుగుతాడు. తను కూడా అనాథలాంటి దాన్నే అని తులసి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అనాథ ఆశ్రమానికి సాయం చేస్తాను అని సామ్రాట్ అంటాడు.
Also Read: సమస్యల ఊబిలో చిక్కుకుంటున్న రామా- అఖిల్ ఉద్యోగం కోసం డబ్బులడిగిన చరణ్
తులసి అందరికీ భోజనం ఇచ్చి సామ్రాట్ కి కూడా ఇస్తుంది. అక్కడి పిల్లలతో కలిసి కూర్చుని సంతోషంగా తింటారు. దివ్య వాళ్ళు పెద్ద సౌండ్ పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పరంధామయ్య వచ్చి వాళ్ళని ఎక్కిరిస్తాడు. ఇలాగేనా డాన్స్ చేసేది అని అంటాడు.