Ennenno Janmalabandham December 23rd: ముచ్చటగా మురిపిస్తున్న వేద, యష్ జంట- ఫుల్ ఖుషిలో సులోచన, మాలిని
వేద, యష్ వెకేషన్ కి వెళ్లడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఖుషి వేద వాళ్ళని చాలా మిస్ అవుతుంది. బెడ్ మీద ఓవైపు యష్ కోటు, మరో వైపు వేద చీర పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతుంది. మీరిద్దరూ అక్కడ గొడవ పడటం లేదు కదా అని ఖుషి అంటుంది. మీరు లేకపోతే చాలా బోర్ కొడుతుంది, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. ఎందుకంటే మమ్మీ ఖుషి బెస్ట్ ఫ్రెండ్స్. అని ఆ డ్రెస్ లకి ముద్దులు పెట్టుకుంటుంది. అమ్మమ్మ, నానమ్మ తనని చాలా ముద్దు చేస్తున్నారని చెప్పుకుంటుంది.
యష్, రాజా కలిసి చెస్ ఆడుకుంటూ ఉంటారు. రాణి తన భర్త చెస్ బాగా ఆడతాడని యష్ తో అంటుంది. వేద కూడా యష్ చెస్ బాగా ఆడతాడని చెప్తుంది. రాణి వేద యోగక్షమాలు గురించి అడుగుతుంది. మాటల మధ్యలో వేద కడుపున కూడా ఒక బిడ్డ పుడితే ఆ ఆనందమే వేరు అనేసరికి అందరూ బాధపడతారు. వేద కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి తన మైండ్ మార్చేందుకు యష్ కాఫీ అడుగుతాడు. భర్త కోసం ఎంతో ప్రేమగా వేద కాఫీ పెట్టుకుని తీసుకెళ్తుంది. వేద మాటల్లో పడి షుగర్ లెస్ కాఫీ యష్ కి, షుగర్ ఉన్న కాఫీ తాతయ్యకి ఇస్తుంది. కాఫీ వాసన ఘుమఘుమలాడిపోతుందని రాజా తెగ మెచ్చుకుంటాడు.
Also Read: సమస్యల ఊబిలో చిక్కుకుంటున్న రామా- అఖిల్ ఉద్యోగం కోసం డబ్బులడిగిన చరణ్
యష్ కూడా కాఫీ తాగి బిక్క మొహం వేస్తాడు. అటు షుగర్ కాఫీ తాగి రాజా కూడా బిత్తరపోతాడు. అయినా కూడా విషయం బయట పడకుండా కాఫీ గురించి మాట్లాడుతూ వింత వింతగా ప్రవర్తిస్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతారు. వాళ్ళ ప్రవర్తన చూసి ఏదో తేడా కొడుతుందని రాణి, వేద అనుకుంటారు. రాణి వెళ్ళి రాజా దగ్గర కాఫీ తీసుకుని తాగుతుంది. అది తాగి రాణి కూడా బిత్తరపోతుంది. తాతగారి కాఫీలో ఇంత షుగర్ వేశావ్ ఏంటి వేదమ్మా అని రాణి అడుగుతుంది. షుగర్ లెస్ యష్ కి వచ్చిందని అంటాడు. ఇద్దరూ చెప్పొచ్చు కదా అని అంటారు. వేద చేసిన పొరపాటుని కూడా యష్ మెచ్చుకుంటాడు. వేద వాళ్ళకి సోరి చెప్తుంది. నీ తప్పు కాదులే మేము ఆట ఆడుతూ పొరపాటున తీసుకున్నాం అని యష్ అంటాడు.
Also Read: తులసి ముందర నందుకి ఘోర అవమానం- లాస్యకి ఎదురుతిరిగిన శ్రుతి
‘నీ చేతితో ఏది ఇచ్చినా అమృతంలాగా ఉంటుంద’ని యష్ అంటాడు. రాజా యష్ ని అభినందిస్తాడు. చేదు కాఫీ ఇచ్చినా కూడా అందరి ముందు ఎత్తి చూపడం ఎందుకులే అని ఇష్టంగా తాగేశావ్. మంచి భర్తవి అనిపించుకున్నావ్. ఆడవాళ్ళు అన్నింటికన్నా ఎక్కువ విలువ ఇచ్చేది దేనికో తెలుసా మొగుడికి ఇష్టమైనవి వండి పెట్టడం’ అని రాజా చెప్తాడు. ‘తన చేతి వంటని తన మొగుడు మెచ్చుకుంటే మేం మురిసిపోతాం. భర్త దగ్గర నుంచి ఏమి ఆశించం చిన్న చిన్న పొగడ్తలు’ అని రాణి చెప్తుంది. భార్య చేసిన వంట రుచి చూడటం కాదు అది చేసిన భార్య మనసులో ప్రేమని చూడాలని చాలా గొప్పగా చెప్తారు. ‘దాంపత్యం అంటే ఇదే మీరు ఎలా ఉండాలని మేము ఆశపడ్డామో మీరు అలాగే ఉండండి. మీరిద్దరు ఎప్పుడు చల్లగా ఉండండి’ అని రాజారాణి కోరుకుంటారు. సులోచన సంతోషంగా మాలిని దగ్గరకి వస్తుంది. వేద, యష్ కలిసి ముచ్చటగా ముగ్గు వేశాడని సులోచన చెప్తుంది. ఆ వీడియో ఖుషి కూడా చూసి సంతోషిస్తుంది.